World Bank: ప్రపంచంలో అత్యధిక రెమిటెన్సులు పొందుతున్న దేశం?
విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడం(రెమిటెన్సులు)లో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. దీంతో ప్రపంచంలో అత్యధిక రెమిటెన్సులు పొందుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఈ విషయాలను వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ఈ మేరకు నవంబర్ 18న ఒక నివేదికను విడుదల చేసింది. 2021 ఏడాదిలో రెమిటెన్సుల రూపంలో భారత్‌కు రానున్న మొత్తం 87 బిలియన్ డాలర్లని (2020లో ఈ విలువ 83 బిలియన్ డాలర్లు) ప్రపంచబ్యాంక్ నివేదిక పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- భారత్ తర్వాత భారీగా రెమిటెన్సులు పొందుతున్న దేశాల్లో వరుసగా చైనా, మెక్సికో, ఫిలిప్పైన్స్, ఈజిప్టు ఉన్నాయి.
- భారత్‌కు రెమిటెన్సులు 2022లో 3 శాతం పెరిగి 89.6 బిలియన్ డాలర్లకు చేరుతాయని అంచనా.
- దిగువ, మధ్య స్థాయి ఆదాయ దేశాలకు రెమిటెన్సుల మొత్తం 2021లో 7.3 శాతం పెరిగి 589 బిలియన్ డాలర్లకు చేరనుంది.
- 2020తో పోల్చితే రెమిటెన్సుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండే వీలుంది. కోవిడ్–19 సవాళ్ల తీవ్రత తగ్గడం దీనికి కారణం.
- కోవిడ్–19 సంక్షోభ సమయంలో పలు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ ఇబ్బందుల పరిష్కారానికి, సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వ నగదు బదిలీ కార్యక్రమాలకుతోడు రెమిటెన్సుల తోడ్పాటు ఎంతగానో ఉంది.
చదవండి: కాగ్ తొలి ఆడిట్ దివస్‌ను ఎప్పుడు నిర్వహించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధిక రెమిటెన్సులు పొందుతున్న దేశంగా భారత్
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : ప్రపంచ బ్యాంక్
ఎక్కడ : ప్రపంచంలో...
ఎందుకు : విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడంలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్