Skip to main content

Hurun India Rich List: దేశీయంగా అత్యంత సంపదపరుల సంఖ్య ఎంత?

Mukes-Adani

10వ హరూన్‌ ఇండియా ఐఐఎఫ్‌ఎల్‌ రిచ్‌ లిస్ట్‌ నివేదిక సెప్టెంబర్‌ 30న విడుదలైంది. హరూన్‌ ఇండియా–ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ సంయుక్తంగా రూపొందించిన ఈ జాబితాలోకి రూ.1,000 కోట్లకుపైన సంపద కలిగిన వారిని తీసుకున్నారు. 2021 సెప్టెంబర్‌ 15 నాటికి ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకొని జాబితాను రూపొందించినట్లు హరూన్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు.

నివేదికలోని ముఖ్యాంశాలు...

 

  • 2021లో భారత్‌లో కొత్తగా 179 మంది అత్యంత సంపన్నులుగా మారిపోయారు.
  • మొత్తం మీద దేశీయంగా అత్యంత సంపదపరుల సంఖ్య 1,007కు చేరుకుంది.
  • కరోనా కారణంగా వేలాది మందికి ఉపాధి లేకుండా పోగా.. ఈ 1,007 మంది ఆస్తుల విలువ సగటున 25 శాతం చొప్పున పెరిగింది.
  • 1,007 మందిలోలో 894 మంది సంపదను పెంచుకోగా.. 113 మంది సంపద గడిచిన ఏడాదిలో క్షీణించింది. 
  • 1007 మందిలో 13 మంది రూ.లక్ష కోట్లకంటే ఎక్కువే సంపద కలిగి ఉన్నారు.
  • 2011 నాటికి 100లోపున్న సంపన్నుల సంఖ్య 1007కు చేరుకుంది. ఈ ప్రకారం వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య 3,000కు చేరుకోవచ్చు.

హరూన్‌ ఇండియా ఐఐఎఫ్‌ఎల్‌ రిచ్‌ లిస్ట్‌–2021

స్థానం  వ్యక్తి/కుటుంబం   సంపద(రూ. కోట్లలో)
1 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 7,18,000    
2 గౌతమ్‌ అదానీ కుటుంబం    5,05,900
3 హెచ్‌సీఎల్‌ శివ్‌నాడార్‌ కుటుంబం  2,36,600
4 ఎస్‌పీ హిందుజా కుటుంబం  2,20,000
5 ఎల్‌ఎన్‌ మిట్టల్‌ కుటుంబం   1,74,400
6  సైరస్‌ పూనవాలా కుటుంబం  1,63,700
7 డీమార్ట్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ 1,54,300
8 వినోద్‌ శాంతిలాల్‌ అదానీ కుటుంబం 1,31,600
9 కుమార మంగళం బిర్లా 1,22,200
10 జెడ్‌స్కేలర్‌ కంపెనీ అధినేత జయ్‌చౌదరి 1,21,600
63 జెరోదా నితిన్‌ కామత్‌  25,600
72 ఇన్వెస్టర్‌ రాకేశ్‌ జున్‌జున్‌వాలా కుటుంబం 22,300

 

మరికొన్ని ముఖ్యాంశాలు

  • 1007 మంది అత్యంత సంపన్నుల్లో 255 మంది ముంబైకి చెందినవారే ఉన్నారు. ఢిల్లీ 167 మంది, బెంగళూరులో 85 మందికి నివాస కేంద్రంగా ఉంది.
  • 1,007 మందిలో డాలర్‌ బిలియనీర్లు 237 మంది ఉన్నారు. ఫార్మా నుంచి 40 మంది ఈ జాబితాలో నిలిచారు. ఆ తర్వాత కెమికల్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ నుంచి 27 మంది, సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి 22 మంది ఉన్నారు.
  • 100 మంది అత్యంత సంపన్నుల్లో 13 మంది 1990ల్లో జన్మించిన వారు కాగా.. వీరంతా కూడా సొంత సామర్థ్యాలతోనే(వారసత్వంగా వచ్చింది కాకుండా ఈ స్థాయికి చేరారు.
  • మహిళా సంపన్నుల్లో స్మితా వి సృష్ణ(గోద్రేజ్‌ కుటుంబం) సంపద రూ.31,300 కోట్లుగా, బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా సంపద విలువ రూ.28,200 కోట్లుగా ఉంది.
  • అదానీ కుటుంబం సంపద ప్రతి రోజూ రూ.1,000 కోట్ల మేర(దాదాపు రూ.3,65,700 కోట్లు) పెరిగింది. దేశీయంగా స్వల్ప కాలంలో భారీగా సంపదను కూడబెట్టుకున్న ఘనత వీరిదే.ఆసియాలోనూ రెండో అత్యంత సంపన్నుడిగా ముకేశ్‌ తర్వాతి స్థానానికి అదానీ చేరుకున్నారు.

చ‌ద‌వండి: భారత్‌ విదేశీ రుణ భారం ఎన్ని బిలియన్‌ డాలర్లకు చేరింది?

Published date : 01 Oct 2021 03:48PM

Photo Stories