External Debts: భారత్ విదేశీ రుణ భారం ఎన్ని బిలియన్ డాలర్లకు చేరింది?
కరోనా లాక్‌డౌన్‌లతో ఆర్థికంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ) ఆదుకునేందుకు అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్) మరింత కాలం పాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంచింది. 2020లో తీసుకొచ్చిన ఈ పథకం గడువు వాస్తవానికి 2021 సెప్టెంబర్ 30తో ముగిసిపోవాలి. కానీ, 2022 మార్చి 31 వరకు అంటే మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సెప్టెంబర్ 29న ప్రకటన విడుదల చేసింది.
జీడీపీలో 21.1 శాతానికి రుణభారం
భారత్ విదేశీ రుణ భారం 2021 మార్చి నాటికి వార్షికంగా 2.1 శాతం పెరిగి 570 బిలియన్ డాలర్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 29న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం 2020 మార్చి ముగిసే నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో విదేశీ రుణ భారం 20.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి ఈ విలువ 21.1 శాతానికి చేరింది. ఒక్క సావరిన్ డెట్ వార్షికంగా 6.2 శాతం పెరిగి 107.2 బిలియన్ డాలర్లకు చేరింది. నాన్ సావరిన్ రుణాలు 1.2 శాతం పెరిగి 462.8 బిలియన్ డాలర్లకు ఎగసింది.
చదవండి: ప్రస్తుత ఏడాది ఎన్ని డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎంఎస్‌ఎంఈల అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్) మరో ఆరు నెలల పాటు(2022 మార్చి 31 వరకు) పొడిగించాలని నిర్ణయం
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ
ఎందుకు : కరోనా లాక్‌డౌన్‌లతో ఆర్థికంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ) ఆదుకునేందుకు...