NSO Report: ఉద్యోగాల్లో గ్రామీణ మహిళల సంఖ్య ఎంత శాతం?
సీనియర్, మధ్యస్థాయి మేనేజ్‌మెంట్ పొజిషన్ల(ఉద్యోగాల)లో పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉన్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబర్ 29న ఒక నివేదికను విడుదల చేసింది. 2019 జులై– 2020 జూన్ మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాలను రూపొందించారు.
నివేదిక ప్రకారం...
- 2019–20 ఏడాదికిగాను మేనేజ్‌మెంట్ స్థాయి సిబ్బంది మొత్తంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళల సంఖ్య 21.5 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో పట్టణాలలో ఈ సంఖ్య 16.5 శాతమే.
- పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్) ప్రకారం మొత్తం సీనియర్, మధ్యస్థాయి మేనేజ్‌మెంట్ సిబ్బందిలో పట్టణాలు, గ్రామాలలో కలిపి మహిళా వర్కర్ల నిష్పత్తి 18.8 శాతంగా నమోదైంది.
అథారిటీలదే బాధ్యత...
చేత్తో మలమూత్రాలను ఎత్తిపోసే కార్మికుల(మాన్యువల్ స్కావెంజర్లు) మరణాలపై సంబంధిత అథారిటీలదే బాధ్యత అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) పేర్కొంది. దేశంలో ఈ వ్యవస్థను గతంలోనే నిషేధించినా ఇంకా కొనసాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కార్మికుల రక్షణ, భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 29న ఎన్‌హెచ్‌ఆర్సీ పలు సిఫారసులు చేసింది.
చదవండి: భారత్ విదేశీ రుణ భారం ఎన్ని బిలియన్ డాలర్లకు చేరింది?