Tech Synergy: టెక్ దిగ్గజం గూగుల్ ఏ టెలికం సంస్థలో పెట్టబడులు పెట్టనుంది?
టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా దేశీ టెలికం భారతి ఎయిర్‌టెల్‌లో దాదాపు 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో భాగంగా సుమారు 700 మిలియన్ డాలర్లతో 1.28 శాతం వాటాలు కొనుగోలు చేయనుండగా, మిగతా 300 మిలియన్ డాలర్ల మొత్తాన్ని రాబోయే సంవత్సరాల్లో సర్వీసుల విస్తరణపై వెచ్చించనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు జనవరి 28న ఎయిర్‌టెల్ తెలిపింది. గూగుల్ తాజా పెట్టుబడుల ప్రకారం ఎయిర్‌టెల్ విలువ సుమారు రూ. 4.1 లక్షల కోట్లుగా (54.7 బిలియన్ డాలర్లు) ఉండనుంది.
5జీ సొల్యూషన్స్‌పై కృషి..
తాజా ఒప్పందం మేరకు.. కొత్త ఉత్పత్తులతో భారత్ డిజిటల్ లక్ష్యాల సాకారానికి రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగంగా ఇరు సంస్థలు భారత్ కోసం ప్రత్యేకమైన 5జీ సొల్యూషన్స్‌ను కనుగొనడంపై కృషి చేయనున్నాయి.
ఇప్పటికే జియోలో గూగుల్..
దేశీయంగా డిజిటలీకరణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న గూగుల్ .. రాబోయే 5–7 ఏళ్లలో భారత్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 2020 జూలైలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 4.5 బిలియన్ డాలర్లు వెచ్చించి 7.73 శాతం వాటాలు కూడా కొనుగోలు చేసింది.
చదవండి: ఎయిరిండియా సొంతం చేసుకున్న సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశీ టెలికం భారతి ఎయిర్‌టెల్‌లో దాదాపు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ?
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్
ఎందుకు : కొత్త ఉత్పత్తులతో భారత్ డిజిటల్ లక్ష్యాల సాకారం కోసం.. కలిసి పనిచేసేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్