Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 10 కరెంట్‌ అఫైర్స్‌

Padma Awards 2021 one
పద్మశ్రీ అవార్డు స్వీకరిస్తున్న రామస్వామి

Padma Awards 2021: పద్మ పురస్కారాల పూర్తి జాబితా

కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్‌ సర్వీసెస్‌ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన వారికి పద్మ అవార్డులు ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 2021, నవంబర్‌ 10న జరిగిన రెండు కార్యక్రమాల్లో 119 మందికి 2021 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అందజేశారు. వీటిలో 7 పద్మవిభూషణ్, 10 పద్మభూషణ్, 102 పద్మశ్రీ అవార్డులున్నాయి. రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. అయితే కోవిడ్‌–19 కారణంగా 2020, 2021 సంవత్సరాలకు సంబంధించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఆలస్యమైంది.

29 మంది మహిళలు..

Padma Awards 2021 two
మాతా బి.మంజమ్మకు పద్మశ్రీ అవార్డును అందజేస్తున్న రాష్ట్రపతి కోవింద్‌

2021 ఏడాదికి గాను మొత్తం 119 మందికి భారత ప్రభుత్వం 2021, జనవరి 25న ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. అలాగే విదేశీ/ప్రవాస భారతీయ కేటగిరీలో 10 మంది, ఒక ట్రాన్స్‌జెండర్‌(ట్రాన్స్‌జెండర్‌ జానపద నృత్యకళాకారిణి మాతా బి.మంజమ్మ) కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యారు. ఎస్పీ బాలు సహా 16 మందికి మరణానంతరం పురస్కారం లభించింది.

తెలుగు రాష్ట్రాల నుంచి...

2021 ఏడాది పద్మ అవార్డులకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు ఏపీకి చెందినవారు.

  • ఆశావాది ప్రకాశరావు(ఏపీ): రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జన్మించిన ఆశావాది ప్రకాశరావుకు సాహిత్యం, విద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. శింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన ఆశావాది... పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. వివిధ రాష్ట్రాల్లో 170కి పైగా అవధానాలు చేశారు. 57 రచనలు చేశారు.
  • అన్నవరపు రామస్వామి(ఏపీ): విజయవాడకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు(వయోలిన్) అన్నవరపు రామస్వామికి కళలు విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం వరించింది. గత 8 దశాబ్దాలుగా అనేక దేశాల్లో కచేరీలు చేశారు. ఆయన వందన, శ్రీదుర్గా అనే కొత్త రాగాలను, త్రినేత్రాది, వేదాది అనే తాళాలను కనుగొన్నారు.
  • నిడుమోలు సుమతి(ఏపీ): భారతీయ సంగీత వాయిద్యరంగంలో మృదంగవాద్యాన్ని వృత్తిగా స్వీకరించిన మొట్టమొదటి మహిళా కళాకారిణి నిడుమోలు సుమతి(దండమూడి సుమతీ రామమోహనరావు)ని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. విజయవాడకు చెందిన సుమతి పదో ఏటనే తొలి కచేరి ఇచ్చారు.
  • కనకరాజు(తెలంగాణ): కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన కళాకారుడు కనకరాజును పద్మశ్రీ వరించింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును గుస్సాడీ రాజుగా పిలుస్తారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న 60 ఏళ్ల రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్నారు.


పద్మ పురస్కారాలు-2021
పద్మ విభూషణ్ విజేతలు (7)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం/దేశం/యూటీ

1

షింజో అబే

ప్రజా వ్యవహారాలు

జపాన్

2

ఎస్.పి.బాలసుబ్రమణ్యం

కళలు

తమిళనాడు

3

డా. బెల్లె మొనప్ప హెగ్డే

వైద్యం

కర్ణాటక

4

నరీందర్ సింగ్ కపానీ

సైన్స్, ఇంజనీరింగ్

యూఎస్

5

మౌలానా వాహిదుద్దీన్ ఖాన్

ఆధ్యాత్మికత

ఢిల్లీ

6

బి.బి.లాల్

ఆర్కియాలజీ

ఢిల్లీ

7

సుదర్శన్ సాహూ

కళలు

ఒడిషా

పద్మ భూషణ్ విజేతలు (10)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం/దేశం/యూటీ

1

కె.ఎస్.చిత్ర

కళలు

కేరళ

2

తరుణ్ గొగోయ్

ప్రజా వ్యవహారాలు

అసోం

3

చంద్రశేఖర్ కంబర

సాహిత్యం

కర్ణాటక

4

సుమిత్ర మహాజన్

ప్రజా వ్యవహారాలు

మధ్యప్రదేశ్

5

నృపేంద్ర మిశ్రా

సివిల్ సర్వీస్

ఉత్తర ప్రదేశ్

6

రామ్ విలాస్ పాశ్వాన్

ప్రజా వ్యవహారాలు

బిహార్‌

7

కేశుభాయ్ పటేల్

ప్రజా వ్యవహారాలు

గుజరాత్

8

కల్బే సాదిక్

ఆధ్యాత్మికత

ఉత్తర ప్రదేశ్

9

రజనీకాంత్ దేవిదాస్ షరాఫ్

వాణిజ్యం, పరిశ్రమలు

మహారాష్ట్ర

10

తార్‌లోచన్ సింగ్

ప్రజా వ్యవహారాలు

హరియాణా

పద్మ శ్రీ విజేతలు (102)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం/దేశం/యూటీ

1

గల్ఫామ్ అహ్మద్

కళలు

ఉత్తర ప్రదేశ్

2

పి. అనితా

క్రీడ‌లు

తమిళనాడు

3

రామ స్వామి అన్నవరాపు

కళలు

ఆంధ్రప్రదేశ్

4

సుబ్బూ అరుముగం

కళలు

తమిళనాడు

5

ఆశావాది ప్రకాశరావు

సాహిత్యం, విద్య

ఆంధ్రప్రదేశ్

6

భూరి బాయి

కళలు

మధ్యప్రదేశ్

7

రాధే శ్యామ్ బార్లే

కళలు

ఛత్తీస్‌గఢ్

8

ధర్మ నారాయణ బార్మా

సాహిత్యం, విద్య

పశ్చిమ బెంగాల్

9

లఖిమి బారువా

సామాజిక సేవ

అస్సాం

10

బిరెన్ కుమార్ బసక్

కళలు

పశ్చిమ బెంగాల్

11

రజనీ బెక్టర్

వాణిజ్యం, పరిశ్రమలు

పంజాబ్

12

పీటర్ బ్రూక్

కళలు

యునెటైడ్ కింగ్‌డమ్

13

సంఘుమి బ్యూల్చువాక్

సామాజిక సేవ

మిజోరాం

14

గోపిరామ్ బార్గైన్ బురభాకట్

కళలు

అస్సాం

15

బిజోయ చక్రవర్తి

ప్రజా వ్యవహారాలు

అస్సాం

16

సుజిత్ చటోపాధ్యాయ

సాహిత్యం, విద్య

పశ్చిమ బెంగాల్

17

జగదీష్ చౌదరి(మరణానంతరం)

సామాజిక సేవ

ఉత్తర ప్రదేశ్

18

సుల్టిమ్ర్‌ చోంజోర్

సామాజిక సేవ

లద్దాఖ్

19

మౌమా దాస్

క్రీడ‌లు

పశ్చిమ బెంగాల్

20

శ్రీ‌కాంత్‌ డాటర్

సాహిత్యం, విద్య

అమెరికా

21

నారాయణ్ దేబ్నాథ్

కళలు

పశ్చిమ బెంగాల్

22

చుట్ని దేవి

సామాజిక సేవ

జార్ఖండ్

23

దులారి దేవి

కళలు

బిహార్‌

24

రాధే దేవి

కళలు

మణిపూర్

25

శాంతి దేవి

సామాజిక సేవ

ఒడిశా

26

వయన్ డిబియా

కళలు

ఇండోనేషియా

27

దాదుదన్ గాధవి

సాహిత్యం, విద్య

గుజరాత్

28

పరశురామ్ ఆత్మారామ్ గంగవనే

కళలు

మహారాష్ట్ర

29

జై భగవాన్ గోయల్

సాహిత్యం, విద్య

హరియాణ

30

జగదీష్ చంద్ర హాల్డర్

సాహిత్యం, విద్య

పశ్చిమ బెంగాల్

31

మంగల్ సింగ్ హజోవరీ

సాహిత్యం, విద్య

అస్సాం

32

అన్షు జంసేన్పా

క్రీడ‌లు

అరుణాచల్ ప్రదేశ్

33

పూర్ణమాసి జానీ

కళలు

ఒడిశా

34

మాతా బి. మంజమ్మ

జోగతి కళలు

కర్ణాటక

35

దామోదరన్ కై తప్రమ్

కళలు

కేరళ

36

నామ్‌డియో సి కాంబ్లే

సాహిత్యం, విద్య

మహారాష్ట్ర

37

మహేష్‌భాయ్ -నరేష్‌భాయ్ కనోడియా (ద్వయం)(మరణానంతరం)

కళలు

గుజరాత్

38

రజత్ కుమార్ కర్

సాహిత్యం, విద్య

ఒడిశా

39

రంగసామి లక్ష్మీనారాయణ కశ్యప్ సాహిత్యం,

విద్య

కర్ణాటక

40

ప్రకాష్ కౌర్

సామాజిక సేవ

పంజాబ్

41

నికోలస్ కజనాస్

సాహిత్యం, విద్య

గ్రీస్‌

42

కె కేశవసామి

కళలు

పుదుచ్చేరి

43

గులాం రసూల్ ఖాన్

కళలు

జమ్మూ, కశ్మీర్

44

లఖా ఖాన్

కళలు

రాజస్థాన్

45

సంజిదా ఖాతున్

కళలు

బంగ్లాదేశ్

46

వినాయక్ విష్ణు ఖేదేకర్

కళలు

గోవా

47

నిరు కుమార్

సామాజిక సేవ

ఢిల్లీ

48

లజవంతి

కళలు

పంజాబ్

49

రత్తన్ లాల్

సైన్స్ అండ్ ఇంజనీరింగ్

అమెరికా

50

అలీ మణిక్‌ఫాన్

ఇతరులు-గ్రాస్‌రూట్స్‌ ఇన్నోవేషన్

లక్షద్వీప్

51

రామచంద్ర మంజి

కళలు

బిహార్

52

దులాల్ మంకి

కళలు

అస్సాం

53

నానాడ్రో బి మరక్

ఇతరులు- వ్యవసాయం

మేఘాలయ

54

రెబెన్ మషంగ్వా

కళలు

మణిపూర్

55

చంద్రకాంత్ మెహతా

సాహిత్యం, విద్య

గుజరాత్

56

డాక్టర్ రట్టన్ లాల్ మిట్టల్

వైద్యం

పంజాబ్

57

మాధవన్ నంబియార్

క్రీడ‌లు

కేరళ

58

శ్యామ్ సుందర్ పాలివాల్

సామాజిక సేవ

రాజస్థాన్

59

డాక్టర్ చంద్రకాంత్ సంభాజీ పాండవ్

వైద్యం

ఢిల్లీ

60

డాక్టర్ జె ఎన్ పాండే(మరణానంతరం)

వైద్యం

ఢిల్లీ

61

సోలమన్ పప్పయ్య సాహిత్యం,

విద్య- జర్నలిజం

తమిళనాడు

62

పప్పమ్మల్

ఇతరులు- వ్యవసాయం

తమిళనాడు

63

డాక్టర్ కృష్ణ మోహన్

పాతి వైద్యం

ఒడిశా

64

జస్వంతిబెన్ జామ్నాదాస్ పోపాట్ వాణిజ్యం,

పరిశ్రమలు

మహారాష్ట్ర

65

గిరీష్ ప్రభుణ్

సామాజిక సేవ

మహారాష్ట్ర

66

నందా ప్రస్టీ

సాహిత్యం, విద్య

ఒడిశా

67

కె కె రామచంద్ర పులవర్

కళలు

కేరళ

68

బాలన్ పుతేరి

సాహిత్యం, విద్య

కేరళ

69

బీరుబాలా రభా

సామాజిక సేవ

అస్సాం

70

కనక రాజు

కళలు

తెలంగాణ

71

బొంబాయి జయశ్రీ రామ్‌నాథ్

కళలు

తమిళనాడు

72

సత్యారామ్ రీయాంగ్

కళలు

త్రిపుర‌

73

డాక్టర్ ధనంజయ్ దివాకర్ సాగ్డియో

వైద్యం

కేరళ

74

అశోక్ కుమార్ సాహు

వైద్యం

ఉత్తర ప్రదేశ్

75

డాక్టర్ భూపేంద్ర కుమార్ సింగ్ సంజయ్

వైద్యం

ఉత్తరాఖండ్

76

సింధుటై సప్కల్

సామాజిక సేవ

మహారాష్ట్ర

77

చమన్ లాల్ సప్రూ(మరణానంతరం)

సాహిత్యం, విద్య

జమ్మూ, కశ్మీర్

78

రోమన్ శర్మ

సాహిత్యం,విద్య- జర్నలిజం

అస్సాం

79

ఇమ్రాన్ షా

సాహిత్యం, విద్య

అస్సాం

80

ప్రేమ్‌ చంద్ శర్మ

ఇతరులు- వ్యవసాయం

ఉత్తరాఖండ్

81

అర్జున్ సింగ్ షేఖావత్

సాహిత్యం, విద్య

రాజస్థాన్

82

రామ్ యత్న శుక్లా

సాహిత్యం, విద్య

ఉత్తర ప్రదేశ్

83

జితేందర్ సింగ్ షంటీ

సామాజిక సేవ

ఢిల్లీ

84

కర్తార్ పరాస్ రామ్ సింగ్

కళలు

హిమాచల్ ప్రదేశ్

85

కర్తార్ సింగ్

కళలు

పంజాబ్

86

డాక్టర్ దిలీప్ కుమార్ సింగ్

వైద్యం

బీహార్

87

చంద్ర శేఖర్ సింగ్

ఇతరులు-వ్యవసాయం

ఉత్తర ప్రదేశ్

88

సుధా హరి నారాయణ్ సింగ్

క్రీడలు

ఉత్తర ప్రదేశ్

89

వీరేందర్ సింగ్

క్రీడ‌లు

హరియాణ

90

మృదుల సిన్హా(మరణానంతరం)

సాహిత్యం, విద్య

బిహార్

91

కె సి శివశంకర్(మరణానంతరం)

కళలు

తమిళనాడు

92

గురు మా కమలి సోరెన్

సామాజిక సేవ

పశ్చిమ బెంగాల్

93

మరాచీ సుబ్బూరామన్

సామాజిక సేవ

తమిళనాడు

94

పి సుబ్రమణియన్(మరణానంతరం)

వాణిజ్యం, పరిశ్రమలు

తమిళనాడు

95

నిడుమోలు సుమతి

కళలు

ఆంధ్రప్రదేశ్

96

కపిల్ తివారీ

సాహిత్యం, విద్య

మధ్యప్రదేశ్

97

ఫాదర్ వల్లస్(మరణానంతరం)

సాహిత్యం, విద్య

స్పెయిన్

98

డాక్టర్ తిరువెంగడం వీరరాఘవన్(మరణానంతరం)

వైద్యం

తమిళనాడు

99

శ్రీ‌ధర్ వెంబు

వాణిజ్యం, పరిశ్రమలు

తమిళనాడు

100

కె వై వెంకటేష్

క్రీడ‌లు

కర్ణాటక

101

ఉషా యాదవ్

సాహిత్యం, విద్య

ఉత్తర ప్రదేశ్

102

కల్ క్వాజీ సజ్జాద్ అలీ జహీర్

ప్రజా వ్యవహారాలు

బంగ్లాదేశ్

 

Chief of Naval Staff: నేవీ కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వైస్‌ అడ్మిరల్‌?

Vice Admiral R Hari Kumar

భారత నావికాదళం కొత్త అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ నవంబర్‌ 9న తెలిపింది. హరికుమార్‌ ప్రస్తుతం వెస్టర్న్‌ నావల్‌ కమాండ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌–ఇన్‌–చీఫ్‌గా ఉన్నారు. 2021, నవంబర్‌ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేవీ ప్రస్తుత అధిపతి, అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ నుంచి హరికుమార్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేరళకు చెందిన హరికుమార్‌కు కమాండ్, స్టాఫ్, ఇన్‌స్ట్రక్షనల్‌ సంబంధ విధుల్లో దాదాపు 39 ఏళ్ల అనుభవం ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021, నవంబర్‌ 30వ తేదీన భారత నేవీ కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వైస్‌ అడ్మిరల్‌?
ఎప్పుడు : నవంబర్‌ 9
ఎవరు    : వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ 
ఎందుకు : నేవీ ప్రస్తుత అధిపతి, అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో...


Bharat Biotech: భారత్‌ తయారీ కోవాగ్జిన్‌ను గుర్తించిన ఐరోపా దేశం?

భారత్‌ తయారీ కోవాగ్జిన్‌ను అనుమతి పొందిన కోవిడ్‌ టీకాల జాబితాలో చేర్చినట్లు యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం 2021, నవంబర్‌ 22వ తేదీ నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు వర్తించనుందని పేర్కొంది. దీంతో కోవాగ్జిన్‌ తీసుకున్న వారు ఇకపై యూకే వెళ్లవచ్చు. భారత్‌ బయోటెక్‌ తయారీ కోవాగ్జిన్‌ టీకా రెండు డోసులు తీసుకుని యూకే వెళ్లిన ప్రయాణికులు ఇకపై ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని నవంబర్‌ 9న భారత్‌లో బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ తెలిపారు.

25 కోట్ల కేసులు...
రెండేళ్లలోపే ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 25 కోట్లు దాటేసింది. జాన్‌హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య దాదాపుగా 25.5 కోట్లకు చేరుకుంది. కోవిడ్‌ బాధితుల మరణాలు 50.05 లక్షలు దాటేశాయి. చైనాలోని వూహాన్‌లో 2019 డిసెంబర్‌లో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, గ్రీస్, జర్మనీ కరోనా హాట్‌స్పాట్‌లుగా మారాయి. అమెరికాలోని మేరిల్యాండ్‌ రాష్ట్రం బాల్టిమోర్‌ నగరంలో జాన్‌హాప్‌కిన్స్‌ వర్సిటీ ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ తయారీ కోవిడ్‌ టీకా కోవాగ్జిన్‌ను గుర్తించిన ఐరోపా దేశం?
ఎప్పుడు : నవంబర్‌ 1
ఎవరు    : యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఎందుకు : కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారిని దేశంలోని అనుమతించేందుకు... 


Payments System: డిజిటల్‌ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ నిర్వహించనున్న హ్యాకథాన్‌ పేరు?

స్మార్ట్‌ డిజిటల్‌ చెల్లింపుల థీమ్‌తో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి హ్యాకథాన్‌ నిర్వహిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది. హార్బింజర్‌ 2021(HARBINGER 2021) పేరిట నిర్వహించే ఈ హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు 2021, నవంబర్‌ 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని నవంబర్‌ 9న తెలిపింది. ఈ హ్యాకథాన్‌ పాల్గొనే వారు ఒకవైపు డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ భద్రతను పటిష్టం చేయడంతో పాటు చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, డిజిటల్‌ పేమెంట్స్‌ విధానాలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తెచ్చేందుకు తగు పరిష్కార మార్గాలను రూపొందించాల్సి ఉంటుంది. విజేతకు రూ. 40 లక్షలు, రన్నర్‌–అప్‌కు రూ. 20 లక్షల బహుమతి ఉంటుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : హార్బింజర్‌ 2021 పేరుతో అంతర్జాతీయ స్థాయి హ్యాకథాన్‌ నిర్వహణ
ఎప్పుడు : నవంబర్‌ 9
ఎవరు    : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ భద్రతను పటిష్టం చేయడంతో పాటు చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు...


Agni 5G Phone: 5జీ ఫోన్లు అందిస్తున్న తొలి భారతీయ బ్రాండ్‌?

Agni 5G Phone

దేశీ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్‌ కొత్తగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. తద్వారా 5జీ ఫోన్లు అందిస్తున్న తొలి భారతీయ బ్రాండ్‌గా నిలిచినట్లు కంపెనీ తెలిపింది. ‘‘అగ్ని’’ బ్రాండ్‌ పేరిట నవంబర్‌ 9న ఆవిష్కరించిన ఈ ఫోన్‌ ధర రూ. 19,999గా ఉంటుంది. నవంబర్‌ 18 నుంచి ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రెసిడెంట్‌ సునీల్‌ రైనా తెలిపారు. ఈ ఫోన్‌ను దేశీయంగానే అభివృద్ధి చేశామని, ఉత్తర్‌ ప్రదేశ్‌లో నోయిడాలోని తమ ప్లాంటులో తయారు చేస్తున్నామని వివరించారు.

2022 డిసెంబర్‌ లోగా..
ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ అడ్రెస్‌ ఐపీవీ6 ప్రమాణాలకు పూర్తిగా మారే దిశగా, 2022 డిసెంబర్‌ లోగా కస్టమర్ల దగ్గరున్న రూటర్లు, మోడెమ్‌లను, తమ నెట్‌వర్క్‌ను సరిచేసుకోవాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ (ఐఎస్‌పీ)కు కేంద్ర టెలికం శాఖ నిర్దేశించింది. ఇందుకు సంబంధించి నవంబర్‌ 2న అధికారికంగా నోట్‌ జారీ చేసింది. 20222 డిసెంబర్‌ 31 తర్వాత ఐఎస్‌పీలు కొత్తగా అందించే రిటైల్‌ వైర్‌లైన్‌ కనెక్షన్లు అన్నీ కూడా ఐపీవీ6కి అనుగుణంగా ఉండాలని సూచించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 5జీ ఫోన్లు అందిస్తున్న తొలి భారతీయ బ్రాండ్‌?
ఎప్పుడు : నవంబర్‌ 9
ఎవరు    : దేశీ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్‌ 
ఎక్కడ    : భారత్‌
ఎందుకు : ‘అగ్ని’ బ్రాండ్‌  పేరుతో కొత్తగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించినందున...


KKR India: కేకేఆర్‌ సలహాదారుగా నియమితులైన బ్యాంకింగ్‌ దిగ్గజం?

KV Kamath

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ ఇండియాకు సీనియర్‌ సలహాదారుగా  బ్యాంకింగ్‌ దిగ్గజం కేవీ కామత్‌ నియమితులయ్యారు. తక్షణం ఈ నియామకం అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది. పెట్టుబడుల నిర్ణయాల విషయంలో ఆయన అపార అనుభవాన్ని వినియోగించుకుంటామని నవంబర్‌ 9న పేర్కొంది. బ్యాంకింగ్‌ రంగంలో దాదాపు ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న కామత్, బ్రిక్స్‌ ఏర్పాటు చేసిన బహుళజాతి బ్యాంక్‌– న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా 2015 నుంచి 2020 వరకూ బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు ఆయన ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిన్‌ చైర్మన్‌గా పనిచేశారు.

ఎన్‌బీఎఫ్‌ఐడీ చైర్మన్‌గా...
దేశంలో దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల రుణ సదుపాయాల కల్పనకు కొత్తగా స్థాపించిన  నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌బీఎఫ్‌ఐడీ)కి  చైర్‌పర్సన్‌గా కామత్‌ 2021, అక్టోబర్‌ నెలలో నియమితులయ్యారు. ద్రవ్యలోటు విషయంలో కేంద్రం కొంత సరళతర వైఖరిని అవలంభించాలని కామత్‌ గతంలో సూచించిన సంగతి తెలిసిందే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ ఇండియాకు సీనియర్‌ సలహాదారుగా నియమితులైన బ్యాంకింగ్‌ దిగ్గజం?
ఎప్పుడు : నవంబర్‌ 9
ఎవరు    : కేవీ కామత్‌ 
ఎందుకు : పెట్టుబడుల నిర్ణయాల విషయంలో కేకేఆర్‌ సంస్థకు సహకరించేందుకు...


Chess: భారత్‌ నుంచి 72వ జీఎంగా అవతరించిన క్రీడాకారుడు?

Mitrabha Guha

కోల్‌కతాకు చెందిన 20 ఏళ్ల మిత్రభా గుహా.. భారత్‌ నుంచి 72వ గ్రాండ్‌ మాస్టర్‌ (జీఎం)గా అవతరించాడు. సెర్బియాలోని నోవి సాడ్‌ నగరంలో జరుగుతున్న మిక్స్‌ 220 టోర్నీలో జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అతడు అందుకున్నాడు. 2021, అక్టోబర్‌ నెలలో బంగ్లాదేశ్‌లో జరిగిన షేక్‌ రసెల్‌ జీఎం టోర్నీలో మిత్రభా రెండో జీఎం నార్మ్‌ను సాధించాడు. అంతేకాకుండా జీఎం హోదా దక్కడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌నూ దాటాడు.

ఆర్‌సీబీ కోచ్‌గా నియమితులైన మాజీ క్రికెటర్‌?
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) బ్యాటింగ్‌ సలహాదారుడు, భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌కు ప్రమోషన్‌ లభించింది. అతడిని రెండేళ్ల కాలానికి జట్టు హెడ్‌ కోచ్‌గా నియమిస్తూ ఆర్‌సీబీ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ నుంచి 72వ గ్రాండ్‌ మాస్టర్‌ (జీఎం)గా అవతరించిన క్రీడాకారుడు?
ఎప్పుడు : నవంబర్‌ 9
ఎవరు    : కోల్‌కతాకు చెందిన మిత్రభా గుహా
ఎక్కడ    : నోవి సాడ్, సెర్బియా
ఎందుకు : మిక్స్‌ 220 టోర్నీలో జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అతడు అందుకోవడంతో...


Shooting: ప్రెసిడెంట్స్‌ కప్‌ టోర్నీలో స్వర్ణం సాధించిన షూటర్‌?

Manu Bhaker

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రెసిడెంట్స్‌ కప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత షూటర్‌ మనూ భాకర్‌ స్వర్ణ పతకం సాధించింది. పోలాండ్‌లోని వ్రోక్లా నగరంలో నవంబర్‌ 9న జరిగిన 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో మనూ (భారత్‌)–ఒజ్‌గుర్‌ వార్లిక్‌ (టర్కీ) జంట 557 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకం నెగ్గింది. ఫైనల్లో గ్జియా (చైనా)–పీటర్‌ ఒలెక్‌ (ఇస్తోనియా) జంటపై మనూ–వార్లిక్‌ జోడీ విజయం సాధించింది.

మరోవైపు భారత్‌కే చెందిన రాహీ సర్నోబత్‌ 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో రజత పతకం కైవసం చేసుకుంది. 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో రాహీ 31 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచిన వెన్‌కాంప్‌ (జర్మనీ, 33 పాయింట్లు) స్వర్ణం గెలుచుకుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రెసిడెంట్స్‌ కప్‌ షూటింగ్‌ టోర్నీలో స్వర్ణం సాధించిన భారత షూటర్‌?
ఎప్పుడు : నవంబర్‌ 9
ఎవరు    : మనూ భాకర్‌
ఎక్కడ    : వ్రోక్లా నగరం, పోలాండ్‌
ఎందుకు : 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో మనూ (భారత్‌)–ఒజ్‌గుర్‌ వార్లిక్‌ (టర్కీ) జంట విజయం సాధించడంతో...

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 9 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Nov 2021 11:28AM

Photo Stories