Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 9 కరెంట్ అఫైర్స్
Lakhimpur Kheri Violence: లఖిమ్‌పూర్ ఖేరి ఘటన పర్యవేక్షణకు మరో కమిషన్: సుప్రీంకోర్టు
లఖిమ్‌పూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ఉత్తరప్రదేశ్ సిట్ దర్యాప్తును నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా రోజువారీ పర్యవేక్షించడానికి మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమిషన్‌పై సంతృప్తిగా లేమని పేర్కొంది. లఖిమ్‌పూర్‌ఖేరి ఘటనపై నవంబర్ 8న సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఘటనపై న్యాయ పర్యవేక్షణకు పంజాబ్ హరియాణా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులైన జస్టిస్ రాకేష్‌కుమార్ జైన్ లేదా జస్టిస్ రంజిత్ సింగ్‌లలో ఒకరిని నియమిస్తామని ధర్మాసనం పేర్కొంది.
లఖిమ్‌పూర్ ఖేరి ఘటనపై అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవతో కూడిన ఏక సభ్య న్యాయ కమిషన్‌ను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లఖిమ్‌పూర్ ఖేరి హింసాత్మక ఘటనపై పర్యవేక్షణకు మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమిస్తాం
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమిషన్ పర్యవేక్షణ తీరుపై సంతృప్తిగా లేనందున...
Formula One Motor Race: మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్?
ఫార్ములావన్ సీజన్‌లో భాగంగా జరిగిన మెక్సికో గ్రాండ్‌ప్రి–2021లో రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో నవంబర్ 7న జరిగిన ప్రధాన రేసులో... 71 ల్యాప్‌ల దూరాన్ని వెర్‌స్టాపెన్ గంటా 38 నిమిషాల 39.086 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కిది తొమ్మిదో విజయం. 16.555 సెకన్ల తేడాతో హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానాన్ని పెరెజ్ (రెడ్‌బుల్) దక్కించుకున్నాడు.
అబ్బె బ్లిట్జ్ చెస్ టోర్నీని ఎక్కడ నిర్వహించారు?
లాత్వియా రాజధాని రిగాలో నవంబర్ 8న జరిగిన లిండోరస్ అబ్బె బ్లిట్జ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్ 13.5 పాయింట్లు సాధించాడు. మేటి ప్లేయర్లు కరువానా (అమెరికా), అరోనియన్ (అర్మేనియా) తదితరులపై అర్జున్ గెలిచాడు. షెవ్‌చెంకో (ఉక్రెయిన్–14 పాయింట్లు) విజేతగా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచిన డ్రైవర్?
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్
ఎక్కడ : మెక్సికో సిటీ, మెక్సికో
ఎందుకు : రేసులో 71 ల్యాప్‌ల దూరాన్ని వెర్‌స్టాపెన్ గంటా 38 నిమిషాల 39.086 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నందున...
GDP Growth: బ్రిక్‌వర్క్ రేటింగ్స్ అంచనాల ప్రకారం... భారత్ వృద్ధి రేటు?
2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను దేశీయ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటింగ్స్ పెంచింది. 2021–22లో తొలుత 9 శాతం వృద్ధిని అంచనా వేయగా, దీనిని ఎగువముఖంగా 10 నుంచి 10.5 శాతం శ్రేణికి సవరించింది. అనేక ఆర్థిక వృద్ధి సూచికలు ఆర్థిక కార్యకలాపాల్లో ఊహించిన దాని కంటే వేగంగా పునరుద్ధరణను సూచిస్తున్నందునే వృద్ధి రేటును పెంచినట్లు బ్రిక్‌వర్క్ పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 8న ఒక ప్రకటన విడుదల చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22 ఏడాదిలో భారత్ వృద్ధి రేటు 10 నుంచి 10.5 శాతం శ్రేణిలో నమోదవుతుంది
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : దేశీయ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటింగ్స్
ఎందుకు : అనేక ఆర్థిక వృద్ధి సూచికలు ఆర్థిక కార్యకలాపాల్లో ఊహించిన దాని కంటే వేగంగా పునరుద్ధరణను సూచిస్తున్నందునే...
Funding: ఏ కార్యక్రమం కింద భారత సంస్థలకు గూగుల్ సాయం చేయనుంది?
మహిళలు, ఆడపిల్లలకు సంబంధించి ‘ఇంపాక్ట్ చాలెంజ్’ కార్యక్రమం కింద సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 34 సంస్థలను గూగుల్ డాట్ ఓఆర్‌జీ ఎంపిక చేసింది. ఇందులో భారత్‌కు చెందిన మూడు స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి. గూగుల్‌కు చెందిన దాతృత్వ కార్యక్రమాల సంస్థే గూగుల్ డాట్ ఓఆర్‌జీ. భారత్ నుంచి సంహిత–సీజీఎఫ్, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, స్వ తలీమ్ ఫౌండేషన్ సంయుక్తంగా 2.5 మిలియన్ డాలర్లు (రూ.18.75 కోట్లు) ఆర్థిక సాయాన్ని గూగుల్ డాట్ ఓఆర్‌జీ నుంచి అందుకోనున్నాయి. ఈ సంస్థలన్నీ కూడా.. నైపుణ్యాభివృద్ధి, కెరీర్‌లో పురోగతి, ఎంర్‌ప్రెన్యుర్‌షిప్, వ్యాపారం, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, మద్దతు అనే అంశాలపై దృష్టి సారించాయని గూగుల్ డాట్ ఓఆర్‌జీ నవంబర్ 8న ఓ ప్రకటన విడుదల చేసింది.
- సంహిత–సీజీఎఫ్: సంహిత–సీజీఎఫ్ ‘రివైవ్ అలయన్స్’ ప్రాజెక్ట్‌కు గూగుల్ డాట్ ఓఆర్‌జీ నుంచి 8 లక్షల డాలర్ల సాయం లభించనుంది. ఈ నిధితో 10వేల మంది మహిళలకు సాయం అందించే లక్ష్యాన్ని సంహిత పెట్టుకుంది.
- ప్రథమ్ ఎడ్యుకేషన్: ప్రథమ్ ఎడ్యుకేషన్ గుగూల్ ఒక మిలియన్ డాలర్ల సాయాన్ని పొందనుంది. దీని ద్వారా 7,000 మందికిపైగా గ్రామీణ యువతులకు బ్యూటీ, ఆరోగ్య సంరక్షణ, మెకానిక్స్, ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో పనిచేసే విధంగా నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనుంది.
- స్వ తలీమ్ ఫాండేషన్: స్వ తలీమ్ ఫాండేషన్ గూగుల్ నుంచి లభించే 7 లక్షల డాలర్ల సాయంతో గ్రామీణ మహిళలు, ఆడపిల్లలకు టెక్నాలజీ పెద్దగా అవసరం లేని స్పీకర్ ఫోన్లు తదితర మార్గాల ద్వారా మ్యాథ్స్, సైన్స్, ఆర్థిక అవగాహన తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళలు, ఆడపిల్లలకు సంబంధించి ఇంపాక్ట్ చాలెంజ్ కార్యక్రమం కింద సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 34 సంస్థల ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : గూగుల్‌కు చెందిన దాతృత్వ కార్యక్రమాల సంస్థే గూగుల్ డాట్ ఓఆర్‌జీ
ఎందుకు : ఈ సంస్థలన్నీ.. నైపుణ్యాభివృద్ధి, కెరీర్‌లో పురోగతి, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం వంటి అంశాలపై దృష్టి సారించినందున...
Logistics Performance Index 2021: లాజిస్టిక్స్ సూచీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
కేంద్ర వాణిజ్య శాఖ నవంబర్ 8న విడుదల చేసిన లాజిస్టిక్స్ సర్వీసుల పనితీరు సూచీ–2021లో గుజరాత్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ వ్యవస్థ, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు సూచనలు మొదలైన అంశాలతో రూపొందించిన ఈ సూచీని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ ఆవిష్కరించారు. సూచీకి సంబంధించి మొత్తం 21 అంశాల్లో వివిధ రాష్ట్రాల పనితీరును కేంద్రం మదింపు చేసింది. 2021 ఏడాది మే–ఆగస్టు మధ్య కాలంలో ఇందుకోసం సర్వే నిర్వహించింది. ప్రస్తుతం లాజిస్టిక్స్ వాటా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 13–14 శాతం స్థాయిలో ఉన్నాయి.
ఏపీకి తొమ్మిదో స్థానం...
కేంద్రం విడుదల చేసిన లాజిస్టిక్స్ సర్వీసుల సూచీ–2021లో 21 రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో గుజరాత్ తర్వాత స్థానాల్లో హరియాణ(2), పంజాబ్ (3), తమిళనాడు (4), మహారాష్ట్ర (5) నిల్చాయి. టాప్ 10లో ఉత్తర్ ప్రదేశ్ (6), ఒరిస్సా (7), కర్ణాటక (8), ఆంధ్రప్రదేశ్ (9), తెలంగాణ (10) రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో తొలిస్థానంలో నిలవడం ఇది వరుసగా మూడోసారి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లాజిస్టిక్స్ సర్వీసుల పనితీరు సూచీ–2021లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : గుజరాత్
ఎక్కడ : దేశంలోని 21 రాష్ట్రాల్లో...
ఎందుకు : ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి ఊతంగా నిలిచే లాజిస్టిక్స్ సర్వీసుల పనితీరులో ఉత్తమ పనితీరు కనబరిచినందున...
SBI Report: ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో చైనాను అధిగమించిన దేశం?
ప్రజలందరికీ ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్యం (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) విషయంలో చైనాను భారత్ అధిగమించిందని ఒక నివేదిక పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ ఈ మేరకు ఒక నివేదికను రూపొందించారు. నల్లధనాన్ని అరికట్టే దిశగా రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
నివేదికలోని ముఖ్యాంశాలు...
- భారత్‌లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల సంఖ్య 2015లో వెయ్యి మందికి 183. 2020లో ఈ సంఖ్య 13,615కు చేరింది. ఇక బ్యాంక్ శాఖల సంఖ్య లక్ష మంది పెద్దలకు 13.6 ఉంటే, ఇది 2020 నాటికి 14.7కు ఎగసింది. ఈ గణాంకాలు జర్మనీ, చైనా, దక్షిణాఫ్రికా కంటే ఎక్కువ.
- ఆర్థిక వ్యవస్థలో అందరికీ భాగస్వామ్యం, బ్యాంకు ఖాతాల విషయంలో ముందున్న రాష్ట్రాల్లో మద్యం, పొగాకు వినియోగం గణనీయంగా తగ్గాయి. నేరాలూ తగ్గుముఖం పట్టాయి. ఆర్థికాభివృద్ధి విషయంలో ఆయా రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలకంటే ముందున్నాయి.
- జన్ ధన్ వంటి నో–ఫ్రిల్స్ (చార్జీలు లేని) ఖాతాల పథకం కింద, బ్యాంకుల వద్ద డిపాజిట్ ఖాతాలను కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
- అందరికీ ఆర్థిక వ్యవస్థలో భాగంగా గత ఏడు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే, 2021 అక్టోబర్ 20వ తేదీ నాటికి డిపాజిట్ల పరిమాణం రూ. 1.46 లక్షల కోట్లకు చేరగా, నో–ఫ్రిల్స్ బ్యాంక్ ఖాతాల సంఖ్య 43.7 కోట్లకు ఎగసింది.
UNESCO: యునెస్కో సృజనాత్మక నగరాల్లో చోటు దక్కించుకున్న నగరం?
ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్–UNESCO) సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో భారతీయ నగరం శ్రీనగర్‌కు చోటు దక్కింది. ప్రపంచంలో ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. దీంతో 90 దేశాల్లో సృజనాత్మక నగరాల సంఖ్య 295కి చేరింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ను జాబితాలో చేర్చాలని యునెస్కోకు భారత్ గతంలో సిఫార్సు చేసింది. దీనిలో శ్రీనగర్‌కే అవకాశం దక్కింది. ముంబై, హైదరాబాద్‌లను 2019లో ఈ జాబితాలో చేర్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో చోటు దక్కించుకున్న నగరం?
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : శ్రీనగర్
ఎందుకు : భారత ప్రభుత్వం సిఫార్సుల మేరకు...
Padma Awards 2020: పద్మ పురస్కారాలు ప్రదానం
కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రకటించిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. 2020 సంవత్సరానికిగాను ప్రకటించిన పద్మ పురస్కారాలను 2021, నవంబర్ 8న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
మొత్తం 141 పురస్కారాలు...
2020 ఏడాదికి సంబంధించి 2020, జనవరి 29న మొత్తం 141 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 మందికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. మొత్తంగా పురస్కారాలకు ఎంపికైన వారిలో 33 మంది మహిళలు, 18 మంది విదేశాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే 12 మంది మరణానంతరం పురస్కారాన్ని దక్కించుకున్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు లభించాయి. వీరిలో పీవీ సింధుని పద్మభూషణ్ పురస్కారం వరించింది.
పేరు |
రంగం |
పురస్కారం |
రాష్ట్రం |
పీవీ సింధు |
క్రీడలు |
పద్మభూషణ్ |
తెలంగాణ |
చింతల వెంకటరెడ్డి |
వ్యవసాయం |
పద్మ శ్రీ |
తెలంగాణ |
విజయసారథి శ్రీభాష్యం |
సాహిత్యం, విద్య |
పద్మ శ్రీ |
తెలంగాణ |
యడ్ల గోపాలరావు |
కళలు |
పద్మ శ్రీ |
ఆంధ్రప్రదేశ్ |
దళవాయి చలపతిరావు |
కళలు |
పద్మ శ్రీ |
ఆంధ్రప్రదేశ్ |
కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020 ఏడాది పురస్కారాల ప్రదానోత్సవం ఆలస్యమైంది.
పద్మ పురస్కారాలు-2020
పద్మవిభూషణ్(7)
సంఖ్య |
పేరు |
రంగం |
రాష్ట్రం/దేశం |
1 |
జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం) |
ప్రజా వ్యవహారాలు |
బిహార్ |
2 |
అరుణ్ జైట్లీ (మరణానంతరం) |
ప్రజా వ్యవహారాలు |
ఢిల్లీ |
3 |
అనిరుధ్ జగ్నాథ్ జీసీఎస్‌కే |
ప్రజా వ్యవహారాలు |
మారిషస్ |
4 |
ఎం.సి. మేరీ కోమ్ |
క్రీడలు |
మణిపూర్ |
5 |
ఛన్నులాల్ మిశ్రా |
కళలు- సంగీతం |
ఉత్తరప్రదేశ్ |
6 |
సుష్మా స్వరాజ్ (మరణానంతరం) |
ప్రజా వ్యవహారాలు |
ఢిల్లీ |
7 |
విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం) |
ఆద్యాత్మికం |
కర్ణాటక |
పద్మభూషణ్(16)
సంఖ్య |
పేరు |
రంగం |
రాష్ట్రం/దేశం |
8 |
ఎం.ముంతాజ్ అలీ |
ఆధ్యాత్మికం |
కేరళ |
9 |
సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం) |
ప్రజావ్యవహారాలు |
బంగ్లాదేశ్ |
10 |
ముజఫర్ హుస్సేన్ బేగ్ |
ప్రజా వ్యవహారాలు |
జమ్మూకశ్మీర్ |
11 |
అజోయ్ చక్రవర్తి |
కళలు |
పశ్చిమ బెంగాల్ |
12 |
మనోజ్ దాస్ |
సాహిత్యం, విద్య |
పుదుచ్చేరి |
13 |
బాల్‌కృష్ణ దోషి |
ఆర్కిటెక్చర్ |
గుజరాత్ |
14 |
కృష్ణమ్మాళ్ జగన్నాథన్ |
సామాజిక సేవ |
తమిళనాడు |
15 |
ఎస్.సి.జమీర్ |
ప్రజా వ్యవహారాలు |
నాగాలాండ్ |
16 |
అనిల్ ప్రకాష్ జోషి |
సామాజిక సేవ |
ఉత్తరాఖండ్ |
17 |
త్సెరింగ్ లాండోల్ |
వైద్యం |
లదాఖ్ |
18 |
ఆనంద్ మహీంద్ర |
వర్తకం, పరిశ్రమలు |
మహారాష్ట్ర |
19 |
నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) |
ప్రజావ్యవహారాలు |
కేరళ |
20 |
మనోహర్ గోపాలకృష్ణ పారికర్(మరణానంతర |
ప్రజావ్యవహారాలు |
గోవా |
21 |
జగదీశ్ సేత్ |
సాహిత్యం, విద్య |
అమెరికా |
22 |
పి.వి.సింధు |
క్రీడలు |
తెలంగాణ |
23 |
వేణు శ్రీనివాసన్ |
వర్తకం, వాణిజ్యం |
తమిళనాడు |
పద్మశ్రీ (118)
సంఖ్య |
పేరు |
రంగం |
రాష్ట్రం/దేశం |
24 |
గురు శశధర్ ఆచార్య |
కళలు |
జార్ఖండ్ |
25 |
యోగి అర్న్ |
వైద్యం |
ఉత్తరాఖండ్ |
26 |
జై ప్రకాశ్ అగర్వాల్ |
వర్తకం, వాణిజ్యం |
ఢిల్లీ |
27 |
జగ్‌దీశ్ లాల్ ఆహుజా |
సామాజిక సేవ |
పంజాబ్ |
28 |
కజీ మాసుమ్ అక్తర్ |
సాహిత్యం, విద్య |
పశ్చిమ బెంగాల్ |
29 |
గ్లోరియా అరిఐరా |
విద్య, సాహిత్యం |
బ్రెజిల్ |
30 |
ఖాన్ జహీర్‌ఖాన్ భక్తియార్‌ఖాన్ |
క్రీడలు |
మహారాష్ట్ర |
31 |
పద్మావతి బందొపాధ్యాయ్ |
వైద్యం |
ఉత్తరప్రదేశ్ |
32 |
శుషోవన్ బెనర్జీ |
వైద్యం |
పశ్చిమ బెంగాల్ |
33 |
దిగంబర్ బెహరా |
వైద్యం |
చంఢీఘర్ |
34 |
దమయంతి బెశ్రా |
సాహిత్యం, విద్య |
ఒడిశా |
35 |
పవార్ పొపత్రయ భాగుజి |
సామాజిక సేవ |
మహారాష్ట్ర |
36 |
హిమ్మతా రామ్ భంబు |
సామాజిక సేవ |
రాజస్థాన్ |
37 |
సంజీవ్ బిఖ్‌చందాని |
వాణిజ్య, పరిశ్రమ |
ఉత్తర ప్రదేశ్ |
38 |
గఫుర్భాయ్ ఎం. బిలాఖియా |
వాణిజ్య, పరిశ్రమ |
గుజరాత్ |
39 |
బాబ్ బ్లాక్‌మన్ |
ప్రజా సంబంధాలు |
యునెటైడ్ కింగ్‌డమ్ |
40 |
ఇందిరా పి. పి. బోరా |
కళలు |
అస్సాం |
41 |
మదన్ సింగ్ చౌహాన్ |
కళలు |
చత్తీస్‌గఢ్ |
42 |
ఉషా చౌమర్ |
సామాజికి సేవ |
రాజస్థాన్ |
43 |
లిల్ బహదూర్ చెత్రి |
సాహిత్యం, విద్య |
అస్సాం |
44 |
లలిత - సరోజా చిదంబరం(ద్వయం) |
కళలు |
తమిళనాడు |
45 |
వజీరా చిత్రసేన |
కళలు |
శ్రీలంక |
46 |
పురుషోత్తం దాధీచ్ |
కళలు |
మధ్యప్రదేశ్ |
47 |
ఉత్సవ్ చరణ్ దాస్ |
కళలు |
ఒడిశా |
48 |
ఇంద్ర దసనాయకే(మరణానంతరం) |
సాహిత్యం, విద్య |
శ్రీలంక |
49 |
హెచ్. ఎం. దేశాయ్ |
సాహిత్యం, విద్య |
గుజరాత్ |
50 |
మనోహర్ దేవదాస్ |
కళలు |
తమిళనాడు |
51 |
ఓనం బెంబెం దేవి |
క్రీడలు |
మణిపూర్ |
52 |
లియా డిస్కిన్ |
సామాజిక సేవ |
బ్రెజిల్ |
53 |
ఎం. పి. గణేష్ |
క్రీడలు |
కర్ణాటక |
54 |
బెంగళూరు గంగాధర్ |
వైద్యం |
కర్ణాటక |
55 |
రామన్ గంగాఖేద్కర్ |
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
56 |
బారీ గార్డినర్ |
ప్రజా వ్యవహారాలు |
యునెటైడ్ కింగ్‌డమ్ |
57 |
చేవాంగ్ మోటప్ గోబా |
వర్తకం, పరిశ్రమ |
లడఖ్ |
58 |
భారత్ గోయెంకా |
వర్తకం, పరిశ్రమ |
కర్ణాటక |
59 |
యడ్ల గోపాలారావు |
కళలు |
ఆంధ్రప్రదేశ్ |
60 |
మిత్రభాను గౌంటియా |
కళలు |
ఒడిశా |
61 |
తులసి గౌడ |
సామాజిక సేవ |
కర్ణాటక |
62 |
సుజోయ్ కె. గుహా |
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ |
బిహార్ |
63 |
హరేకాల హజబ్బా |
సామాజిక సేవ |
కర్ణాటక |
64 |
ఎనాముల్ హక్ |
పురావస్తు శాస్త్రం |
బంగ్లాదేశ్ |
65 |
మధు మన్సూరి హస్ముఖ్ |
కళలు |
జార్ఖండ్ |
66 |
అబ్దుల్ జబ్బర్(మరణానంతరం) |
సామాజిక సేవ |
మధ్యప్రదేశ్ |
67 |
బిమల్ కుమార్ జైన్ |
సామాజిక సేవ |
బిహార్ |
68 |
మీనాక్షి జైన |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
69 |
నేమ్నాథ్ జైన్ |
వర్తకం,పరిశ్రమ |
మధ్యప్రదేశ్ |
70 |
శాంతి జైన్ |
కళలు |
బిహార్ |
71 |
సుధీర్ జైన్ |
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ |
గుజరాత్ |
72 |
బెనిచంద్ర జమాటియా |
సాహిత్యం, విద్య |
త్రిపుర |
73 |
కె వి సంపమార్ కుమార్-విదుషి జయలక్ష్మి కెఎస్ (ద్వయం) |
సాహిత్యం,విద్య-జర్నలిజం |
కర్ణాటక |
74 |
కరణ్ జోహార్ |
కళలు |
మహారాష్ట్ర |
75 |
లీలా జోషి |
వైద్యం |
మధ్యప్రదేశ్ |
76 |
సరితా జోషి |
కళలు |
మహారాష్ట్ర |
77 |
సి కమ్లోవా |
సాహిత్యం, విద్య |
మిజోరం |
78 |
రవి కన్నన్ ఆర్ |
వైద్యం |
అస్సాం |
79 |
ఏక్తా కపూర్ |
కళలు |
మహారాష్ట్ర |
80 |
యాజ్ది నౌషిర్వాన్ కరంజియా |
కళలు |
గుజరాత్ |
81 |
నారాయణ్ జె జోషి కారయల్ |
సాహిత్యం, విద్య |
గుజరాత్ |
82 |
నరీందర్ నాథ్ ఖన్నా |
వైద్యం |
ఉత్తర ప్రదేశ్ |
83 |
నవీన్ ఖన్నా |
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ |
ఢిల్లీ |
84 |
ఎస్ పి కొఠారి |
సాహిత్యం, విద్య |
అమెరికా |
85 |
వికె మునుసామి కృష్ణాపక్తర్ |
కళలు |
పుదుచ్చేరి |
86 |
ఎం కె కుంజోల్ |
సామాజిక సేవ |
కేరళ |
87 |
మన్మోహన్ మహాపాత్ర(మరణానంతరం) |
కళలు |
ఒడిశా |
88 |
ఉస్తాద్ అన్వర్ ఖాన్ మంగ్నియార్ |
కళలు |
రాజస్థాన్ |
89 |
కట్టుంగల్ సుబ్రమణ్యం మణిలాల్ |
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ |
కేరళ |
90 |
మున్నా మాస్టర్ |
కళలు |
రాజస్థాన్ |
91 |
అభిరాజ్ రాజేంద్ర మిశ్రా |
సాహిత్యం, విద్య |
హిమాచల్ ప్రదేశ్ |
92 |
బినపాని మొహంతి |
సాహిత్యం, విద్య |
ఒడిశా |
93 |
అరుణోదయ్ మొండల్ |
వైద్యం |
పశ్చిమ బెంగాల్ |
94 |
పృథ్వీంద్ ముఖర్జీ |
సాహిత్యం, విద్య |
ఫ్రాన్స్ |
95 |
సత్యనారాయణ ముండయూర్ |
సామాజిక సేవ |
అరుణాచల్ ప్రదేశ్ |
96 |
మనీలాల్ నాగ్ |
కళలు |
పశ్చిమ బెంగాల్ |
97 |
ఎన్ చంద్రశేఖరన్ నాయర్ |
సాహిత్యం, విద్య |
కేరళ |
98 |
తెట్సు నకామురా(మరణానంతరం) |
సామాజిక సేవ |
ఆఫ్ఘనిస్తాన్ |
99 |
శివ దత్ నిర్మోహి |
సాహిత్యం, విద్య |
జమ్మూకశ్మీర్ |
100 |
పు లాల్బియక్తంగా పచువు |
సాహిత్యం,విద్య-జర్నలిజం |
మిజోరం |
101 |
మూజిక్కల్ పంకజాక్షి |
కళలు |
కేరళ |
102 |
ప్రశాంత కుమార్ పట్టానాయిక్ |
సాహిత్యం, విద్య |
అమెరికా |
103 |
జోగేంద్ర నాథ్ ఫుకాన్ |
సాహిత్యం, విద్య |
అస్సాం |
104 |
రాహిబాయి సోమ పోపెరే |
వ్యవసాయం |
మహారాష్ట్ర |
105 |
యోగేశ్ ప్రవీణ్ |
సాహిత్యం, విద్య |
ఉత్తరప్రదేశ్ |
106 |
జితు రాయ్ |
క్రీడలు |
ఉత్తరప్రదేశ్ |
107 |
తరుణదీప్ రాయ్ |
క్రీడలు |
సిక్కిం |
108 |
ఎస్‌రామకృష్ణన్ |
సామాజిక సేవ |
తమిళనాడు |
109 |
రాణి రాంపాల్ |
క్రీడలు |
హర్యానా |
110 |
కంగనా రనౌత్ |
కళలు |
మహారాష్ట్ర |
111 |
దలైవై చలపతి రావు |
కళ |
ఆంధ్రప్రదేశ్ |
112 |
షాబుద్దీన్ రాథోడ్ |
సాహిత్యం, విద్య |
గుజరాత్ |
113 |
కళ్యాణ్ సింగ్ రావత్ |
సామాజిక సేవ |
ఉత్తరాఖండ్ |
114 |
చింతల వెంకట్ రెడ్డి |
వ్యవసాయం |
తెలంగాణ |
115 |
శాంతి రాయ్ |
వైద్యం |
బిహార్ |
116 |
రాధమ్మోహన్ – సబర్మతీ ద్వయం) |
వ్యవసాయం |
ఒడిశా |
117 |
బటకృష్ణ సహూ |
జంతువు సంవర్ధక |
ఒడిషా |
118 |
ట్రినిటీ సైయో |
వ్యవసాయం |
మేఘాలయ |
119 |
అద్నాన్ సామి |
కళలు |
మహారాష్ట్ర |
120 |
విజయ్ సంకేశ్వర్ |
వాణిజ్యం, పరిశ్రమ |
కర్ణాటక |
121 |
కుషల్ కొన్వర్ శర్మ |
వైద్యం |
అస్సాం |
122 |
సయీద్ మెహబూబ్ షా ఖాద్రి అలియాస్ సయీద్భాయ్ |
సామాజిక సేవ |
మహారాష్ట్ర |
123 |
మహ్మద్ షరీఫ్ |
సామాజిక సేవ |
ఉత్తరప్రదేశ్ |
124 |
శ్యామ్ సుందర్ శర్మ |
కళలు |
బిహార్ |
125 |
గుర్దీప్ సింగ్ |
వైద్యం |
గుజరాత్ |
126 |
రామ్‌జీ సింగ్ |
సామాజిక సేవ |
బిహార్ |
127 |
వశిష్ఠ నారాయణ్ సింగ్(మరణానంతరం) |
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ |
బిహార్ |
128 |
దయా ప్రకాష్ సిన్హా |
కళలు |
ఉత్తరప్రదేశ్ |
129 |
సాంద్ర దేసా సౌజా |
వైద్యం |
మహారాష్ట్ర |
130 |
విజయసారతి భాష్యం |
సాహిత్యం, విద్య |
తెలంగాణ |
131 |
కాలే షాబి మహాబూబ్ - షేక్ మహాబూబ్ సుబానీ (ద్వయం) |
కళలు |
తమిళనాడు |
132 |
జావేద్ అహ్మద్ తక్ |
సామాజిక సేవ |
జమ్మూకశ్మీర్ |
133 |
ప్రదీప్ తలప్పిల్ |
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ |
తమిళనాడు |
134 |
యేషే డోర్జీ తోంగ్చి |
సాహిత్యం, విద్య |
అరుణాచల్ ప్రదేశ్ |
135 |
రాబర్ట్ థుర్మాన్ |
సాహిత్యం, విద్య |
అమెరికా |
136 |
అగస్ ఇంద్ర ఉదయనా |
సామాజిక సేవ |
ఇండోనేషియా |
137 |
హరీష్ చంద్ర వర్మ |
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ |
ఉత్తరప్రదేశ్ |
138 |
సుందరం వర్మ |
సామాజిక సేవ |
రాజస్థాన్ |
139 |
రోమేష్ టేచంద్‌వధ్వాని |
వర్తకం, పరిశ్రమ |
అమెరికా |
140 |
సురేష్ వాడ్కర్ |
కళలు |
మహారాష్ట్ర |
141 |
ప్రేమ్ వాట్సా |
వర్తకం, పరిశ్రమ |
కెనడా |
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 8 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్