Daily Current Affairs in Telugu: 2022, మే 28 కరెంట్ అఫైర్స్
Monkeypox cases 200 in 20 countries: మంకీపాక్స్ కేసులు 20 దేశాల్లో 200
మంకీపాక్స్ కేసులు 20 దేశాల్లో 200
లండన్: ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో సుమారు 200 మంకీపాక్స్ కేసులు బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ అంటువ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. ప్రపంచదేశాలు తమ వద్ద పరిమితంగా టీకాల, ఔషధాలను పంచుకునేందుకు ఒక నిల్వ కేంద్రాన్ని రూపొందించుకోవాలని ప్రతిపాదించింది.
Bone loss due to corona!: కరోనా వల్ల ఎముకల క్షయం!
న్యూఢిల్లీ: కోవిడ్–19(సార్స్–కోవ్–2) వైరస్ సోకితే శరీరంలో అవయవాలు దెబ్బతినడమే కాదు ఎముకలు సైతం కొంత అరిగిపోతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధనలో తేలింది.
- కరోనా బారినపడి చికిత్స పొందుతున్నప్పుడు, తర్వాత కోలుకుంటున్న సమయంలో కూడా ఎముకల క్షయాన్ని గుర్తించారు. కరోనా వైరస్ సోకిన ఎలుకలపై(సిరియన్ హామ్‌స్టర్స్) పరిశోధన చేసి, ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ ఫలితాలను నేచరల్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించారు.
- కరోనా బారినపడిన ఎలుకల్లోని ఎముకల ధృఢత్వాన్ని త్రీ–డైమెన్షనల్ మైక్రో కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ ద్వారా విశ్లేషించారు. ఆయా ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫేట్ కొంత క్షీణించిందని పరి శోధకులు చెప్పారు. ఎముకలు 20 నుంచి 50 శాతం దాకా క్షయానికి గురైనట్లు తెలిపారు.
- Daily Current Affairs in Telugu: 2022, మే 26 కరెంట్ అఫైర్స్
joe Biden : భారతీయ భాషల్లోనూ అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లు
వాషింగ్టన్: వైట్‌హౌస్, ఫెడరల్ ఏజెన్సీలపాటు కీలకమైన ప్రభుత్వ వెబ్‌సైట్లను హిందీ, గుజరాత్, పంజాబ్ తదితర భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని యూఎస్ ప్రెసిడెన్షియల్ కమిషన్ సిఫార్సు చేసింది.
ఈ సిఫార్సుకు ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్ ఆన్ ఆసియన్ అమెరికన్స్(ఏఏ), నేటివ్ హవాయియన్స్, పసిఫిక్ ఐలాండర్స్(ఎన్‌హెచ్‌పీఐ) ఇటీవలే ఆమోదించింది. పబ్లిక్, ఎమర్జెన్సీ హెచ్చరికలు ఆంగ్ల భాషలో నైపుణ్యం లేనివారికి కూడా సులవుగా చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రెసిడెన్షియల్ కమిషన్ సూచించింది. కమిషన్ సిఫార్సులపై అధ్యక్షుడు జో బైడెన్ ఆమోద ముద్రవేస్తే, అమల్లోకి రానున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి దావోస్‌లో సుమారు రూ.4,200 కోట్ల మేర పెట్టుబడులు
యూకే, దావోస్‌లో పది రోజులకుపైగా వరుస సమావేశాలు 45 కంపెనీల ప్రతినిధులతో చర్చలు.. 4 రౌండ్ టేబుల్ మీటింగ్‌లు
- సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేకతలను వివరించి, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చేపట్టిన పర్యటన ముగిసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా జరిపిన చర్చలు, సంప్రదింపులతో కేటీఆర్ బృందం రాష్ట్రానికి సుమారు రూ.4,200 కోట్ల మేర పెట్టుబడులు రాబట్టగలిగింది. కేటీఆర్ మే 27 (శుక్రవారం) తన బృందంతో కలిసి తిరుగు పయనమయ్యారు. మే 28 (శనివారం) ఉదయం రాష్ట్రానికి చేరుకోనున్నారు.
తొలుత యూకేలో.
- ఈనెల 18న హైదరాబాద్ నుంచి యూకేకు చేరుకున్న కేటీఆర్.. నాలుగు రోజుల పాటు యూకే బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ నెల 22న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్న కేటీఆర్ 26వ తేదీ వరకు 45 కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నాలుగు రౌండ్ టేబుల్ సమావేశాలు, మరో నాలుగు చర్చా గోష్టుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేకతలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను కేటీఆర్ వివరించారు.
- Hyundai Group Investment : తెలంగాణ రాష్ట్రంలో హ్యుందాయ్ పెట్టుబడులు
- వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌కు బహుళజాతి కంపెనీల ప్రతినిధుల నుంచి ప్రశంసలు దక్కడంతోపాటు.. పలు అవగాహన ఒప్పందాలు, పెట్టుబడి ప్రకటనలు, చర్చలకు ఈ పెవిలియన్ వేదికగా నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్, సీఐఐ పెవిలియన్‌లో జరిగిన చర్చలు, తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఫార్మా లైఫ్ సైన్స్, దేశంలోని ప్రముఖ యూనికార్న్ వ్యవస్థాపకులతో జరిగిన గోష్టుల్లో కేటీఆర్ పాల్గొన్నారు.
- Download Current Affairs PDFs Here
- ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలను, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
జెడ్‌ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో భేటీ
- దావోస్‌లో చివరిరోజున స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్‌లో జెడ్‌ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని జెడ్‌ఎఫ్ ప్రతినిధులు చెప్పారు. తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్న క్యాంపస్ 3 వేల మంది సిబ్బందితో తమ అతిపెద్ద కార్యాలయంగా ఉండబోతుందన్నారు. జూన్ 1న నానక్‌రామ్‌గూడలో జెడ్‌ఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. జెడ్‌ఎఫ్ కంపెనీ విస్తరణతో తెలంగాణలో మొబిలిటీ రంగానికి అదనపు బలం చేకూరుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Nikhat Zareen : నిఖత్‌కు నీరాజనం
దేశం, రాష్ట్రం గర్వపడేలా పతకాలు సాధించారంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కితాబు మరిన్ని పతకాలు సాధిస్తానన్న నిఖత్
- శంషాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి నిఖత్ జరీన్‌కు హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం లభించింది. నిఖత్ జరీన్‌తోపాటు జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మూడు స్వర్ణ పతకాలు సాధించిన షూటర్ ఇషాసింగ్, జాతీయ మహిళల ఫుట్‌బాల్ లీగ్‌లో టైటిల్ గెలిచిన కేరళ గోకులం క్లబ్ జట్టుకు ఆడిన గుగులోత్ సౌమ్య కూడా శుక్రవారం నగరానికి వచ్చారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి ఓపెన్‌టాప్ జీప్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పలు పాఠశాలలకు చెందిన క్రీడాకారులు కూడా రహదారి వెంట ఆత్మీయ స్వాగతం పలికారు. జాతీయ పతాకాలు చేతబట్టి నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా కార్యదర్శి సందీప్ సుల్తానియా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
-
Daily Current Affairs in Telugu: 2022, మే 26 కరెంట్ అఫైర్స్
క్రీడలకు పెద్ద పీట
- ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయిలో తెలంగాణ అమ్మాయిలు రాష్ట్రం, దేశం గర్వపడేలా పతకాలు సాధించారంటూ కితాబునిచ్చారు. క్రీడారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, దేశానికి మంచి క్రీడాకారులను ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఊరూరా క్రీడా మైదానాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగానికి ప్రాధాన్యత తక్కువగా ఉండేదన్నారు. అన్ని రంగాల్లో బాగుపడుతున్న రాష్ట్ర ప్రగతిని చూసి ఢిల్లీ నుంచి వస్తున్న కొందరు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి ఏమి చేయలేని వారు.. వారి సొంత రాష్ట్రాల్లో బాగుచేయలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిఖత్ జరీన్, ఇషాసింగ్, సౌమ్య ముగ్గురు కూడా నిజామాబాద్ బిడ్డలు కావడం జిల్లాకు గర్వకారణంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
మరింత వన్నె తెస్తా: నిఖత్ జరీన్
- తాను సాధించిన పతకం దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిందని ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ అన్నారు. భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి మరింత వన్నె తెచ్చేలా పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎంతగానో ప్రోత్సాహం అందించా రని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు.
Daily Current Affairs in Telugu: 2022, మే 27 కరెంట్ అఫైర్స్
Geethanjali Sree: హిందీ నవలకు బుకర్ ప్రైజ్
గీతాంజలిశ్రీ ‘రేత్ సమాధి’కి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ పురస్కారం
- లండన్: హిందీ సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీకి ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ లభించింది. ఆమె రాసిన హిందీ నవల ‘రేత్ సమాధి’ (ఇసుక సమాధి) ఆంగ్ల అనువాదం ‘టూంబ్ ఆఫ్ శాండ్’కు ఈ పురస్కారం లభించింది.
- లండన్‌లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో గీతాంజలి బుకర్ ప్రైజ్ అందుకున్నారు. హిందీ మూల రచనకు బుకర్‌కు ప్రైజ్ రావడం ఇదే తొలిసారి. అవార్డు రావడం పట్ల సంభ్రమాశ్చర్యాలకు లోనైనట్టు 64 ఏళ్ల గీతాంజలి చెప్పారు.
Daily Current Affairs in Telugu: 2022, మే 27 కరెంట్ అఫైర్స్ - ‘‘బుకర్ పురస్కారం వస్తుందని ఊహించలేదు. ఇది అనితరసాధ్యమైన గుర్తింపు. నాకు ఎనలేని గౌరవం. చాలా ఆనందంగా ఉంది’’ అని తన ప్రసంగంలో చెప్పారు. ఘనమైన హిందీ సాహితీ సంపదకు ఈ పుస్తకం నిలువెత్తు నిదర్శమన్నారు. 50 వేల పౌండ్ల (దాదాపుగా రూ.49 లక్షలు) నగదు పురస్కారాన్ని నవలను ఆంగ్లంలోకి అనువదించిన రైజీ రాక్‌వెల్‌తో కలిసి ఆమె పంచుకుంటారు.