Daily Current Affairs in Telugu: 2022, మే 27 కరెంట్ అఫైర్స్
![Telugu Current Affairs Daily](/sites/default/files/images/2022/05/28/may27-1653741692.jpg)
National Education Policy (NEP): జాతీయ విద్యా విధానంలో అన్ని భాషలకు ప్రోత్సాహం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- జాతీయ విద్యా విధానంలో భాషలకు ప్రాధాన్యం చెన్నైలో పలు ప్రాజెక్టులు ప్రారంభం.. శంకుస్థాపనలు
National Education Policy Implementation Review 2022 సాక్షి, చెన్నై: అన్ని భారతీయ భాషలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా జాతీయ విద్యా విధానంలో వాటికి ప్రాధాన్యత పెంచామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాన నగరాల్లో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.31,530 కోట్లతో పూర్తిచేసిన కొన్ని ప్రాజెక్టులు, చేపట్టనున్న మరికొన్ని ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. తాంబరం–చెంగల్పట్టు మధ్య పూర్తయిన 3వ రైలుమార్గం, మధురై–తేని మధ్య రైలుమార్గం, ప్రత్యేక రైలు సేవల్ని సైతం ప్రారంభించారు. ఎన్నూర్–చెంగల్పట్టు, తిరువళ్లూరు– బెంగళూరు మధ్య నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు.
నవ భారత్‌ను నిర్మించుకుందాం..
జాతీయ విద్యా విధానం ప్రకారం సాంకేతిక, వైద్య విద్యలను స్థానిక భాషల్లో చదువుకునే అవకాశం కల్పించామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రగతికి దోహదపడతాయని వివరించారు. చెన్నైలో ఏర్పాటు చేస్తున్నట్లుగానే ఇతర నగరాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పిల్లలకు గొప్ప జీవితాన్ని అందించాలని తల్లిదండ్రులు ఆశ పడతారని చెప్పారు. ఆ దిశగానే జాతీయ విద్యా విధానం తీసుకొచ్చామని ఉద్ఘాటించారు.
ప్రతి గ్రామానికి వేగవంతమైన ఇంటర్‌నెట్ తమ విజన్‌గా పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు సహకారం అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, సీఎం స్టాలిన్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
Hyundai Group Investment : తెలంగాణ రాష్ట్రంలో హ్యుందాయ్ పెట్టుబడులు
రాష్ట్రంలో ఏర్పాటయ్యే మొబిలిటీ క్లస్టర్‌లో పెడుతున్నట్లు సంస్థ ప్రకటన మొబిలిటీ వ్యాలీలోనూ భాగస్వామ్యం మాస్టర్ కార్డ్‌తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం
కేటీఆర్‌తో హ్యుందాయ్ సీఈఓ భేటీ
హ్యుందాయ్ సీఈఓ యంగ్చో చి మే 26(గురువారం) కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడిపై ప్రకటన చేశారు. మొబిలిటీ క్లస్టర్‌లో పెట్టుబడులకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ లోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. తెలంగాణలో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా టెస్ట్ ట్రాక్‌లతో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది. హ్యుందాయ్ రాకతో మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచ స్థాయి పౌరసేవలే లక్ష్యంగా..
డిజిటల్ టెక్నాలజీల ద్వారా తెలంగాణ పౌరులకు ప్రపంచ స్థాయి పౌర సేవలు అందించేందుకు అమెరికాకు చెందిన ‘మాస్టర్ కార్డ్’తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. కేవలం డిజిటల్ చెల్లింపులకే పరిమితం కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల సప్లై చైన్ డిజిటలీకరణ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అక్షరాస్యత తదితర రంగాల్లోనూ తెలంగాణ ప్రభుత్వంతో మాస్టర్ కార్డ్ భాగస్వామ్యమవుతుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులతో పాటు ఇతర పౌర సేవా రంగాల్లో ఈ ఒప్పందం కీలకమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పౌర సేవలు, చిన్న తరహా వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను తమ ఎంవోయూ వేగవంతం చేస్తుందని మాస్టర్ కార్డ్ వైస్ చైర్మన్ మైఖేల్ ఫ్రొమన్ వెల్లడించారు.
జీనోమ్ వ్యాలీలో ఈఎంపీఈ డయాగ్నొస్టిక్స్ యూనిట్
క్షయ వ్యాధి డయాగ్నొస్టిక్ కిట్‌ల అంతర్జాతీయ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు స్వీడన్‌కు చెందిన ‘ఈఎంపీఈ డయాగ్నొస్టిక్స్’ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్‌లో నెలకు 20 లక్షల కిట్‌లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తారు. దీనిద్వారా 150 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ పవన్ అసలాపురం వెల్లడించారు. తర్వాతి దశలో రూ.50 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో మొత్తంగా రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే యోచనలో ఉన్నామని తెలిపారు.
హైదరాబాద్‌లో జీఎంఎం ఫాడ్లర్ విస్తరణ
ఫార్మా కంపెనీలకు అవసరమైన గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్‌లను తయారు చేసే జీఎంఎం ఫాడ్లర్ హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈఓ థామస్ కెహ్ల్, డబ్ల్యూఈఎఫ్ డైరెక్టర్ అశోక్ జె పటేల్ మే 26 (గురువారం) కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రెండేళ్ల క్రితం రూ.48 కోట్లకు పైగా పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన జీఎంఎం ఫాడ్లర్ అదనంగా మరో రూ.28 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా సంస్థలో ఉద్యోగుల సంఖ్య 300కు చేరుకుంటుంది. కాగా హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ ఆసక్తి చూపింది. రసాయన, ఔషధ, ఆహారం, విద్యుత్ పరిశ్రమలకు అవసరమయ్యే తుప్పు నిరోధక పరికరాల తయారీ సాంకేతికతలో జీఎంఎం ఫాడ్లర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.
స్టార్టప్‌లకు రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్
దేశంలో ఆవిష్కరణల సంస్కృతి పెరిగినపుడే అన్ని రంగాల్లో వేగంగా పురోగతి సాధ్యమవుతుందని మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. భారత స్టార్టప్‌ల రంగంలో అద్భుత విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులతో మే 26 (గురువారం) దావోస్‌లో జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆవిష్కరణలు వ్యాపార, వాణిజ్య అవకాశాలు సృష్టించడంతో పాటు విభిన్న సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతాయని చెప్పారు. అయితే ఇవి కేవలం శాస్త్ర సాంకేతిక రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఎదురయ్యే ఇతర సమస్యలకు కూడా పరిష్కారం చూపాలన్నారు. హైదరాబాద్‌లో ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఊతంగా నిలుస్తోందని తెలిపారు. స్టార్టప్‌లలో 95 శాతం విఫలమయ్యే అవకాశమున్నా కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందన్నారు.
తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ‘టీ హబ్’నిర్మాణం, పాఠశాల స్థాయి నుంచే ఆవిష్కరణలపై అవగాహన కోసం ‘తెలంగాణ ఇన్నోవేషన్ సెల్’ఏర్పాటు వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇన్నోవేషన్ రంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు స్టార్టప్‌ల రూపంలో ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ స్టార్టప్‌లకు రాజధానిగా మారుతుందన్నారు. చర్చా గోష్టిలో పాల్గొన్న యూనికార్న్ స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు తమ అనుభవాలు, విజయగాథలను పంచుకున్నారు. ప్రశాంత్ పిట్టి (ఈజ్ మై ట్రిప్), విధిత్ ఆత్రే (మీషో) సచిన్‌దేవ్ దుగ్గల్ (ఏఐ), నిఖిల్ కామత్ (జెరోధా) ఆవిష్కరణల రంగం భవిష్యత్తు, అవకాశాలపై అభిప్రాయాలు తెలియజేశారు. దేశంలో ద్రవోల్బణం, జీడీపీ, తలసరి ఆదాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వాలు మారినా రెండు దశాబ్దాల పాటు ఆవిష్కరణల రంగంపై విధానపరమైన స్థిరత్వం ఉండాలని సూచించారు.
Reform, perform and transform: ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో విద్యార్థులకు ప్రధాని మోదీ పిలుపు
సాంకేతికత సాయంతో కొత్త మార్కెట్లను వారికి చేరువ చేయాలని సూచన ఘనంగా హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌ల విద్యార్థుల ఉమ్మడి స్నాతకోత్సవం
- సాక్షి, హైదరాబాద్: పట్టభద్రులై వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) విద్యార్థులు పెద్దపెద్ద కంపెనీలను నడపడమే కాకుండా చిన్న వ్యాపారాలను, వ్యాపారులనూ గుర్తుపెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిరు వ్యాపారులకు టెక్నాలజీని అందుబాటులోకి తేవడంతోపాటు కొత్త మార్కెట్లను గుర్తించి వారికి చేరువ చేయాలని సూచించారు. తద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు.
- Daily Current Affairs in Telugu: 2022, మే 21 కరెంట్ అఫైర్స్
- మే 26 (గురువారం) హైదరాబాద్‌లో జరిగిన ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవం, 2022 పీజీపీ విద్యార్థుల స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఐఎస్‌బీ హైదరాబాద్ క్యాంపస్‌తోపాటు మొహాలీ క్యాంపస్ విద్యా ర్థులతో ఉమ్మడిగా జరిగిన ఈ స్నాతకోత్సవంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రధాని ప్రోత్సాహకాలు అందించారు.
- స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఈ అమృత ఘడియల్లో ఐఎస్‌బీ విద్యార్థులు తమ వ్యక్తిగత లక్ష్యాలకు దేశ ప్రయోజనాలనూ జోడించి ముందడుగు వేయాలని కోరారు. వారికి ఇదో గొప్ప అవకాశమన్నారు. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించిన ఐఎస్‌బీ ఇప్పుడు ప్రపంచంలోనే పేరెన్నికగన్న బిజినెస్ స్కూల్‌గా అవతరించిందని చెప్పారు.
- Limassol International: హర్డిల్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి?
- సంస్కరణల ఫలాన్ని దేశం చూస్తోంది.
- గత ప్రభుత్వాలు అసాధ్యంగా భావించిన అనేక పాలనా సంస్కరణలను తాము వేగంగా చేపట్టడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన రిఫార్మ్ (సంస్కరణలు), పెర్‌ఫార్మ్ (పనిచేయడం), ట్రాన్స్‌ఫార్మ్ (మార్పు తీసుకురావడం) నినాదం ఫలితాలను దేశం ఇప్పుడిప్పుడే చూస్తోందని ప్రధాని తెలిపారు. జీ–20 దేశాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మొదలుకొని.. స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగంలో తొలి స్థానానికి, ఇంటర్నెట్, రిటైల్ రం గాల్లో రెండో స్థానానికి, స్టార్టప్‌ల రంగం, అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌లలో మూడోస్థానంలో ఉండటాన్ని ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నా రు. ఇందులో ప్రభుత్వం మాత్రమే కాకుండా ఐఎస్‌బీ, వృత్తి నిపుణుల భాగస్వామ్యమూ ఉందన్నారు.
- భారతీయులకు, భారతీయ ఉత్పత్తులకూ తమ ప్రభుత్వ హయాంలో కొత్త గుర్తింపు, గౌరవం దక్కాయని, దేశ సమస్యల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు, పరిష్కార మార్గాలు ఇప్పుడు ప్రపంచస్థాయిలో అమలవుతున్నాయని వివరించారు. దేశంలో వ్యాపారాభివృద్ధికి, విస్తరణకు ఇప్పుడున్న విస్తృత అవకాశాలను ఐఎస్‌బీ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. 2014 తరువాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చర్యలను ఐఎస్‌బీతోపాటు మేనేజ్‌మెంట్ విద్యార్థులు తమ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అమలు చేస్తే తప్పకుండా అద్భుత ఫలితాలు లభిస్తాయని మోదీ తెలిపారు.
- వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
- మీపై నమ్మకం ఉంది...
- కరోనాను ఎదుర్కొన్న తీరు భారత్ సత్తాను ప్రపం చానికి మళ్లీ చాటిందని ప్రధాని చెప్పారు. ఈ దేశ యువత ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్న నమ్మకం తనకుందన్నారు. విద్యార్థుల హర్షధ్వానాల మధ్య ప్రధాని మరోసారి ఈ విషయాన్ని చెబుతూ ‘నాకు మీపై నమ్మకం ఉంది. మీకు మీపై ఆ నమ్మకం ఉందా?’ అని ప్రశ్నించి.. ‘ఉంది’ అన్న సమాధానాన్ని రాబట్టారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా ఇప్పుడు దేశం ఫిన్‌టెక్, వైద్యం, వైద్య విద్య, క్రీడల్లాంటి అనేక రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతోందని, అద్భుత ప్రగతి సాధిస్తోందని ప్రధాని గణాంకాలతో వివరించారు.
- Download Current Affairs PDFs Here
- ప్రజల భాగస్వామ్యం కూడా పెరిగిన కార ణంగానే స్వచ్ఛ భారత్, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర హోం సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐఎస్‌బీ డీన్ పిల్లుట్ల మదన్‌తోపాటు చైర్మన్ హరీశ్ మన్వానీ, మొహాలీ క్యాంపస్ ముఖ్యాధికారి రాకేశ్ భారతీ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ వేదికపై ఉన్న ప్రముఖులను పేర్లతో పలకరించినా తలసానిని మాత్రం తెలంగాణ మంత్రిగానే ప్రస్తావించడం గమనార్హం!