Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 22th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 22th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Daily Current Affairs in Telugu

NDA రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

NDA's presidential candidate Droupadi Murmu
                                              NDA's presidential candidate Droupadi Murmu

గిరిజన నాయకురాలికి అత్యున్నత గౌరవం దక్కింది. ఒడిశాకు చెందిన బీజేపీ నేత, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే(NDA) కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యరి్థగా ఎంపికయ్యారు. జూన్‌ 21, 2022, బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. విపక్షాలు కూడా జూన్‌ 21, 2022, తమ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్‌ సిన్హాను ప్రకటించడం తెలిసిందే. దాంతో అందరి కళ్లూ జూలై 18, 2022న జరగబోయే ఎన్నికపైనే కేంద్రీకృతమయ్యాయి. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైతే ఆ గౌరవం పొందిన తొలి ఒడిశావాసిగా, మొట్టమొదటి గిరిజన మహిళగా ముర్ము చరిత్ర సృష్టిస్తారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో బీజేపీకి 49 శాతానికి పైగా ఓట్లున్నాయి. ముర్ము అభ్యర్థిత్వం నేపథ్యంలో పలు ఎన్డీఏయేతర పారీ్టలు ఆమెకు ఓటేయడం ఖాయమే. ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్, జార్ఖండ్‌లోని పాలక గిరిజన పార్టీ జేఎంఎం, పలు ఇతర కీలక ప్రాంతీయ పారీ్టలు ఈ జాబితాలో ఉంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక లాంఛనమే. అదే జరిగితే స్వాతంత్య్రం(15 August 1947) వచ్చాక జని్మంచిన తొలి రాష్ట్రపతిగా కూడా 64 ఏళ్ల ముర్ము రికార్డు సృష్టిస్తారు. మోదీ(17 September 1950) కూడా స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి ప్రధానిగా రికార్డులకెక్కడం తెలిసిందే. ముర్ము త్వరలో నామినేషన్‌ వేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్‌ 29. 2017లో దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి చేసిన బీజేపీ, తాజాగా ఓ ఎస్టీని, అందులోనూ మహిళను ఆ పదవికి పోటీదారుగా ఎంపిక చేయడం విశేషం. అప్పుడు కూడా ముర్ము పేరు గట్టిగా విని్పంచింది. 

Also read: GK Persons Quiz: ఈ సంవత్సరం జ్యూరీ సభ్యురాలిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనబోయే భారతీయ నటి?

Also read: Russian Journalists: వేలానికి పెట్టిన నోబెల్‌ శాంతి బహుమతి

అంచెలంచెలుగా ఎదిగిన... ఆదివాసీ బిడ్డ
ద్రౌపది ముర్ము. అత్యంత సౌమ్యురాలు. మృదుభాషి అయిన ఆదివాసీ బిడ్డ. జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి నుంచి రాష్ట్రపతి అభ్యర్థి దాకా ఆమె ప్రస్థానం  సాగిన తీరు అత్యంత ఆసక్తికరం. ఎందరికో ఆదర్శనీయం. ఒడిశాలో దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన మయూర్‌భంజ్‌లో గిరిజన సంతాల్‌ తెగలో 1958 జూన్‌ 20వ తేదీన ముర్ము జని్మంచారు. ఆమె ముర్ము తండ్రి బిరంచి నారాయణ్‌ తుడుది నిరుపేద కుటుంబం. దాంతో వారు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. అనేక ఇబ్బందుల నడుమే ముర్ము భువనేశ్వర్‌లోని రమాదేవి విమెన్స్‌ కాలేజీ నుంచి బీఏ చేశారు. తర్వాత రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పని చేశారు. 1997లో రాయ్‌రంగాపూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికవడంతో ముర్ము రాజకీయ జీవితం మొదలైంది. అక్కడి నుంచి ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ 2000లో ఒడిశాలో బీజేడీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రవాణా, వాణిజ్య, మత్య్స, పశుసంవర్థక శాఖలు నిర్వహించారు. అంతకుముందు ఒడిశా బీజేపీ గిరిజన మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా చేశారు. 2010, 2013ల్లో మయూర్‌భంజ్‌ (పశ్చిమ) జిల్లా బీజేపీ విభాగం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలిగా చేశారు. 2015లో జార్ఖండ్‌ గవర్నర్‌ అయ్యారు. రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌ ఆమే.

Also read: Russian Journalists: వేలానికి పెట్టిన నోబెల్‌ శాంతి బహుమతి

గొప్ప రాష్ట్రపతి అవుతారు: మోదీ 
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని మోదీ స్పందించారు. దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరమైన అపార అనుభవం ఆమెకు ఉంది. గవర్నర్‌గా అత్యుత్తమ సేవలం దించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంది’ అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయాస్వభావం దేశానికి ఎంతో ఉపకరిస్తాయి. పేదరికాన్ని, కష్టాలను అనుభవిస్తున్న కోట్లాది మంది ప్రజలు ద్రౌపది ముర్ము జీవితం నుంచి ప్రేరణ పొందుతారు’ అని ప్రధాని అన్నారు.  

Also read: WHO: వరల్డ్‌ నో టొబాకో డే అవార్డు–2022కు ఎంపికైన రాష్ట్రం?

Russian Journalists: వేలానికి పెట్టిన నోబెల్‌ శాంతి బహుమతి

Nobel Medal Sells for $103.5 Million

                                                     Nobel Medal Sells for $103.5 Million

ఉక్రెయిన్‌ బాల శరణార్థుల సంక్షేమం కోసం రష్యా జర్నలిస్ట్‌ దిమిత్రీ మురటోవ్‌ వేలానికి పెట్టిన నోబెల్‌ శాంతి బహుమతి చరిత్ర సృష్టించింది. గత రికార్డులను బద్దలు కొట్టి ఏకంగా రూ.800 కోట్లు పైగా ధర పలికింది. కొన్న వ్యక్తి ఎవరనే విషయాన్ని వేలం సంస్థ వెల్లడించలేదు. అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్‌ ఒకటో తేదీన ప్రారంభమైన వేలం ప్రపంచ శరణార్థుల దినం రోజు జూన్‌ 20 (సోమవారం)2022న ముగిసింది. జూన్‌ 20, 2022 ఉదయం వరకు అత్యధిక బిడ్‌ రూ.4.50 కోట్లలోపే ఉంది. కానీ, అనూహ్యంగా ఒక్కసారిగా పెరిగిందని నిర్వాహకులు అన్నారు. దిమిత్రీ మురటోవ్‌ చేస్తున్న ప్రయత్నాల పట్ల గత రెండు రోజులుగా ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడిందని చెప్పారు. ‘నా ప్రయత్నానికి మానవతావాదుల మద్దతు లభిస్తుందని భావించానే గానీ, ఇంతటి భారీ స్పందన ఉంటుందని ఊహించలేదు’అని అనంతరం మురటోవ్‌ అన్నారు. బిడ్డింగ్‌లో పాల్గొన్న ఇతరులు కూడా ఉక్రెయిన్‌ వలస చిన్నారుల సంక్షేమానికి విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. రష్యా యుద్ధ బాధిత ఉక్రెయిన్‌ చిన్నారుల సంక్షేమానికి మురటోవ్‌ ఇప్పటికే రూ.4 కోట్లను అందజేశారు.  

Also read: GK International Quiz: ఏకకాలంలో 78,220 జాతీయ జెండాలను రెపరెపలాడించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన దేశం?

కొలంబియా ఉపాధ్యక్షురాలిగా Francia Marquez

                           Francia Marquez elected Colombias vice president

               Francia Marquez elected Colombias vice president

దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు జూన్‌ 19, 2022న జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్‌ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్‌ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. దేశ కొత్త అధ్యక్షుడిగా వామపక్ష మాజీ తిరుగుబాటు నేత గుస్తావో పెట్రో ఆగస్ట్‌ 7, 2022న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆఫ్రో–కొలంబియన్‌ అయిన ఫ్రాన్సియా మార్కెజ్‌ Francia Marquez(40)  చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలను ముందుండి నడిపారు. నల్లజాతి కొలంబియన్ల తరఫున పోరాడారు. సుదీర్ఘకాలం కొనసాగిన సాయుధ పోరాటం కారణంగా సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తామని మార్కెజ్‌ మీడియాతో అన్నారు. లా టొమా అనే మారుమూల గ్రామంలోని పేద కుటుంబంలో జని్మంచిన మార్కెజ్‌ 16 ఏళ్ల వయస్సులోనే తల్లి అయ్యారు. తన కూతురు కోసం ఎంతో కష్టపడ్డారు. ఒకవైపు రెస్టారెంట్‌లో పనిచేసుకుంటూనే లా డిగ్రీ పూర్తి చేశారు. చుట్టు పక్కల గ్రామాల్లోని అఫ్రో–కొలంబియన్లకు చెందిన భూముల్లో అక్రమ బంగారు గనుల తవ్వకాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. ఆమె కృషికి గాను 2018లో గోల్డ్‌మ్యాన్‌ ఎని్వరాన్‌మెంటల్‌ బహుమతి అందుకున్నారు. డెమోక్రటిక్‌ పోల్‌ పార్టీలో గత ఏడాది జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి గుస్తావో పెట్రో చేతిలో ఓడిపోయారు. కానీ, పారీ్టలోని మిగతా సీనియర్‌ నేతల కంటే ఎక్కువ ఓట్లు ఆమెకే పడ్డాయి. సాయుధ వామపక్ష తిరుగుబాటు నేత అయిన పెట్రోకు ప్రజల్లో అంతగా పలుకుబడి లేదు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పేదలు, యువత, పట్టణ ప్రాంత మహిళలు మార్కెజ్‌ వైపు మొగ్గు చూపారు. ఆఫ్రో–కొలంబియన్ల ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు పెట్రోకు పడ్డాయి. మార్కెజ్‌ జనాదరణ కూడా విజయానికి బాటలు వేసిందని స్పష్టం చేస్తున్నారు.

also read: Russian Journalists: వేలానికి పెట్టిన నోబెల్‌ శాంతి బహుమతి

 

Published date : 22 Jun 2022 07:01PM

Photo Stories