Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 18th కరెంట్ అఫైర్స్
justice Seetharam Reddy : ఉమ్మడి ఏపీ విశ్రాంత లోకాయుక్త జస్టిస్ సీతారాంరెడ్డి కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అద్దూరి సీతారాంరెడ్డి (94) నవంబర్ 17వ తేదీ (గురువారం) తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో 1928 మార్చి 20వ తేదీన చిన్నారెడ్డి, వెంకట్రామమ్మ దంపతులకు జన్మించిన సీతారాంరెడ్డికి భార్య మనోరమాదేవి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన లండన్‌లో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1978 నుంచి 90 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. 1990 నుంచి 95 వరకు లోకాయుక్తగా పనిచేశారు. అలాగే 1989 నుంచి 96 వరకు ఆర్‌బీవీఆర్‌ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రముఖ న్యాయవేత్త పాల్కీవాలా వద్ద ఆయన జూనియర్‌గా వృత్తిని ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో లెక్చరర్‌గా కూడా పని చేశారు. 1968లో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కొనసాగిన ఆయన 1974లో హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా పని చేశారు.
IAS Success Story :ఈ కలెక్టర్ చూడ్డానికి కూల్.. కానీ పనిలో మాత్రం హార్డ్..
CV Ananda Bose : బెంగాల్ గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్
పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్(71)ను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ నవంబర్ 17న తెలిపింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నియామకం అమల్లోకి వస్తుందని ఒక సర్క్యులర్‌లో తెలిపింది. మణిపూర్ గవర్నర్ గణేశన్ జూలై నుంచి పశి్చమబెంగాల్‌కు తాత్కాలి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిందే. రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన బోస్ కేరళలోని కొట్టాయంకు చెందినవారు.
flight MH17 : ఎంహెచ్17 విమాన ఘటనలో ముగ్గురికి యావజ్జీవం
298 మంది మృతికి కారణమైన ఎంహెచ్17 మలేసియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఘటనలో నెదర్లాండ్స్ కోర్టు ఇద్దరు రష్యన్లు, ఒక ఉక్రెయిన్ వేర్పాటువాదికి నవంబర్ 17న యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2014 జూలై 17న నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డ్యామ్ నుంచి మలేసియాలోని కౌలాలంపూర్‌కు బయలుదేరిన బోయింగ్ 777 విమానాన్ని రష్యా అనుకూల ఉక్రెయిన్ వేర్పాటువాదులు బక్ మిస్సైల్ ప్రయోగించి, కూల్చేశారు. విమానం ఉక్రెయిన్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 298 మంది మరణించారు.
Study in USA: అమెరికా కల సాకారం చేసుకోవచ్చు ఇలా.. కాలేజ్ ఎంపిక, అవసరమైన పత్రాలు, స్టాండర్డ్ టెస్టులు తదితర వివరాలు...
Karen Bass: లాస్ ఏంజెలిస్ మేయర్‌గా నల్లజాతి మహిళ
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా జరిగిన లాస్ ఏంజెలిస్ మేయర్ పదవిని మొట్టమొదటిసారిగా ఒక నల్లజాతి మహిళ కైవసం చేసుకుంది. లాస్ ఏంజెలిస్‌కు ఒక మహిళ మేయర్ కావడం ఇదే తొలిసారి. రెండేళ్లక్రితం అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లోనూ కరీన్ పేరు ఉండటం గమనార్హం. లాస్ ఏంజెలిస్ మేయర్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రిక్ కరుసో ఏకంగా దాదాపు రూ.817 కోట్లకుపైగా ఖర్చుపెట్టినట్లు వార్తలొచ్చాయి. ‘ ఈ ఎన్నికలు మనీకి సంబంధించినవి కాదు. మనుషులకు సంబంధించినవి’ అని ప్రచారం సందర్భంగా కరీన్ బాస్ వ్యాఖ్యానించారు.
Sanjay Kumar Mishra: ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు
కేంద్రప్రభుత్వ విచారణ సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా(62) పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన సంజయ్ కుమార్ మిశ్రా 2023 నవంబర్ 18వ తేదీ వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఆ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. ఆయన పదవీ కాలం పొడిగింపునకు కేంద్ర మంత్రివర్గ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలియజేసింది. 2018 నవంబర్ 19న ఈడీ డైరెక్టర్‌గా నియమితులైన సంజయ్‌కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్రం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది.
Communication skills: అంతర్జాతీయ అవకాశాలకు.. ఇంగ్లిష్! భాషపై పట్టు సాధించేందుకు మార్గాలు..
US Midterm Elections 2022: ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే పైచేయి.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో స్పష్టత
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తుది ఫలితాలపై స్పష్టత వచ్చింది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పైచేయి సాధించింది. తాజా సమాచారం ప్రకారం.. రిపబ్లికన్లు 218 సీట్లు, అధికార డెమొక్రాట్లు 211 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)లో కీలకమైన ప్రతినిధుల సభలో ప్రతిపక్షం మెజారిటీ సాధించడం అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది. బైడెన్ నిర్ణయాలు, చర్యలను ప్రతిపక్షం నిలువరించే అవకాశం కనిపిస్తోంది. చట్టసభలో రిపబ్లికన్ పార్టీ బలం పుంజుకోవడంతో అధ్యక్షుడి దూకుడుకి అడ్డుకట్ట పడనుంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ప్రతినిధుల సభ స్పీకర్‌గా రిపబ్లికన్లు తమ నాయకుడు కెవిన్ మెక్‌కర్తీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ ఉన్నారు. కొత్త దిశ కోసం అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని, రిపబ్లికన్లు వారిని ముందుకు నడిపించబోతున్నారని మెక్‌కర్తీ ట్వీట్ చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన మెక్‌కర్తీకి ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తానని ఉద్ఘాటించారు.
సెనేట్‌పై డెమొక్రాట్ల పట్టు
మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజలు వారి ఆకాంక్షలను వ్యక్తం చేశారని చెప్పారు. ధరలు, జీవన వ్యయం తగ్గాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎవరితోనైనా కలిసి పని చేస్తానని పేర్కొన్నారు. జనం ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్‌లోని మరో సభ అయిన సెనేట్‌లో అధికార డెమొక్రాట్లు పట్టు నిలుపుకొనే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 100 స్థానాలకు గాను, వారు ఇప్పటిదాకా 50 స్థానాలు దక్కించుకున్నారు. జార్జియా రాష్ట్రం కూడా వారి ఖాతాలో పడనుంది. దీంతో సెనేట్‌లో మెజారిటీ సాధించబోతున్నారు.
3.5 లక్షల+ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలో... పూర్తి వివరాలు తెలుసుకోండి..
Isha Singh Team: ఇషా సింగ్ బృందానికి స్వర్ణం
తెలంగాణ షూటర్ ఇషా సింగ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. కొరియాలోని డేగూలో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్, మను బాకర్, శిఖా నర్వాల్‌తో కూడిన పసిడి నెగ్గింది. నవంబర్ 17న జరిగిన జూనియర్ మహిళల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఇషా జట్టు 16–12తో కొరియాకు చెందిన కిమ్ మిన్సియో, కిమ్ జుహి, యంగ్ జిన్ జట్టుపై విజయం సాధించింది.
Naramalli Padmaja:మహిళా, శిశు సంక్షేమ ప్రభుత్వ సలహాదారుగా నారమల్లి పద్మజ
ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సలహాదారుగా నారమల్లి పద్మజను నియమించినట్లు ఏపీ ప్రభుత్వం నవంబర్ 17న జీవో విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తొలి మహిళ కావడం గమనార్హం. పద్మజ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Second Largest Producer of Steel : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్
భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించింది. గతంలో రెండో స్థానంలో ఉన్న జపాన్‌ను భారతదేశం వెక్కునెట్టింది. ప్రస్తుతం చైనా అధికంగా ఉక్కు ఉత్పత్తి చేస్తున్న దేశంగా ఉంది. చైనా ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో 57% వాటాను కలిగి ఉంది.
- దేశీయ ఉక్కు పరిశ్రమకు మద్దతుగా, భారత ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం, 2017, రాష్ట్ర సేకరణ విషయంలో దేశీయంగా తయారు చేయబడిన ఇనుము, ఉక్కుకి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని నోటిఫై చేసింది. ఇవి దేశీయ ఉత్పత్తి, ఉక్కు వినియోగాన్ని మెరుగుపరిచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు సహాయపడ్డాయి.
- చౌకైన, నాణ్యత లేని ఉక్కు తయారీ మరియు దిగుమతిని నిషేధిస్తూ ప్రభుత్వం నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అదనంగా, ఉక్కు పరిశ్రమకు గొప్ప ప్రయోజనం చేకూర్చే బొగ్గు గనుల రంగాన్ని భారతదేశం సరళీకృతం చేసింది.
Success Story : వరుసగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టానిలా.. ఇలా చదవడం వల్లే..
- 2019-20లో భారతదేశ ఉక్కు డిమాండ్ 7.2 శాతం పెరుగుతుందని అంచనా వేసినందున, ఉక్కు రంగంలో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం విదేశీ సంస్థలను కూడా ఆహ్వానిస్తోంది. కాగా 2022-23లో 5.2 శాతంగా ఉన్న ఉక్కు డిమాండ్ వృద్ధి మారలేదు.
- తూర్పు భారతదేశ అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
- భారతదేశంలోని తూర్పు రాష్ట్రాలు – ఒడిశా, జార్ఖండ్, చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్తర భాగం జాతీయ ఇనుప ఖనిజ నిల్వలలో 80 శాతం, కోకింగ్ బొగ్గులో 100 శాతం అలాగే క్రోమైట్, బాక్సైట్ మరియు డోలమైట్ యొక్క విస్తారమైన నిల్వలను కలిగి ఉన్నాయి.
- దేశ ప్రధాన నౌకాశ్రయ సామర్థ్యంలో దాదాపు 30 శాతంతో పారాదీప్, హల్దియా, వైజాగ్, కోల్‌కతా మొదలైన ప్రధాన ఓడరేవులు కూడా ఉన్నాయి. ఈ వనరులు, మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతాన్ని ప్రధాన ప్రపంచ ఎగుమతి మరియు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి, ఇది కూడా పూర్వోదయ కార్యక్రమంలో లక్ష్యంగా ఉంది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP