Skip to main content

కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ యాప్‌ విడుదల

రాష్ట్రంలో కరోనా( కోవిడ్‌-19) వ్యాధిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ వైద్య,ఆరోగ్యశాఖ ‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ అనే పేరుతో మొబైల్‌ యాప్‌ను రూపొందించి ఏప్రిల్ 25న విడుదల చేసినట్లు తెలిపింది.
Current Affairs

జ్వరం, దగ్గు, శ్వాస వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాల్ని ఈ యాప్‌లో పొందుపర్చాలని మెడికల్‌ షాపు యజమాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని తెలిపింది.


త్రీడీ ఫేస్‌ షీల్డ్,
మాస్క్‌లు
కరోనాను ఎదుర్కోవడంలో ఉపయోగపడేలా త్రీడీ ప్రింటింగ్‌ పరిజ్ఞానంతో ఫేస్‌ షీల్డ్స్, మాస్కులను హైదరాబాద్‌ జేఎన్‌టీయూ రూపొందించింది. యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నానో టెక్నాలజీ విభాగం వీటిని తయారు చేసింది. మెడికల్‌ సిబ్బందికి, పోలీసులకు అత్యంత రక్షణగా ఉండేలా వీటిని రూపొందించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ టెక్విప్‌ ఆర్‌అండ్‌డీ సహకారంతో వీటిని తయారు చేశారు.

పదివేల రూపాయలకే ఆక్సిజన్‌ యంత్రం

కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన యంత్రాన్ని తయారు చేశారు. పరిసరాల్లోని గాల్లోంచి శుద్ధమైన ఆక్సిజన్‌ను తయారుచేసే ఈ యంత్రం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేస్తాయి. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చౌకైన ఆక్సిజన్‌ ఉత్పత్తి యంత్రాన్ని తయారుచేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఐఐఎస్‌సీ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ప్రవీణ్‌ రామమూర్తి గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా డాక్టర్‌ అరుణ్‌రావు, కె.భాస్కర్‌తో కలిసి పదివేల రూపాయలు ఖరీదుచేసే ఆక్సిజన్‌ తయారీ యంత్రాన్ని సిద్ధం చేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ యాప్‌ విడుదల
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ వైద్య,ఆరోగ్యశాఖ
ఎందుకు : కరోనా( కోవిడ్‌-19) వ్యాధిని కట్టడి చేయడానికి
Published date : 27 Apr 2020 07:19PM

Photo Stories