Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 27, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 27th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
February 27th 2023 Current Affairs

T20 World Cup: ఆరోసారి టి20 ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా 

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు మరో ‘హ్యాట్రిక్‌’తో టి20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 2010, 2012, 2014లలో వరుసగా మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్‌.. 2016 మెగా ఈవెంట్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మళ్లీ 2018, 2020, 2023లలో ప్రపంచకప్‌ల హ్యాట్రిక్‌ నమోదు చేసింది. ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ జరిగిన ఫైనల్లో మెగ్‌ లానింగ్‌ సేన 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  బెత్‌ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు అర్ధ సెంచరీ సాధించగా, ఆష్లే గార్డ్‌నర్‌ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడింది. సఫారీ బౌలర్లలో షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (2/26), మరిజన్‌ కాప్‌ (2/35) కంగారు పెట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసింది. ఓపెనర్‌ లారా వోల్‌వార్ట్‌ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటం వృథా అయ్యింది. టోర్నీలో 110 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీసిన ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గార్డ్‌నర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచింది.   

U-19 Women’s T20 World Cup:  అండర్‌–19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ విజేత భారత్

Hockey Championship: జాతీయ హాకీ విజేత మధ్యప్రదేశ్‌ 
జాతీయ మహిళల సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌లో మధ్యప్రదేశ్‌ జట్టు విజేతగా నిలిచింది. కాకినాడ‌లో ఫిబ్ర‌వ‌రి 26న జ‌రిగిన ఫైనల్లో మధ్యప్రదేశ్‌ 5–1 గోల్స్‌ తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. మధ్యప్రదేశ్‌ తరఫున దీక్షా తివారి (2వ నిమిషం, 4వ ని.), మన్‌మీత్‌ కౌర్‌ (38వ ని.), ప్రీతి దూబే (42వ ని.), ఐశ్వర్య చవాన్‌ (42వ ని.) గోల్స్‌ సాధించగా.. మహారాష్ట్ర  జట్టు నుంచి లాల్‌రిండికి (25వ ని.) ఏకైక గోల్‌ చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతిభ ఆర్యకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మరో వైపు ప్లే ఆఫ్‌ పోరులో హరియాణాను 2–1తో ఓడించిన జార్ఖండ్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

 
Liquor Scam: బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఓ మద్యం కుంభకోణం
ఢిల్లీ మద్యం కుంభకోణం. దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి, కేంద్రంలోని అధికార బీజేపీకి మధ్య రగడ మరింత పెరగడానికి కారణమైన కేసు. దీనికి సంబంధించిన అరెస్టుల పరంపరలో భాగంగా తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పేరూ చేరింది. అంతేగాక ఈడీ తన రెండో చార్జిషిట్‌లో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును కూడా ప్రస్తావించింది! ఇంతకీ ఈ మద్యం   కుంభకోణం కథా కమామిషు ఏమిటి..?

ఢిల్లీలో మద్యం దుకాణాలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేది. అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2020లో నూతన మద్యం విధానాన్ని రూపొందించింది. 2021 నవంబర్‌లో దాన్ని అమల్లోకి తెచ్చింది. నూ తన విధానంలో పలు మార్పులు చేశారు. మద్యం అమ్మకాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి, ప్రైవేట్‌ రిటైల్‌ వ్యాపారులకు కట్టబెట్టారు. ఢిల్లీని 32 జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌లో 27 దుకాణాలున్నాయి. ఒక్కో మున్సిపల్‌ వార్డులో 2–3 చొప్పున దుకాణాలు ఏర్పాటు చేశారు. కొత్త పాలసీ ప్రకారం మద్యాన్ని వినియోగదారులకు ‘హోం డెలివరీ’ చేయొచ్చు. తెల్లవారుజామున 3 గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచొచ్చు. వినియోగదారులకు అపరిమితంగా డిస్కౌంట్లు ఇవ్వొచ్చు. అలాగే గరిష్ట అమ్మకం ధర కూడా ఉండదు. డిమాండ్‌ను బట్టి ఏ ధరకైనా అమ్ముకోవచ్చు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

ఇలా బయటపడింది..  
2022 ఏప్రిల్‌లో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వచ్చిన నరేశ్‌ కుమార్‌ కొత్త మద్యం విధానం ఫైళ్లను క్షుణ్నంగా అధ్యయనం చేశారు. ‘‘విధానం రూపకల్పన, అమల్లో అక్రమా లు చోటుచేసుకున్నాయి. ప్రైవేట్‌ వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది’’ అని తేల్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక రూపొందించారు. విషయాన్ని అప్పట్లో ఎక్సైజ్‌తో పాటు 19 శాఖలను నిర్వహిస్తున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, మనీశ్‌ సిసోడియా దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్‌ నివేదికపై అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్పందించారు.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Fifth Layer of Earth: భూమికి ఐదో పొరను కనిపెట్టిన శాస్త్రవేత్తలు

Migrant Boat Shipwreck: ఇటలీ సముద్ర జలాల్లో పడవ మునక.. 60 మందికి పైగా మృతి
ఇటలీ సముద్ర జలాల్లో వలసదారులు ప్రయాణిస్తున్న ఒక చెక్క పడవ రెండు ముక్కలై నీళ్లల్లో మునిగిపోయింది. ఫిబ్ర‌వ‌రి 26న‌ జరిగిన ఈ ప్రమాదంలో చాలా మంది మరణించారు. ఇప్పటివరకు సహాయ సిబ్బంది దాదాపు 60 మృతదేహాలను వెలికి తీశారు. మరో 60 మంది ప్రాణాలు కాపాడారని స్టేట్‌ టీవీ వెల్లడించింది. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 180 మందికి పైగా శరణార్థులున్నట్టుగా తీర ప్రాంత పట్టణమైన క్రోటోన్‌లో ఓడరేవు అధికారులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించడం వల్లే అయోనియాన్‌ సముద్రంలో ప్రయాణిస్తున్న పడవ ధ్వంసమై ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)

యూఎస్‌ విమానం V/S చైనా యుద్ధ విమానం 
దక్షిణ చైనా సముద్రం మీద డ్రాగన్‌ దుందుడుకు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా నిఘా విమానాన్ని చైనా జే–11 యుద్ధ విమానం వెంబడించడం కలకలం సృష్టించింది. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే క్షిపణులున్న ఈ విమానం పరాసల్‌ ద్వీప సమూహం దగ్గర అమెరికా పీ–8 పోసీడాన్‌ విమానాన్ని 21,500 అడుగుల ఎత్తులో వెంబడించింది. ‘‘చైనా గగన తలానికి 12 నాటికల్‌ మైళ్ల దాకా వచ్చారు. ఇంకా ముందుకొస్తే  తీవ్ర పరిణామాలంంటాయి’’ అని హెచ్చరించింది. కాసేపటికే అమెరికా విమానం రెక్కలకు కేవలం కొన్ని వందల అడుగుల దూరం వరకు వెళ్లింది! ఇలా 15 నిమిషాలు వెంబడించాక వెనుదిరిగింది. పరాసల్‌ ద్వీపాలపై చైనా హక్కులను అమెరికా అంగీకరించడం లేదు. దీనిపై విభేదాలు నెలకొన్నాయి.



Ram Chandra Poudel: నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా పౌద్యాల్‌!
నేపాల్‌ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రామచంద్ర పౌద్యాల్‌ ఎన్నికయ్యే అవకాశముంది. దేశాధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 27న ఆయన అభ్యర్థిత్వానికి ఎనిమిది రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్‌(యూఎంఎల్‌), పుష్పకమల్‌ దహాల్‌(ప్రచండ) నేతృత్వంలోని సీపీఎన్‌(మావోయిస్ట్‌ సెంటర్‌), మరో ఐదు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే కూటమి పార్టీ అయిన సీపీఎన్‌(యూఎంఎల్‌) బలపరిచిన అభ్యర్థి సుభాష్‌ నెబాంగ్‌కి కాకుండా అధికార కూటమిలోలేని వేరొక పార్టీ అభ్యర్థికి ప్రధానమంత్రి ప్రపంచ మద్దతు పలకడంతో రెండు నెలల క్రితమే కొలువుదీరిన ప్రభుత్వం కూలే పరిస్థితులు నెలకొన్నాయి.
నేపాల్‌ పార్లమెంట్‌లో పార్టీల ప్రస్తుత బలాబలాల ప్రకారం ఈ ఎనిమిది పార్టీలు బలపరిచే అభ్యర్థే వచ్చే నెలలో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. ప్రచండ నిర్ణయంతో ఆగ్రహించిన అధికార కూటమిలోని నేషనల్‌ డెమొక్రటిక్‌ పార్టీ తాము ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చైర్మన్‌ రాజేంద్ర ప్రసాద్‌ లింగ్డెన్‌ ఉపప్రధానిగా రాజీనామా చేశారు. కూటమి పార్టీలు మద్దతు ఉపసంహరిస్తే నెలరోజుల్లోపు పార్లమెంట్‌లో ప్రచండ విశ్వాస పరీక్షలో నెగ్గాలి.

Ajay Banga: ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా.. ఈయ‌న చ‌దివింది మ‌న హైద‌రాబాద్‌లోనే..!

Russia Ukraine War: శాంతి ప్రక్రియలో భాగస్వామ్యానికి సిద్ధం.. ఉక్రెయిన్‌ సంక్షోభంపై మోదీ
ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్‌ పదేపదే చెబుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఇందుకు సంబంధించిన ఎలాంటి శాంతి ప్రక్రియలోనైనా భాగస్వామిగా మారేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఢిల్లీలో ఫిబ్ర‌వ‌రి 25న‌ జర్మన్‌ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో చర్చలు జరిపారు. ఏడాదిగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ సంక్షోభం పర్యవసానాలు ముఖ్యంగా ఆహారం, ఇంధన భద్రత వంటి పలు అంశాలతో వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికతలు, వాతావరణ మార్పు వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో షోల్జ్‌..‘ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తీవ్ర విపత్తు, ఇది ప్రపంచంపై విపరీత ద్రుష్పభావాలను కలుగజేసింది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి సహా అన్ని వేదికలపై మనం వేసే అడుగులపై స్పష్టత అవసరం’అని పేర్కొన్నారు. 
హింసామార్గం ద్వారా సరిహద్దులను ఎవరూ మార్చ జాలరని షోల్జ్‌ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛావాణిజ్యం ఒప్పందం(ఎఫ్‌టీఏ), పెట్టుబడుల రక్షణ ఒప్పందాలను సాధ్యమైనంత తొందరగా ఖరారు చేయాలనుకుంటున్నట్లు షోల్జ్‌ చెప్పారు.  

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి ఏడాది పూర్తి
భారత్‌ వైఖరి మొదట్నుంచీ అదే 
‘ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్‌ మొదట్నుంచీ కోరుతోంది. ఇందుకు సంబంధించి జరిగే శాంతి ప్రక్రియలో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉంది’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలోనూ ఇదే విషయం కుండబద్దలు కొట్టిందన్నారు. ‘భారత్, జర్మనీల మధ్య రక్షణ, భద్రత సహకారం వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకంగా మారనుంది. ఈ రంగాల్లో మరిన్ని అవకాశాలను అన్వేషించాలి. ఉగ్రవాదం, వేర్పాటు వాదంపై పోరులో భారత్, జర్మనీల మధ్య మంచి సహకారం కొనసాగుతోందని మోదీ అన్నారు. భారత్‌లో రెండు రోజుల షోల్జ్ పర్యటించారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)


Zombie Drug: అమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్‌.. మనుషులను పిశాచులుగా మార్చేస్తుంది!   
ప్రస్తుతం అమెరికాను వణికిస్తున్న ‘జాంబీ’ డ్రగ్ జైలజీన్‌. తక్కువ ధరలో దొరికే ఈ డ్రగ్‌ మనుషులను పిశాచులుగా చేస్తోంది. గుర్రాలు, ఆవులు తదితర జంతువుల్లో నరాలకు విశ్రాంతి ఇచ్చే నిమిత్తం అనుమతించిన ఈ ట్రాంక్విలైజర్‌ ఇప్పుడక్కడ పెను విలయానికి దారి తీస్తోంది. దీన్ని ఫెంటానిల్‌ అనే డ్రగ్‌తో కలిపితే అత్యంత హెచ్చు పొటెన్సీతో కూడిన ప్రాణాంతకమైన మత్తుమందుగా మారుతోంది. కారుచౌకగా తయారవుతుండటంతో డ్రగ్‌ డీలర్లు కొన్నేళ్లుగా దీన్నే విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. ట్రాంక్, ట్రాంక్‌ డోప్, జాంబీ డ్రగ్‌గా పిలిచే ఈ డ్రగ్‌ ప్రస్తుతం యూఎస్‌ వీధుల్లో పొంగి పొర్లుతోంది. ఎక్కడ చూసినా డ్రగ్‌ బానిసలు ట్రాంక్‌ మత్తులో జోగుతూ కనిపిస్తున్నారు. శరీరంపై దీని దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఒంటిపై పుండ్లు పడటం, చర్మం ఊడిపోవడంతో మొదలై చూస్తుండగానే ఒంట్లో శక్తులన్నీ ఉడిగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. అడుగు తీసి అడుగేయడమూ కష్టమై బాధితులు నడిచే శవాల్లా మారి అచ్చం జాంబీలను తలపిస్తున్నారు! ఈ ధోరణి కొంతకాలంగా మరీ ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. 

Digital Payments: భార‌త్‌, సింగ‌పూర్ మ‌ధ్య ఈజీ డిజిటల్ పేమెంట్స్

జాంబీ డ్రగ్‌ వాడితే.. 
∙ జైలజీన్‌ చర్మాన్ని, మాంసాన్ని తినేస్తుంది. 
∙ కేంద్ర నాడీ వ్యవస్థపై నేరుగా తీవ్ర ప్రభావం చూపుతుంది. 
∙ రక్తనాళాలు పాడవుతాయి. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. 
∙ దాంతో చర్మం ఊడటంతో పాటు ఒళ్లంతా పుండ్లు పుడతాయి. 
∙ పుండ్లు ముదిరి సంబంధిత అవయవాలు కుళ్లిపోతున్నాయి. వాటిని తీసేయాల్సి వస్తోంది. 
∙ మతిమరుపు వంటి మరెన్నో భయానక సైడ్‌ ఎఫెక్టులూ తలెత్తుతాయి. 
∙ గుండె, ఊపిరితిత్తుల పనితీరు, కంటిచూపు మందగిస్తాయి. 
∙శ్వాస అందదు. బీపీ పడిపోయి ప్రాణాంతకంగా మారుతుంది.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Published date : 27 Feb 2023 06:23PM

Photo Stories