Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 13, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 13th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

New Governors: 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
అయోధ్య రామాలయ వివాదంతో పాటు ట్రిపుల్‌ తలాక్‌ వంటి పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా పంపింది. మొత్తం ఆరుగురు కొత్త గవర్నర్లను నియమించడంతో పాటు ఏడుగురిని మారుస్తూ ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. వివాదాస్పద మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో పాటు లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆర్‌.కె.మాథుర్‌ రాజీనామా చేశారు. కొత్త గవర్నర్లలో నలుగురు బీజేపీకి చెందినవారు. జస్టిస్‌ నజీర్‌ కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ 2017లో నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత జనవరిలో రిటైరయ్యారు. ఇక 80 ఏళ్ల కోశ్యారీ మహారాష్ట్ర గవర్నర్‌గా ఛత్రపతి శివాజీ, ముంబైపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌) కోశ్యారీ రాజీనామాను స్వాగతించాయి.

Satyanarayana Raju: కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా సత్యనారాయణ రాజు

కొత్త గవర్నర్లు

ఆంధ్రప్రదేశ్

జస్టిస్ఎస్‌..నజీర్

మహారాష్ట్ర

రమేశ్బైస్

బిహార్

విశ్వనాథ్రాజేంద్ర అర్లేకర్

ఛత్తీస్గఢ్

విశ్వభూషణ్హరిచందన్

జార్ఖండ్

సి.పి.రాధాకృష్ణన్

హిమాచల్ప్రదేశ్

శివప్రతాప్శుక్లా

అస్సాం

గులాబ్చంద్‌  కటారియా

అరుణాచల్ప్రదేశ్

త్రివిక్రమ్పర్నాయక్

మణిపూర్

అనసూయ ఉయికె

సిక్కిం

లక్ష్మణ్ప్రసాద్‌  ఆచార్య

నాగాలాండ్

ఎల్‌..గణేశన్

మేఘాలయ

ఫగు చౌహాన్

లద్దాఖ్

బి.డి.మిశ్రా 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (15-21 జనవరి 2023)

BK Goenka: దేశంలోనే ఖరీదైన పెంట్‌ హౌస్‌.. దీని ఖ‌రీదు రూ.240 కోట్లు! 
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ను వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్‌ బీకే గోయెంకా ఇటీవలే కొనుగోలు చేశారు. ముంబైలోని వర్లీ ప్రాంతం అన్నీబీసెంట్‌ రోడ్డులో ఉన్న లగ్జరీ టవర్లలో త్రీసిక్స్‌టీ వెస్ట్‌ ఒకటి. ఇందులోని పెంట్‌హౌస్‌ ఖరీదు రూ.240 కోట్లు. టవర్‌ 63, 64, 65 ఫోర్లలోని 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెంట్‌ హౌస్‌ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలను గత ఫిబ్ర‌వ‌రి 8వ తేదీ బీకే గోయెంకా పూర్తి చేసినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట‌ని పేర్కొంది. దీనిని ఆనుకునే ఉన్న మరో పెంట్‌హౌస్‌ను కూడా నిర్మాణ సంస్థ యజమాని వికాస్‌ ఒబెరాయ్‌ రూ.240 కోట్లు పెట్టి కొన్నట్లు ఆ కథనంలో వివరించింది.  

Brightest Student: ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థిగా భారత సంతతి చిన్నారి

High Courts: నాలుగు హైకోర్టులకు కొత్త సీజేలు
దేశంలోని నాలుగు హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తు(సీజే)లు నియమితులయ్యారు. గుజరాత్‌ హైకోర్టులో అత్యంత సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ సోనియా గిరిధర్‌ గోకానీని అదే హైకోర్టు సీజేగా నియమించారు. అదేవిధంగా, ఒరిస్సా హైకోర్టులో అత్యంత సీనియర్‌ జడ్జి జస్టిస్‌ జస్వంత్‌ సింగ్‌ త్రిపుర హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. ఈయన ఫిబ్ర‌వ‌రి 22న రిటైర్‌ కానున్నారు. ఇంతకుముందు జస్టిస్‌ సింగ్‌ను ఒరిస్సా హైకోర్టు సీజేగా నియమించాలంటూ చేసిన సిఫారసును కొలీజియం ఆ తర్వాత ఉపసంహరించుకుంది. రాజస్తాన్‌ హైకోర్టుకు చెందిన జడ్జి జస్టిస్‌ సందీప్‌ మెహతాను గౌహతి హైకోర్టు సీజేగా నియమించారు. గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ జమ్మూకశ్మీర్‌ అండ్‌ లద్దాఖ్‌ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. తాజా నియామకాలను న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ఫిబ్ర‌వ‌రి 12న ప్రకటించారు. కాగా, జస్టిస్‌ గోకానీ బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్న 25 హైకోర్టుల్లో ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. గుజరాత్‌ జ్యుడిషియల్ సర్వీస్‌ నుంచి వచ్చిన ఈమెకు 62 ఏళ్లు నిండటంతో ఫిబ్రవరి 25న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్‌ సబీనా ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్నారు. గుజరాత్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.  

Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణం 

Delhi-Mumbai Expressway: ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే తొలి దశ ప్రారంభం 
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంలో మరో మైలు రాయిని అందుకుంది. దేశంలో అతి పెద్దదైన జాతీయ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఢిల్లీ–ముంబై మహా రహదారిలో 246 కి.మీ. భాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ ఆవిష్కరించారు. ఢిల్లీలోని సోహ్నా నుంచి రాజస్తాన్‌లో దౌసా మధ్య నిర్మాణం జరుపుకున్న తొలి దశను దౌసా వద్ద రిమోట్‌ కంట్రోల్‌ బటన్‌ ద్వారా ప్రధాని ప్రారంభించారు. 8 లేన్లతో నిర్మించిన ఢిల్లీ–దౌసా–లాస్‌సాట్‌ రహదారి అందుబాటులోకి రావడంతో ఢిల్లీ, జైపూర్‌ మధ్య దూరం సగానికి సగం తగ్గిపోతుంది. ఇన్నాళ్లు 5 గంటలు పట్టే ప్రయాణం ఈ ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా వెళితే మూడున్నర గంటలే పడుతుంది. దీంతోపాటు రూ.5,940 కోట్ల జాతీయ హైవే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం హైవే ప్రాజెక్టులు, పోర్టులు, రైల్వేలు, ఆప్టికల్‌ ఫైబర్, మెడికల్‌ కాలేజీల మీద అత్యధికంగా దృష్టి సారించిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు.  

Train Passengers: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక వాట్సాప్‌ నుంచే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు

ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే విశేషాలు 
మొత్తం పొడవు: 1,380 కి.మీ. 
మొత్తం వ్యయం: దాదాపుగా రూ.లక్ష కోట్లు  
ఢిల్లీ ముంబై మధ్య ప్రయాణ సమయం: 12 గంటలు  
(ప్రస్తుతం 24 గంటలు పడుతోంది)  
తొలి దశ పొడవు : 246 కి.మీ. (సోహ్నా నుంచి దౌసా)   
వ్యయం: రూ.12,150 కోట్లు  
• ఢిల్లీ నుంచి జైపూర్‌ మధ్య సగానికి సగం తగ్గనున్న ప్రయాణ సమయం. (ఇన్నాళ్లూ 5 గంటలు పట్టేది. ఇకపై మూడున్నర  గంటల్లో చేరుకోవచ్చు) .
• ఆరు రాష్ట్రాల మీదుగా వెళ్లనున్న ఎక్స్‌ప్రెస్‌ వే  

Domestic Work: మహిళలది జీతం బత్తెం లేని చాకిరి.. రోజుకి 7.2 గంటల ఇంటి పనిలోనే..
మహిళలు ఇంట్లో జీతం బత్తెం లేకుండా బండెడు చాకిరీ చేస్తున్నారని, రోజుకున్న 24 గంటల సమయం సరిపోవడం లేదని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) తాజా అధ్యయనంలో వెల్లడైంది. జీతం లేని ఇంటి పనిని పురుషులు 2.8 గంటలు చేస్తే మహిళలు 7.2 గంటల సేపు ఇంటి పనుల్లోనే ఉంటున్నారని ఆ అధ్యయనంలో తేలింది. 
అధ్యయనం ఏం చెప్పిందంటే..  
ఆఫీసులో పని చేస్తూ సంపాదిస్తున్న మహిళలు కూడా పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఇంటి పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులన్నీ మగవారి కంటే మహిళలే ఎక్కువగా చేస్తున్నారు. 15 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలందరూ రోజుకి 7 గంటలకు పైగా ఇంటి పనులు చేస్తున్నారు. ఈ విషయం జగమెరిగిన సత్యమే అయినప్పటికీ ‘‘టైమ్‌ యూజ్‌ డేటా : ఏ టూల్‌ ఫర్‌ జెండర్డ్‌ పాలిసీ అనాలిసిస్‌’’ పేర ఎంత సేపు మహిళలు జీతం లేని చాకిరీ చేస్తున్నారో సర్వే చేయగా మహిళలు సగటున రోజుకి 7.2 గంటలు ఇంటి పనులు చేస్తూ వస్తూ ఉంటే, మగవాళ్లు 2.8 గంటలు మాత్రమే చేస్తున్నారని తేలినట్టుగా ఐఐఎంఏ ప్రొఫెసర్‌ నమ్రత చందార్కర్‌ తెలిపారు.

Railway: నిమిషానికి 2.25 లక్షల టికెట్లు అందించ‌నున్న‌ రైల్వే

Lithium: బ్యాటరీల తయారీలో అత్యంత కీలకమైన తెల్ల బంగారం
ఆధునిక యుగంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రాధాన్యం నానాటికీ పెరిగిపోతోంది. సౌర విద్యుదుత్పత్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేకపోతే పొద్దు గడవదు. మరి ఈ అవసరాలన్నీ తీరాలంటే ఏం కావాలో తెలుసా? లిథియం. అత్యంత విలువైన ఈ ఖనిజాన్ని పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం పెద్దగా ఉండదు. ఎందుకంటే 59 లక్షల టన్నుల నాణ్యమైన లిథియం నిల్వలు జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం కొలువైన కొండల దిగువన సలాల్‌ హైమన గ్రామం వద్ద ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) ఇటీవల గుర్తించింది. భారత్‌లో ఈ స్థాయిలో లిథియం నిల్వలు బయటపడడం ఇదే తొలిసారి!                      
తవ్వకాలతో నీటి నిల్వలకు ముప్పు! 
ఖనిజ తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు తప్పదు. లిథియం తవ్వకాల కారణంగా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని, ప్రకృతిపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లిథియం తవ్వకాలు చేపట్టిన ప్రాంతాల్లో నీటి నిల్వలు అంతరించిపోతాయని హెచ్చరిస్తున్నారు. భూమిపై తేమ తగ్గిపోయి, కరువు నేలగా మారుతుందని పేర్కొంటున్నారు. ఒక టన్ను లిథియం కోసం తవ్వకాలు సాగిస్తే ఏకంగా 15 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదల అవుతుందని సమాచారం. ఒక టన్ను లిథియం తవ్వకానికి దాదాపు రూ.64 లక్షల ఖర్చవుతుంది. లిథియం వెలికితీతకు భారీస్థాయిలో నీరు అవసరం. 

Astronomers: అంతరిక్షంలో బంగారం!
లిథియం అంటే?   
తెల్ల బంగారంగా పిలిచే లిథియం అనే పదం గ్రీక్‌ భాషలోని లిథోస్‌ (రాయి) నుంచి పుట్టింది. ఇది ఆల్కలీ మెటల్‌ గ్రూప్‌కు చెందినది. తేలికగా, మృదువుగా, తెల్లటి రంగులో వెండిలాగా మెరిసే లోహం. పీరియాడిక్‌ గ్రూప్‌ 1(ఐఏ)లో లిథియంను చేర్చారు. ఇది భూగోళంపై సహజంగా ఏర్పడింది కాదు. అంతరిక్షంలో సంభవించిన పేలుళ్ల వల్ల ఏర్పడినట్లు గుర్తించారు. బిగ్‌బ్యాంగ్‌ వల్ల విశ్వం పుట్టిన తొలినాళ్లలో భూగోళంపై లిథియం నిల్వలు మొదలైనట్లు తేల్చారు. ఇతర గ్రహాలపైనా లిథియం ఉంది. మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Asian Indoor Athletics Championships: ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జ్యోతికి ర‌జ‌తం
కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్‌లో గొప్ప విజయం సాధించింది. ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జ్యోతి మహిళల 60 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో రజత పతకం గెల్చుకుంది. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల జ్యోతి ఫైనల్‌ రేసును 8.13 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జ్యోతి ఈ విభాగంలో మళ్లీ కొత్త జాతీయ రికార్డును నమోదు చేసింది.
ఈ ఏడాది 60 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి జాతీయ రికార్డును నెలకొల్పడం ఇది ఐదోసారి కావడం విశేషం. ఫిబ్ర‌వ‌రి 11వ తేదీ జరిగిన హీట్స్‌లో జ్యోతి 8.16 సెకన్లతో జాతీయ రికార్డు సృష్టించగా.. రోజు వ్యవధిలోనే తన పేరిటే ఉన్న రికార్డును ఆమె సవరించడం విశేషం. ఫైనల్లో మాసుమి ఆకో (జపాన్‌; 8.01 సెకన్లు) అందరికంటే వేగంగా లక్ష్యాన్ని దాటి స్వర్ణ పతకం సొంతం చేసుకోగా.. చెన్‌ జియామిన్‌ (చైనా; 8.15 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.
తాజా ప్రదర్శనతో జ్యోతి 19 ఏళ్ల ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో 60 మీటర్ల హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారతీయ అథ్లెట్‌గా నిలిచింది. 2008లో దోహా ఆతిథ్యమిచ్చిన ఆసియా ఈవెంట్‌లో భారత్‌కే చెందిన లీలావతి వీరప్పన్‌ 9.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. జ్యోతి రజతం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.

ICC Women’s T20I Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌

Nawab Raunaq Khan: తొమ్మిదో నిజాంగా నవాబ్‌ రౌనఖ్‌ యార్‌ ఖాన్‌
అసఫ్‌ జాహీ వంశం తొమ్మిదో నిజాంగా నవాబ్‌ రౌనఖ్‌ యార్‌ ఖాన్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు మజ్లిస్‌–ఎ–షబ్జాదేగన్‌ సొసైటీ ప్రతినిధులు ఫిబ్ర‌వ‌రి  11వ తేదీ ప్రకటించారు. ఎనిమిదో నిజాం నవాబ్‌ మీర్‌ బర్ఖత్‌ అలీఖాన్‌ మృతి అనంతరం తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం తొమ్మిదో నిజాంను ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. అమీర్‌పేటలోని మ్యారీగోల్డ్‌ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు షెహజాదా మీర్‌ ముజ్తాబా అలీఖాన్, ఉపాధ్యక్షుడు మీర్‌ నిజాముద్దీన్‌ అలీ­ఖాన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ మొయిజుద్దీన్‌ ఖాన్‌ వివరాలను వెల్లడించారు. 4,500 మంది నిజాం కుటుంబ సభ్యులతో కూడిన సొసైటీ పక్షాన తమ సమస్యలను ప్రభుత్వానికి సమర్థవంతంగా నివేదించగలరన్న పూర్తి విశ్వాసంతో తొమ్మిదో నిజాంగా నవాబ్‌ రౌనఖ్‌ యార్‌ఖాన్‌ను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. విదేశాల్లో ఉంటున్న నిజాం వారసులకంటే స్థానికంగా ఉంటూ తమ ప్రయోజనాలను కాపాడగలిగిన వ్యక్తినే తమ కుటుంబ పెద్దగా తాము ప్రకటించుకున్నామన్నారు. ఈ సందర్భంగా అసఫ్‌ జాహీ వంశపారపర్యంగా వస్తున్న వస్తువులను సమావేశంలో ప్రదర్శించారు. వీటిని తొమ్మిదో నిజాంగా బాధ్యతలు చేపట్టే సమయంలో నవాబ్‌ రౌనఖ్‌ యార్‌ ఖాన్‌కు అందజేస్తారు.

Mukarram Jah Bahadur: 8వ నిజాం ముకరంజా బహదూర్‌ కన్నుమూత
రూ.లక్షల విలువచేసే చేతికర్రలు
అసఫ్‌ జాహీల వంశపారంపర్యంగా వస్తున్న చేతికర్రల విలువ వింటే నోరెళ్ల బెట్టాల్సిందే. ఆనాటి నుంచి ఇప్పటివరకు మూడు చేతికర్రలను భద్రంగా ఉంచుతూ కొత్తగా బాధ్యతలు చేపట్టే నిజాంకు అందిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో ఒకటి మొదటి నిజాం ప్రభువు ప్రత్యేకంగా తయారుచేసుకున్నారు. నాణ్యమైన చెక్కతో ఫిరోజ్‌–హుస్సేనీ డైమండ్‌ పొదగబడిన ఈ కర్ర విలువ అక్షరాలా రూ.30 లక్షలు. పైభాగంలో గుండ్రని నోబ్‌ కలిగి చుట్టూరా 5 బ్రాస్‌ లైన్లతో ఉంటుంది. మరొకటి టిప్పు సుల్తాన్‌ నుంచి నిజాం ప్రభువులు పొందారు. రోజ్‌వుడ్‌తో వివిధ రకాల డిజైన్లతో దీనిని రూపొందించారు. దీని విలువ కూడా 30 లక్షల వరకు ఉంటుంది. ఇంకో చేతికర్ర తాజ్‌మహల్‌ సృష్టికర్త షాజహాన్ నుంచి అందుకున్నారు. ఇది ఏనుగు దంతంతో రూపొందించింది. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందన్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (22-28 జనవరి 2023)


‘ఉడుకు బెల్లం’కు రంగినేని సాహిత్య పురస్కారం 
రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్, చారి­టబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా జాతీయస్థాయిలో అందజేస్తున్న రంగి నేని ఎల్లమ్మ స్మారక సాహిత్య పురస్కారానికి 2022 సంవత్సరానికి చింతకింది శ్రీనివాసరావు రచించిన ‘ఉడుకు బెల్లం’కథాసంపుటి ఎంపికైంది. మార్చిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పురస్కార కమిటీ సమన్వయకర్త మద్దికుంట లక్ష్మణ్ తెలిపారు. ఈ అవార్డు కింద రచయితకు రూ.25 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు ట్రస్టు అధ్యక్షుడు రంగినేని మోహన్‌రావు వెల్లడించారు.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (22-28 జనవరి 2023)


NASA: సౌర కిరీటం.. ఉత్తర ధ్రువ ప్రాంతంలో వింత వెలుగుల వలయం
సూర్యుడి నుంచి ఓ ప్లాస్మా పోగు విడిపోవడమేమిటి, ధ్రువ ప్రాంతంలో రింగులా చక్కర్లు కొట్టడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? నాసా శాస్త్రవేత్తలూ కాసేపు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఇలా జరగడం ఇదే తొలిసారని అంటున్నారు కూడా! సూర్యుడి అయస్కాంత క్షేత్రం రివర్స్‌ అవుతూండటం ఒక కారణం కావచ్చునని అంచనా వేస్తున్నారు.. సూర్యుడు భగభగ మండే అగ్నిగోళమని మనందరికీ తెలుసు. హైడ్రోజన్, హీలియం మూలకాలు ఒకదాంట్లో ఒకటి లయమైపోతూ విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేస్తూంటాయి. ఈ క్రమంలో అక్కడి పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ఆవేశంతో కూడిన వాయువన్నమాట. అప్పుడప్పుడు సూర్యుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడం, ఫలితంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు ఈ ప్లాస్మా పోగులు ఎగసిపడటం మామూలే. వీటిల్లో కొన్ని సూర్యుడి నుంచి విడిపోతూంటాయి కూడా. అయితే ఏ ప్లాస్మా పోగు కూడా ఇప్పటిదాకా ఇలా రింగులా మారి తిరగడం చూడలేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పోగు సూర్యుడి 55 డిగ్రీల అంక్షాంశం వద్ద మొదలై ధ్రువ ప్రాంతాల వైపునకు ప్రయాణిస్తూంటుందని అమెరికాలో కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో ఉన్న నేషనల్‌ సెంటర్‌ ఫర్ అట్మిస్ఫరిక్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ స్కాట్‌ మాకింతోష్‌ వివరించారు. ‘‘పదకొండేళ్లకోసారి ఇలా జరగడం, పోగు కచ్చితంగా ఒకే ప్రాంతం నుంచి మొదలై ధ్రువం వైపు ప్రయాణించడాన్ని పరిశీలించాం. ఈ పోగు పదకొండేళ్ల సోలార్‌ సైకిల్‌లో ఒకే చోట ఎందుకు పుడుతోంది? కచ్చితంగా ధ్రువాలవైపే ఎందుకు ప్రయాణిస్తోంది? ఉన్నట్టుండి మాయమైపోయి, మూడు నాలుగేళ్ల తరువాత అకస్మాత్తుగా అదే ప్రాంతంలో మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతోంది? ఇవన్నీ ఎంతో ఆసక్తి రేపే విషయాలు’’ అని వివరించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

INS Vagir: భారత నావికాదళంలోకి ఐఎన్‌ఎస్ వాగీర్‌

అమెరికా గగనతలంలో మరో బెలూన్‌ కలకలం.. నేలకూల్చిన యుద్ధవిమానం
చైనా భారీ నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చేసిన ఘటన మరువకముందే అగ్రరాజ్యంలో మరో గగనతల ఉల్లంఘన ఉదంతం చోటుచేసు కుంది. అలాస్కాలో కారు పరిమాణంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని వైట్‌హౌస్‌ తెలిపింది. ‘పౌర విమానాల రాకపోకలకు కాస్తంత విఘాతం కల్గించేదిగా ఉన్న వస్తువును కూల్చేశాం. శిథిలాలను వెతికే పనిలో ఉన్నాం’ అని పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ బ్రిగేడియర్‌ జనరల్‌ ప్యాట్‌ రైడర్‌ చెప్పారు. ‘ 40వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న వస్తువును 24 గంటలపాటు నిశితంగా పరిశీలించాక అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశాలమేరకు యుద్ధవిమానం కూల్చేసింది. అది గడ్డ కట్టిన అమెరికా సముద్రజలాల్లో పడింది’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి కోఆర్డినేటర్‌ (వ్యూహాత్మక కమ్యూనికేషన్స్‌) జాన్‌ కిర్బీ మీడియాతో చెప్పారు. ‘‘ఇటీవల కూల్చేసిన చైనా నిఘా బెలూన్‌కు స్వయం నియంత్రణ, గమన వ్యవస్థ ఉన్నాయి. సున్నిత సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది. కానీ ఈ వస్తువు ఏం చేసిందనేది ఇంకా తెలియదు’’ అని ఆయన అన్నారు.

China Spy Balloon: చైనా ‘స్పై బెలూన్’ను కూల్చేసిన అమెరికా!


అత్యంత కఠినమైన యూఎస్‌ఎంఎల్‌ పరీక్షను పాసైన చాట్‌జీపీటీ  
ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ మరో ఘనత సాధించింది. అత్యంత కఠినమైన యూఎస్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జాం (యూఎస్‌ఎంఎల్‌ఈ) పాసైంది. 1, 2సీకే, 3 అనే మూడు సిరీస్‌లుగా ఉండే ఈ పరీక్షల్లో దాదాపుగా 60 శాతం మార్కులు స్కోరు చేసి ఔరా అనిపించింది. వైద్య విద్యార్థులు, శిక్షణలో ఉన్న వైద్యులు రాసే యూఎస్‌ఎంఎల్‌ఈలో బయోకెమిస్ట్రీ, డయాగ్నస్టిక్‌ రీజనింగ్, బయోఎథిక్స్‌ వంటి పలు అంశాలపై లోతుగా ప్రశ్నలుంటాయి. కాలిఫోర్నియాలోని అన్సిబుల్‌హెల్త్‌ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. ఇందులో భాగంగా 2022 జూన్‌ నాటి పరీక్షలో ఇమేజ్‌ ఆధారిత ప్రశ్నలు మినహా మిగతా 350 ప్రశ్నలను చాట్‌జీపీటీకి సంధించారు. మూడు పరీక్షల్లో అది 52.4 నుంచి 75 శాతం మధ్యలో స్కోరు చేసిందట. పాసయ్యేందుకు సగటున 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ అధ్యయన వివరాలను పీఎల్‌ఓఎస్‌ డిజిటల్‌ హెల్త్‌ జర్నల్లో ప్రచురించారు. ‘‘అత్యంత కఠినమైన ఈ పరీక్షను మానవ ప్రమేయం అసలే లేకుండా పాసవడం చాలా గొప్ప విషయం. ఈ ఘనత సాధించడం ద్వారా చాట్‌జీపీటీ కీలక మైలురాయిని అధిగమించింది’’ అని పేర్కొన్నారు. అన్సిబుల్‌హెల్త్‌ సంస్థ ఇప్పటికే సంక్లిష్టమైన వైద్య పరిభాషతో కూడిన రిపోర్టులను రోగులు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలైన భాషలో రాసేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించుకుంటోంది.


 Meteor: హిమగర్భంలో భారీ ఉల్క.. 7.6 కిలోల బరువు
 

Published date : 13 Feb 2023 06:41PM

Photo Stories