Skip to main content

Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణం

సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ ప్రమాణస్వీకారం చేయించారు.

సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్, జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్, జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలు పదవీ ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా అలాహాబాద్, గుజరాత్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ పేర్లను జనవరి 31న కొలీజియం సిఫారసు చేసింది. వీటికి ఆమోదం లభిస్తే మొత్తం 34 మంది జడ్జీలతో సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయనుంది.
3 హైకోర్టులకు 13 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం
అలహాబాద్, కర్నాటక, మద్రాస్‌ హైకోర్టుల్లో 13 మంది అదనపు జడ్జీలు నియమితులయ్యారు. వీరిలో 11 మంది లాయర్లు కాగా ఇద్దరు న్యాయాధికారులు. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం జనవరిలో సిఫార్సు చేసింది. వీరిలో మద్రాస్‌ హైకోర్టు న్యాయవాది లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి బీజేపీతో సంబంధాలున్నాయనే ఆరోపణ వివాదం రేపింది. ఈమె పేరును సిఫార్సు చేయడాన్ని మద్రాస్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ వ్యతిరేకించింది. బార్‌కు చెందిన 21 మంది లాయర్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. ‘‘తాను బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శినంటూ గౌరీ అంగీకరించారు. మైనారిటీలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. మత ఛాందస భావాలున్న ఆమె న్యాయమూర్తిగా అనర్హురాలు’’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 10న విచారణ జరగాల్సి ఉంది.  

High Court Judges: 554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్‌ కేటగిరీకి చేందిన‌వారే..

 

Published date : 07 Feb 2023 01:31PM

Photo Stories