ఎన్‌ఐఏ డీజీగా బాధ్యతలు చేపట్టనున్న ఐపీఎస్ అధికారి?
Sakshi Education
సీఆర్‌పీఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలను కూడా అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్‌ఐఏ డీజీగా ఉన్న<strong>వైసీమోదీ</strong> మే 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో మే 29న కుల్దీప్‌సింగ్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ అదేశాలు వెలువడ్డాయి.
కుల్దీప్ సింగ్ 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పశ్చిమబెంగాల్ కేడర్ అధికారి. ప్రస్తుతం ఆయన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కు డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తదుపరి చీఫ్ నియామకం వరకు కుల్దీప్ ఎన్‌ఐఏ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. పదవీ విరమణ చేయనున్న మోదీ1984 ఐపీఎస్ బ్యాచ్ అస్సాం–మేఘాలయ కేడర్ అధికారి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఐఏ డీజీగా బాధ్యతలు చేపట్టనున్న ఐపీఎస్ అధికారి?
ఎప్పుడు : మే 31
ఎవరు : సీఆర్‌పీఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్
ఎందుకు :ప్రస్తుతం ఎన్‌ఐఏ డీజీగా ఉన్నవైసీమోదీ మే 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఐఏ డీజీగా బాధ్యతలు చేపట్టనున్న ఐపీఎస్ అధికారి?
ఎప్పుడు : మే 31
ఎవరు : సీఆర్‌పీఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్
ఎందుకు :ప్రస్తుతం ఎన్‌ఐఏ డీజీగా ఉన్నవైసీమోదీ మే 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో...
Published date : 31 May 2021 06:30PM