Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 3rd కరెంట్ అఫైర్స్
Most Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్ అగ్రభాగంలో నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయం ఆధారంగా చేసుకొని లండన్‌కు చెందిన ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) 172 నగరాల జాబితాను రూపొందించింది. ఈ నగరాల్లో గత ఏడాదితో పోల్చి చూస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ సగటున 8.1% పెరిగినట్టు తాను విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరం గత ఏడాది మొదటి స్థానంలో ఉంటే ఈ సారి మూడో స్థానానికి తగ్గింది. ఆసియా దేశాల్లో ఏడాదిలో జీవన వ్యయం సగటున 4.5% పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. న్యూయార్క్, సింగపూర్ మొదటి స్థానాన్ని పంచుకుంటే నాలుగో స్థానంలో హాంకాంగ్, లాస్‌ఏంజెలెస్ నిలిచాయి.
☛ Best Cities: ప్రపంచంలో అత్యుత్తమ నగరాలు
సర్వే ఎలా చేశారంటే.!
ప్రపంచవ్యాప్తంగా 172 నగరాల్లోని 200కిపైగా నిత్యావసర వస్తువుల ధరలు, 400 వరకు రవాణా, వైద్య చికిత్స వంటి సేవల ధరల్ని పోల్చి చూస్తూ ఈ జాబితాను రూపొందించారు. ఈ ఏడాది ఆగస్టు, సెపె్టంబర్‌లో ఈ సర్వే నిర్వహించినట్టుగా ఈఐయూ సంస్థ చీఫ్ ఉపాసన దత్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు, చైనాలో జీరో కోవిడ్ విధానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తు సామాగ్రి రవాణాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగిపోయాయని , గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదని ఆమె తెలిపారు. అమెరికాలో ధరాభారం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ దేశంలోని మూడు నగరాల్లో మొదటి పది స్థానాల్లో నిలిచాయని ఉపాసన వివరించారు.
మన నగరాలు చౌక
ఇక భారత్‌లోని నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువని ఈ సర్వేలో తేలింది. మొత్తం 172 దేశాలకు గాను మన దేశంలో బెంగుళూరు 161 స్థానంలోనూ చెన్నై 164, అహ్మదాబాద్ 165 స్థానంలోనూ నిలిచాయి. అత్యంత చౌక నగరాలుగా సిరియా రాజధాని డమాస్కస్, లిబియాలోని ట్రిపోలీ అట్టడుగున వరసగా 172, 171 స్థానాల్లో నిలిచాయి.
టాప్–10 ఖరీదైన నగరాలు ఇవే
1. న్యూయార్క్ (అమెరికా)
1. సింగపూర్
3. టెల్ అవీవ్ (ఇజ్రాయెల్)
4. హాంకాంగ్
4. లాస్ ఏంజెలెస్ (అమెరికా)
6. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)
7. జెనీవా ( స్విట్జర్లాండ్)
8. శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)
9. పారిస్ (ఫ్రాన్స్)
10. కోపెన్‌హగెన్ (డెన్మార్క్)
10. సిడ్నీ (ఆ్రస్టేలియా)
☛ లక్ష జీతం వదులుకున్నా.. జామకాయలు అమ్ముతున్నా.. కారణం ఇదే..
Cosmic Violence: అరుదైన అంతరిక్ష దృగ్విషయం..అంత్య దశలో ఉన్న నక్షత్రాన్ని..
అంతరిక్షంలో రగడ జరుగుతోంది! మరణిస్తున్న ఓ తారను అతి భారీ కృష్ణ బిలమొకటి శరవేగంగా కబళించేస్తోంది. ఈ ఘర్షణ వల్ల చెలరేగుతున్న కాంతి పుంజాలు సుదూరాల దాకా కనువిందు చేస్తున్నాయి. ఈ అరుదైన అంతరిక్ష దృగ్విషయాన్ని ఉత్తరాఖండ్‌లోని సరస్వతి పర్వత శిఖరంపై ఉన్న టెలిస్కోప్ ‘గ్రోత్’ గుర్తించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్, ఐఐటీ బాంబే సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఇది భారత తొలి పూర్తిస్థాయి రొబోటిక్ ఆప్టికల్ రీసెర్చ్ టెలిస్కోప్. ‘‘అంత్య దశలో ఉన్న ఆ నక్షత్రాన్ని భారీ కృష్ణబిలం అనంతమైన ఆకర్షణ శక్తితో తనలోకి లాగేసుకుంటోంది. దాంతో నక్షత్రం ఊహాతీత వేగంతో దానికేసి సాగుతోంది. వీటిని టైడల్ డిస్‌రప్షన్ ఈవెంట్స్ (టీడీఈ) అంటారు’’ అని ఐఐటీ బాంబే ఆస్ట్రో ఫిజిసిస్ట్ వరుణ్ భలేరావ్ వివరించారు. ఈ అంతరిక్ష రగడకు కేంద్రం మనకు 850 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందట! ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి.
Supreme Court: కొలీజియం వ్యవస్థను నీరుగార్చొద్దు
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను అనవసర వ్యాఖ్యలు, వాదనలతో నీరుగార్చొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో అత్యంత పారదర్శకంగా పనిచేస్తున్న వ్యవస్థల్లో ఇదొకటని ఉద్ఘాటించింది. ఈ వ్యవస్థపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఏం చెప్పారన్నదానిపై తాము ఏమీ మాట్లాడదలచుకోలేదని వెల్లడించింది. కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం ఏమిటంటూ కొలీజియం వ్యవస్థను కేంద్రం వ్యతిరేకిస్తోంది. న్యాయ వ్యవస్థలోనూ కొలీజియం ఉండాలని కొందరు, జడ్జీలను ప్రభుత్వమే నియమించాలని మరికొందరు అంటున్నారు. 2018 డిసెంబర్ 12 నాటి సుప్రీంకోర్టు కొలీజియం భేటీ అజెండాను బయట పెట్టాలంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్త అంజలి భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం డిసెంబర్ 3వ తేదీ విచారణ చేపట్టింది. సంబంధం లేని వ్యక్తులు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని, కొలీజియం వ్యవస్థను పట్టాలు తప్పించవద్దంటూ ఈ సందర్భంగా సూచించింది.
TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చదివారంటే..
Ukraine war: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ ప్రాణనష్టం
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. యుద్ధం మొదలైన ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా 13 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదార మైఖైలో పోడోల్యాక్ వెల్లడించారు. వీరిలో సాధారణ పౌరులే అధికమన్నారు. రష్యా సైనికులు లక్ష మంది దాకా మరణించినట్టు అంచనా వేశామన్నారు. లక్షన్నర మంది గాయపడి ఉంటారని తెలిపారు. ఉక్రెయిన్ వైపు చనిపోయిన, గాయపడ్డ వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ రెండు పక్షాల్లో కలిపి మృతుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లీ అన్నారు. ఉక్రెయిన్ పౌరులు 40 వేల మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇక ఇరువైపులా కలిపి 6,655 మంది పౌరులు మరణించారని, 10, 368 మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. సైనికులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఐరాస వెల్లడించలేదు.
ఫిఫా వరల్డ్‌కప్ వెనుక ఉన్న కథ ఇదే.. ఇప్పటి వరకు విజేతలుగా నిలిచిన జట్లు ఇవే..
Vijay Hazare Trophy: సౌరాష్ట్రదే ‘విజయ్’ హజారే ట్రోఫీ
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో మహారాష్ట్ర జట్టును ఓడించింది. షెల్డన్ జాక్సన్ (133 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో సౌరాష్ట్ర విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదట మహారాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (108; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసి గెలిచింది.
National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం
Woman Referee: వరల్డ్ కప్‌లో తొలిసారి మహిళా రిఫరీలు
వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. జర్మనీ, కోస్టారికా మ్యాచ్‌కు ముగ్గురు మహిళలే రిఫరీలుగా వ్యవహరించడం విశేషం. ఫుట్‌బాల్ పురుషుల ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇలాంటిది జరగడం ఇదే మొదటిసారి కాగా.. స్టెఫానీ ఫ్రాపర్ట్ (ఫ్రాన్స్) ఫీల్డ్ రిఫరీగా, న్యూజా బ్యాక్ (బ్రెజిల్), కరెన్ డియాజ్ (మెక్సికో) అసిస్టెంట్ రిఫరీలుగా ఈ ఘనతలో భాగమయ్యారు. తదుపరి మ్యాచ్‌ల్లో సలీమా ముకన్‌సంగా (రువాండా), యోషిమి యామషిటా (జపాన్) కూడా ఫీల్డ్ రిఫరీలుగా వ్యవహరించనున్నారు. 38 ఏళ్ల స్టెఫానీ 2019లో లివర్‌పూల్, చెల్సీ జట్ల మధ్య యూరోపియన్ కప్ పురుషుల సూపర్ కప్ ఫైనల్లో, 2020లో చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో, గత సీజన్‌లో ఫ్రెంచ్ కప్ ఫైనల్లోనూ రిఫరీగా వ్యవహరించింది. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022 నవంబర్ 20 నుంచి ఖతార్‌లో జరుగుతుంది.
Supreme Court: సుప్రీంకోర్టులో మరోసారి మహిళా ధర్మాసనం
SS Rajamouli: రాజమౌళికి ప్రతిష్ఠాత్మక అవార్డు
టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ (New York Film Critics Circle Award) అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడిగా అమెరికాలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్(NYFCC) 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాకుగానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. దీంతో ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా ఆయన రికార్డు సృష్టించాడు. ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డును వార్తా పత్రికలు, మ్యాగజైన్స్, ఆన్‌లైన్ మీడియాకు సంబంధించిన ప్రముఖులు ఒక టీమ్‌గా ఏర్పడి 1935 నుంచి సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అందజేస్తున్నారు. కాగా ఇటీవలే లాస్ ఏంజిల్స్ టైమ్స్ అనే ఇంగ్లీష్ పేపర్ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజ్‌లో ఓ పెద్ద ఆర్టికల్ ప్రచురించడం విశేషం.
➤ చిరంజీవికి అరుదైన గౌరవం.. మోదీ ప్రత్యేక అభినందనలు
ఫిబ్రవరి 25,2022 విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సంచలనం విజయం సాధించింది. ఓవరల్‌గా 1200కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి రాజమౌళికి వరుసగా రెండోసారి 1000 కోట్ల క్లబ్‌లో నిలిచిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అలరించిన ఈ సినిమా ఇప్పటికే శాటర్న్, సన్‌సెట్ సర్కిల్ వంటి పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది. మరోవైపు ఈ సినిమా దాదాపు 14 విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ బరిలో పోటీ పడనుంది.