Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 30th కరెంట్ అఫైర్స్
India's Billionaire Club: 2022లో బిలియనీర్ క్లబ్ నుంచి 22 మంది అవుట్
ఐశ్వర్యవంతులకు ఈ ఏడాది అచ్చిరాలేదు. మార్కెట్ల పతనంతో బిలియనీర్ల స్థానాలు చెల్లా చెదురయ్యాయి. బడా బిలియనీర్లు మరింత బలపడితే.. బిలియనీర్ క్లబ్ (కనీసం బిలియన్ డాలర్లు అంతకుమించి సంపద ఉన్నవారు)లో దిగువన ఉన్నవారు ఏకంగా ఆ హోదానే కోల్పోవాల్సి వచ్చింది. ఒక్క అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీకి 2022ను జాక్‌పాట్ సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దేశ కుబేరుడిగా ఉన్న ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి, దేశంలోనే అత్యంత ఐశ్వర్యమంతుడిగా మొదటి స్థానానికి చేరుకోవడమే కాదు.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎగబాకారు. 2021 చివరికి అదానీ నెట్‌వర్త్ (సంపద విలువ) 80 బిలియన్ డాలర్లు ఉండగా, ఏడాది తిరిగేసరికి 70 శాతం పెరిగి 135.7 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూంబర్గ్ గణాంకాల ప్రకారం ఆసియాలోనూ అదానీయే నంబర్ 1గా ఉన్నారు. డాలర్ మారకంలో బిలియనీర్ ప్రమోటర్ల సంఖ్య ఈ ఏడాది 120కి తగ్గింది.
GST: రూ.2 కోట్లు దాటితేనే ‘జీఎస్టీ’నేరం
2021 చివరికి వీరి సంఖ్య 142గా ఉంది. అయితే 24 మంది ప్రమోటర్లు బిలియనీర్ క్లబ్‌లో స్థానం కోల్పోగా.. కొత్తగా ఐఐఎఫ్‌ఎల్ ప్రమోటర్లు ఇద్దరు ఉమ్మడిగా, క్యాప్రిగ్లోబల్ ప్రమోటర్ ఇందులోకి వచ్చి చేరారు. బిలియనీర్ల ఉమ్మడి సంపద సైతం ఈ ఏడాది కొంత కరిగిపోయింది. 8.8 శాతం క్షీణించి 685 బిలియన్ డాలర్లకు (రూ.56.62 లక్షల కోట్లు) పరిమితమైంది. 2021 చివరికి వీరి ఉమ్మడి సంపద విలువ 751.6 బిలియన్ డాలర్లుగా ఉండడాన్ని గమనించొచ్చు. దేశంలోని టాప్–10 సంపన్న పారిశ్రామికవేత్తల్లో ఈ ఏడాది గౌతమ్ అదానీతోపాటు, సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి, భారతీ ఎయిర్‌టెల్ సునీల్ భారతీ మిట్టల్ మినహా మిగిలిన ఏడుగురి సంపద విలువ క్షీణించింది.
ముకేశ్ సంపద 102 బిలియన్ డాలర్లు
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్థానచలనం పొందారు. 2021 చివరికి జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, దీన్ని గౌతమ్ అదానీకి కోల్పోయి రెండో స్థానంలోకి వచ్చారు. ముకేశ్ అంబానీ కుటుంబ సంపద విలువ 2.5 శాతం క్షీణించి గతేడాది చివరికి ఉన్న 104.4 బిలియన్ డాలర్ల నుంచి 101.75 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ప్రభావాలతో ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు బలహీన పనితీరు చూపించడం, బిలియనీర్ల సంపద తగ్గడానికి గల కారణాల్లో ప్రధానమైనది. టెలికం రంగంలో చిన్నాచితకా కంపెనీలన్నీ మూతపడిపోవడం, చివరికి వొడాఫోన్ ఐడియా సైతం బక్కచిక్కడం, టారిఫ్‌లను గణనీయంగా పెంచడంతో ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్ సంపద వృద్ధి చెందింది.
PAN Card: ఆధార్ లింక్ లేని పాన్‌కార్డు వేస్ట్
T20 Cricketer of the Year: ‘ఐసీసీ టి20 క్రికెటర్’ రేసులో సూర్యకుమార్, స్మృతి
ఈ ఏడాది టి20ల్లో ఇచ్చే ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో సూర్యకుమార్ యాదవ్, స్మృతి మంధాన ఉన్నారు. పురుషుల కేటగిరీలో భారత డాషింగ్ బ్యాటర్‌తోపాటు స్యామ్ కరన్ (ఇంగ్లండ్), మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), సికందర్ రజా (జింబాబ్వే) నామినేట్ అయ్యారు. ఈ సీజన్‌లో ప్రత్యేకించి పొట్టి ఫార్మాట్‌లో సూర్యకుమార్ సంచలన బ్యాటర్‌గా ఎదిగాడు. టోర్నీల్లో నిలకడైన ప్రదర్శనతో రాణించాడు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా ఘనత వహించాడు. అంతేకాదు.. మొత్తం 1164 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ అతను రికార్డులకెక్కాడు. 68 సిక్సర్లు బాదిన సూర్య, 187.43 స్ట్రయిక్ రేట్ నమోదు చేశాడు. సిక్స్‌ల పరంగా తనే అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది రెండు మెరుపు సెంచరీలు కొట్టిన సూర్య ఖాతాలో మరో తొమ్మిది అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ముంబైకి చెందిన సూర్య ఆ్రస్టేలియా ఆతిథ్యమిచ్చిన టి20 ప్రపంచకప్‌లోనూ మెరిశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 60 పరుగుల సగటుతో మూడు ఫిఫ్టీలు బాదాడు. 189.68 స్ట్రయిక్‌రేట్ నమోదు చేశాడు. అసాధారణ ప్రదర్శనతో కెరీర్ బెస్ట్ టాప్ ర్యాంక్‌కు చేరుకోవడమే కాదు.. 890 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పరుచుకున్నాడు. రెండో ర్యాంకులో ఉన్న రిజ్వాన్ (836) అతని దరిదాపుల్లో కూడా లేడు.
‘ఐసీసీ పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ రేసులో మాత్రం ఒక్క భారత ప్లేయర్ లేడు. పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ ఆజమ్, అడమ్ జంపా (ఆ్రస్టేలియా), సికందర్ రజా (జింబాబ్వే), షై హోప్ (వెస్టిండీస్) నామినేట్ అయ్యారు. 2009లో శివనారాయణ్ చందర్‌పాల్ తర్వాత షై హోప్ రూపంలో వన్డే క్రికెటర్ అవార్డు కోసం విండీస్ ప్లేయర్ నామినేట్ కావడం గమనార్హం. ‘ఐసీసీ మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ రేసులో షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), అమెలియా కెర్ (న్యూజిలాండ్), నాట్ సివెర్ (ఇంగ్లండ్), అలీసా హీలీ (ఆస్ట్రేలియా) ఉన్నారు. త్వరలోనే విజేతల వివరాలను ఐసీసీ ప్రకటించనుంది.
వరుసగా రెండో ఏడాది..
మహిళల విభాగంలో గతేడాది ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు నామినేట్ అయిన భారత ఓపెనర్ స్మృతి మంధాన ఈ ఏడాదీ రేసులో నిలిచింది. తాజా 2022 తుది జాబితాలో నిదా దార్ (పాకిస్తాన్), సోఫీ డివైన్ (న్యూజిలాండ్), తాహ్లియా మెక్‌గ్రాత్ (ఆ్రస్టేలియా)లతో స్మృతి పోటీ పడుతుంది. ఈ ఏడాది స్మృతి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించడంతో వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా ఘనత వహించింది. ఈ సీజన్‌లోనూ తన జోరును కొనసాగించిన ఆమె ఈ ఫార్మాట్ కెరీర్‌లో 2500 పరుగుల్ని పూర్తి చేసుకుంది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్, టి20 ఆసియా కప్ ఈవెంట్‌లలోనూ మెరుపులు మెరిపించింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)
National Swimming Championship: రిత్విక, ఆదిత్యలకు స్వర్ణాలు
సౌత్‌జోన్ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు మూడు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. తిరువనంతపురంలో జరుగుతున్న ఈ టోర్నీలో గ్రూప్–1 బాలికల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో మిట్టపల్లి రిత్విక 35.91 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకం సాధించింది. గ్రూప్–3 బాలికల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో అనిక బంగారు పతకం గెలిచింది. బాలికల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన మేఘన నాయర్ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.లాస్యశ్రీ 1:08.29 సెకన్లలో గమ్యానికి చేరి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. గ్రూప్–3 బాలుర 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో తెలంగాణ కుర్రాడు ఆదిత్య స్వర్ణం సంపాదించగా.. 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో వర్షిత్ రజతం గెలిచాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైనది తేదీలు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా లికుడ్ పార్టీ చీఫ్ బెంజమిన్ నెతన్యాహు(73) ఆరోసారి ప్రమాణం చేశారు. 120 మంది సభ్యులుండే నెస్సెట్(పార్లమెంట్)లో గురువారం జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు. నెతన్యాహు బలహీనుడంటూ నినాదాలు చేసిన పలువురు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. అనంతరం నెతన్యాహు పదవీ ప్రమాణం చేశారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడి నూతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కొత్తగా సంకీర్ణంలో లికుడ్ పార్టీతోపాటు ఛాందసవాద షాస్, యునైటెడ్ టోరా జుడాయిజం, ఓట్జ్మా యెహుడిట్, జియోనిస్ట్, నోమ్ పార్టీలున్నాయి.
Prachanda: నేపాల్ ప్రధానిగా ప్రచండ
BrahMos: యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ ప్రయోగం
భారత రక్షణ రంగం మరింత బలోపేతమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. సుఖోయ్–30 యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ క్షిపణిని గురువారం బంగాళాఖాతంలో పరీక్షించారు. బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతమై 400 కి.మీ. దూరంలో ఉన్న నౌకను పేల్చేసింది. ‘‘భారత వాయుసేన సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఉపరితలం, సముద్ర మార్గంలో సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వైమానిక దళానికి లభించినట్టయింది’’ అని రక్షణ శాఖ వెల్లడించింది. యుద్ధ విమానం నుంచి సుఖోయ్‌ని ప్రయోగించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో సూపర్‌సోనిక్ మిస్సైల్ ఎక్స్‌టెండెండ్ వెర్షన్‌ను సుఖోయ్ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు క్షిపణి పరిధిని 290 కిలోమీటర్ల స్థాయి నుంచి 400 కిలోమీటర్లకు పెంచారు.
Road Accidents: హెల్మెట్ పెట్టుకోకపోవడంతో 46,593 మంది మృతి
దేశంలో 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల 16,397 మంది చనిపోయారు. వీరిలో 8,438 మంది సంబంధిత వాహనాల డ్రైవర్లు కాగా, 7,959 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించక పోవడం వల్ల 46,593 మంది మృతి చెందారు. వీరిలో 32,877 మంది వాహనచోదకులు, మిగతా 13,716 మంది ప్రయాణికులు. కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 2021లో దేశవ్యాప్తంగా జరిగిన 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది దుర్మరణం పాలవగా, 3,84,448 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో హెల్మెట్ ధరించని వారు 93,763 మంది, సీటు బెల్ట్ ధరించని వారు 39,231 మంది అని పేర్కొంది.
Ministry of Road Transport: 4.12 లక్షల ప్రమాదాలు.. 1.53 లక్షల మంది బలి
మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 8.2% డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, జంపింగ్ రెడ్ లైట్, సెల్ ఫోన్ వాడకం వంటి కారణాలతోనే జరిగాయని తెలిపింది. జాతీయ రహదారులపై జరిగే 9.35% ప్రమాద మరణాలకు ఇవే కారణాలని తెలిపింది. 67.5% ప్రమాదాలు తిన్నగా ఉండే రహదారులపై జరుగుతున్నాయి. గుంతలు, ఇరుకుగా, ఏటవాలుగా ఉండే రోడ్లపై 13.9% ప్రమాదాలు జరుగుతున్నాయని విశ్లేషించింది. కూడళ్లలో 20% ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టి–జంక్షన్లలో జరిగే ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోవడమో, గాయపడటమో జరుగుతోందని తెలిపింది. 2021లో అనుకూల వాతావరణ పరిస్థితుల్లోనే నాలుగింట మూడొంతుల ప్రమాదాలు సంభవించగా, మంచు, వర్షం, గాలుల తీవ్రత వల్ల 16% ప్రమాదాలు జరిగాయని వివరించింది. దేశంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్‌లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)
Russian Missiles: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం
ఉక్రెయిన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ఇతర కీలక మౌలిక వనరులే లక్ష్యంగా రష్యా మరోసారి భారీగా క్షిపణి దాడులకు పాల్పడింది. డిసెంబర్ 29న ఒక్క రోజు వ్యవధిలోనే రష్యా ప్రయోగించిన 69 మిస్సైళ్లలో 54 క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యా దురాక్రమణ మొదలయ్యాక ఇది 10వ అతిపెద్ద దాడి అని ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ అభివర్ణించారు. డిసెంబర్ 28 రాత్రి నుంచి పేలుడు పదార్థాలతో కూడిన రష్యా డ్రోన్లు వివిధ ప్రాంతాలపైకి దూసుకొచ్చాయని తెలిపింది. దీంతో, దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తంగా చేస్తూ సైరన్లు మోగాయి. ఉక్రెయిన్‌కు చెందిన ఎస్–300 క్షిపణిని తమ బ్రెస్ట్ ప్రాంతంలో కూల్చివేశామని రష్యా మిత్ర దేశం బెలారస్ ప్రకటించింది. అది పొరపాటున వచ్చి ఉంటుందని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని ఉక్రెయిన్ తెలిపింది. అయితే, తాము ఆక్రమించిన ఉక్రెయిన్‌లోన భూభాగాలను తమవిగా ఒప్పుకుంటేనే చర్చలకు సిద్ధమని రష్యా తెగేసి చెప్పింది.
Corona Virus: కరోనా ఫోర్త్ వేవ్‌తో మనకు ముప్పు లేదు
Telangana DGP: ఇన్‌చార్జి డీజీపీగా అంజనీకుమార్
తెలంగాణ ఏసీబీ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంజనీకుమార్ (1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి)ను డీజీపీ హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్(హెచ్‌వోపీఎఫ్)గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ డిసెంబర్ 29న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి డిసెంబర్ 31న పదవీవిరమణ పొందుతున్నందున ఆయన స్థానంలో అంజనీకుమార్‌ను నియమించారు. అంజనీకుమార్‌తోపాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులు వీరే..
అధికారి పేరు | ప్రస్తుత స్థానం | బదిలీ స్థానం |
అంజనీకుమార్ | ఏసీబీ డీజీపీ | డీజీపీ(హెచ్‌వోపీఎఫ్) |
రవిగుప్తా హోంశాఖ | ముఖ్యకార్యదర్శి | ఏసీబీ, డీజీపీ |
డాక్టర్ జితేందర్ | శాంతిభద్రతల అడిషనల్ డీజీ | హోంశాఖ ముఖ్య కార్యదర్శి |
మహేశ్ మురళీధర్ భగవత్ | సీపీ, రాచకొండ | అడిషనల్ డీజీ, సీఐడీ |
దేవేందర్‌సింగ్ చౌహాన్ | అడిషనల్ సీపీ(లా అండ్ ఆర్డర్) | సీపీ, రాచకొండ |
సంజయ్‌కుమార్‌జైన్ | అడిషనల్ డీజీ(పీ అండ్ ఎల్) | శాంతిభద్రతల అడిషనల్ డీజీ |
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
President Droupadi Murmu: ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి
సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు తమ సొంత విజయాలతో సంతృప్తి చెంది ఆగిపోవద్దని.. సమాజంలోని సామాజిక, ఆర్థిక, డిజిటల్ అంతరాలను తొలగించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు.
ఉద్యోగాలు చేయడం కోసం కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్) రంగాల విద్య, పరిశోధనల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. డిసెంబర్ 29న హైదరాబాద్‌లోని నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు.
విద్యలో మార్పుతో మెరుగైన ప్రపంచం
భారతదేశాన్ని ప్రపంచంలోనే బలీయమైన మేధోశక్తిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్రపతి చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండటం, సమానత్వం, నాణ్యత, బాధ్యత అన్న నాలుగు స్తంభాల ఆధారంగా ఈ కొత్త విద్యావిధానం రూపు దిద్దుకుందని తెలిపారు. సంపూర్ణ, బహుముఖ, పట్టువిడుపులున్న విద్యావ్యవస్థ విద్యార్థుల్లోని నైపుణ్యాలను మరింత సమర్థంగా వెలికితీయగలవని, నేర్చుకునే శక్తిని పెంచగలవని చెప్పారు. ఆధునిక యుగంలో ఇంజనీర్ వృత్తి చాలా కీలకమని.. వారికి ప్రపంచాన్ని మార్చేసే శక్తి ఉంటుందని వివరించారు.
హక్కులను అడిగి సాధించుకోవాలి..
ఒక మహిళ రాష్ట్రపతిగా, త్రివిధ దళాధిపతిగా ఉన్న భారతదేశంలో మహిళలు ఎన్నడూ బలహీనులుగా తమని తాము అనుకోరాదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహిళలు తమ హక్కుల కోసం ఎదురు చూడటం కాకుండా వాటిని అడిగి మరీ సాధించుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం విద్యార్థులకు ఆదర్శప్రాయమని చెప్పారు.
సమతామూర్తిని దర్శించుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 29న శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ శ్రీరామనగరం క్షేత్రానికి చేరుకున్నారు. ఆమెకు త్రిదండి చినజీయర్‌స్వామి చినజీయర్ స్వామి ఒక్కో ఆలయం విశిష్టతను రాష్ట్రపతికి వివరించారు. అనంతరం శ్రీరామానుజాచార్యుల సువర్ణమూర్తిని దర్శించుకున్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)