Skip to main content

President Droupadi Murmu: కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పుచేర్పులు అవసరం

హైదరాబాద్‌లోని కేశవ్‌ మెమోరియల్‌ విద్యా సంస్థల్లో డిసెంబ‌ర్ 27న‌ నిర్వహించిన ‘నైజాం నుంచి హైదరాబాద్‌ విముక్తి’ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రాజ్యాంగంలో కాలానుగుణంగా మార్పులు, చేర్పులు సహజమని, అవసరం కూడా అని ఆమె అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రసా­దిం­చా­రని కొనియాడారు. 75 సంవత్సరాల్లో దేశ జనాభా ఎంతో పెరిగిందని, ­కా­­లా­ను­గుణంగా మార్పులు చోటుచే­సు­కున్నాయని చెప్పారు. ఆ మార్పులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, అది అవసరం కూడా అని చెప్పారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, పాశ్చాత్య దేశాల సంస్కృతిని కొంతవరకు అనుసరించినా, మన మూలాలను మరిచి పోవద్దంటూ హితోపదేశం చేశారు. విలువలతో కూడిన విద్య అవసరమని, పుస్తక విజ్ఞానమే కాకుండా, సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. 

ప్రముఖ సినీనటుడు సీనియర్‌ నటుడు కైకాల కన్నుమూత.. ఈయ‌న జీవిత ప్ర‌స్థానం ఇలా..
లింగ వివక్ష సరికాదు..

‘సమాజంలో లింగ వివక్ష సరికాదు. అందరూ సమానమే అన్న భావన రావాలి. కొందరు దేవాలయంలో అమ్మవారికి వంగివంగి దండాలు పెడ్తారు. మహిళలను కించపరిచే సమయంలో అలాంటి వారికి మన దేవతలు గుర్తుకు రారా? భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి. వాటిని వదిలేసి పాశ్చాత్య సంస్కృతిలో పడొద్దు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారో పరిశీలించాల్సిన అవసరం ఉంది. మహిళలపై ఆంక్షలు విధించడం సరికాదు. వారు ప్రస్తుతం ఎంతో ఉన్నతస్థాయికి ఎదుగుతున్నారు. ఇంట్లో భోజనం కంటే హోటల్లో భోజనం బాగుందని రోజూ వెళ్లలేం కదా. అలాగే భారత సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇవ్వాలి. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి. దేశ సంస్కృతిని కించపరిచే చర్యలు సరికాదు. ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయంటే అది కేవలం మన ఉన్నతమైన సంస్కృతితోనే..’ అని రాష్ట్రపతి స్పష్టం చేశారు.

Good News: ఈ కేంద్ర పథకం ద్వారా మీకు రూ.15 లక్షలు వస్తాయ్‌..! మీరు ఇలా చేస్తే..
తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం 

హైదరాబాద్‌ సంస్థానం నుంచి విముక్తి కోసం ఉద్యమించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం. వారిని ఎల్లవేళలా గౌరవించాలి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ విముక్తి ఉత్సవాలు నిర్వహించుకోవడం గొప్ప విషయమ‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు.

ఒక్కో మెట్టునూ అధిరోహిస్తూ రాష్ట్రపతి అయ్యా..
‘చిన్నతనంలో నేను ఎన్ని గ్రామాలు తిరిగినా మార్పు తెలియలేదు. పట్టణానికి వచ్చిన వెంటనే మార్పు చూశా. ఆ మా­ర్పును అధిగమించి ఒక్కో మెట్టునూ అధిరో­హించా. ఈ రోజు మీ ముందుకు దేశ రాష్ట్రప­తి హోదాలో రాగలిగా. అమెరికా, బ్రిటన్‌ మాదిరిగా మన దేశం కూడా ఉండాలని విద్యార్థులు కోరుతున్నారు. కానీ అక్కడి జనాభా ఎంత.? మన జనాభా ఎంత.? మన దేశంలో విభిన్న సంస్కృతులు, భాష­లు, మతాలున్నాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్లవెంటే మనం వెళ్లడం కాదు, వారు మనవెంట వచ్చే విధంగా విద్యార్థులు సిద్ధం కావాలి. (ఈ సమయంలోనే ‘మీరే ప్రధాని అయితే ఏం చేస్తారు?’ అంటూ విద్యార్థులను రాష్ట్రపతి ప్రశ్నించారు. దీనితో ఓ విద్యార్థి స్పందిస్తూ..‘సారే జహాసే అచ్ఛా.. హిందుస్థాన్‌ హమారా..’ అనే నినాదంతో ముందుకెళ్తానని అన్నారు) ‘కథక్, కూచిపూడి, కథాకళి వంటి ఎన్నో నృత్యరీతులను విదేశీ­యు­లు వచ్చి నేర్చుకుంటున్నారు. అది మనకు గర్వకారణమ‌న్నారు. రాష్ట్రపతి అక్కడి నుంచి నిష్క్రమించే సమయంలో సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు.  
ఆత్మ నిర్భర భారత్‌ దిశగా మిధాని

వైడ్‌ ప్లేట్‌ మిల్లును ప్రారంభిస్తున్న రాష్ట్రపతి ముర్ము


ప్రతి­ష్టా­త్మక అగ్ని క్షిపణితో పాటు అనేక రక్షణ రంగ అవసరా­లు తీర్చ­గల సరికొత్త వ్యవస్థను ఏర్పా­టు చేసుకోవడం ద్వారా మిశ్ర ధాతు నిగమ్‌ (మిధాని) ఆత్మ నిర్భర భారతం వైపు మేలి ముం­దడుగు వేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభి­నందించారు. మిధానిలో సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన వైడ్‌ ప్లేట్‌ మిల్లును రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి మిల్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో దిగుమ­తులు తగ్గుతాయన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మిధాని ప్రపంచంలోనే అత్యాధునిక లోహ ధాతు తయారీ సంస్థగా ఎదిగిందని, ఇది దేశానికే గర్వకారణమని కొనియాడారు. టైటానియంతో పాటు  అనేక ప్రత్యేక లక్షణాలున్న మిశ్ర ధాతువులు మిధానిలో తయారవుతున్నా­యని, ఇవి దేశ అంతరిక్ష, రక్షణ, ఇంధన, వ్యూహాత్మక రంగాల్లో కీలకం అవుతున్నా­యని వివరించారు.  

IPL 2023 Mini Auction Latest News : ఐపీఎల్ 2023 వేలంలో అత్యధికంగా ధ‌ర ప‌లికిన ఆట‌గాళ్లు వీరే..
భారత భవిష్యత్తు మీ భుజాలపైనే..!

భారత భవిష్యత్తు భారం యువ ఐపీఎస్‌ అధికారుల భుజ­స్కంధాలపైనే ఉందని, వారంతా భారత ప్రతిష్టను పెంచేలా కృషి చేస్తారన్న విశ్వా­సం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాష్ట్రపతి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ (ఎన్‌పీఏ)ని సందర్శించి, అకాడమీలో శిక్షణ పొందుతున్న 195 మంది 74వ బ్యాచ్‌ ట్రైనీ ఐపీఎస్‌ అధికారులనుద్దేశించి ఆమె ప్రసంగించారు. తొలుత ప్రతిష్టాత్మకమైన సేవలోకి అడుగు పెడుతున్న యువ ఐపీ ఎస్‌లకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వాల పనితీరును, ప్రతిష్టను పెంచే కీలక బాధ్యత పోలీస్‌ వ్యవస్థపై ఉందన్నారు. పౌరులకు ప్రభుత్వ సేవలు చేరువ చేయడంలో పోలీస్‌ అధికారుల వ్యక్తిత్వం, ప్రవర్తన కీలకమని సూచించారు. నేరాల కట్టడి, నేరాల దర్యాప్తు, ఉగ్రవాదం, మత ఘర్షణలు, వ్యవస్థీకృత నేరాల అదుపు వంటి సవాళ్లు పెరుగుతున్నాయని తెలిపారు. 

Corona Virus: కరోనా ఫోర్త్‌ వేవ్‌తో మనకు ముప్పు లేదు
పోలీసింగ్‌లో నాయకులుగా నిలవాలి

సమాజంలో మహిళలు ముఖ్యపాత్ర పోషి స్తు­న్నారని, గత మూడేళ్లుగా ఎన్‌పీఏ శిక్షణలో­నూ మహిళా అధికారులు సత్తా చాటుతూ టాపర్లుగా నిలిచారని రాష్ట్రపతి చెప్పా­రు. మరో 25 ఏళ్లలో భారతదేశం వందో వార్షికో­త్సవాన్ని జరుపుకోబోతోందని, భ­విష్య‌త్‌ భారత నిర్మాణంలో ఈ యువ అధికారులది కీలక పాత్ర అన్నారు.  

Published date : 28 Dec 2022 05:15PM

Photo Stories