Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 15th కరెంట్ అఫైర్స్
తెలంగాణాకు రెండు జాతీయ అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణలో తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న 'నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్'లో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది. మాతృ మరణాలను పూర్తిగా నివారించాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. డిసెంబర్ 14న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్‌పవార్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాయింట్ డైరెక్టర్ (మెటర్నల్ హెల్త్) డాక్టర్ ఎస్ పద్మజ అవార్డులు అందుకున్నారు.
మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు
దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో ప్రసవసేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలి సారి మిడ్ వైఫరీ వ్యవస్థను తీసుకువచ్చింది. దీని కోసం ఎంపిక చేసిన నర్సులకు అత్యుత్తమ శిక్షణ అందించింది. ఇప్పటి వరకు ఇలా శిక్షణ పొందిన 212 మంది మిడ్ వైఫరీలను ప్రభుత్వం 49 ఆస్పత్రుల్లో నియమించింది. ఇక హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించడం, చికిత్స అందించడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
Cosmic Violence: అరుదైన అంతరిక్ష దృగ్విషయం.. అంత్య దశలో ఉన్న నక్షత్రాన్ని..
Chandrayaan: స్పేస్ ఎక్స్ ‘చంద్రయాన్’లో భారత నటుడు దీప్ జోషి
‘డియర్ మూన్’ పేరుతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు వెళ్లే బృందంలో బాల్‌వీర్ టీవీ షోతో దేశవ్యాప్త క్రేజ్ సాధించిన భారత నటుడు దీప్ జోషి చోటు దక్కించుకున్నారు. చంద్రుని సమీపానికి స్పేస్ ఎక్స్ చేపడుతున్న తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర డియర్ మూన్. దాంట్లో అందుబాటులో ఉన్న టికెట్లన్నింటినీ జపాన్ కుబేరుడు యసాకు మజావా కొనుగోలు చేశారు. తన వెంట పలు రంగాల నుంచి 8 మంది ప్రఖ్యాత కళాకారులను తీసుకెళ్లాలని తొలుత భావించినా చివరికి వారిని ఇంటర్వ్యూల ద్వారా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఏడాదిన్నర పాటు అనేకానేక వడపోతల అనంతరం జోషితో పాటు ప్రఖ్యాత బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ కరీం ఇలియా, అమెరికా నుంచి ప్రముఖ డీజే, నిర్మాత స్టీవ్ అవోకీ, సినీ దర్శకుడు బ్రెండన్ హాల్, యూట్యూబర్ టిమ్ డాడ్, దక్షిణ కొరియాకు చెందిన కె–పాప్ మ్యుజీషియన్ షొయ్ సెయంగ్ హుయాన్ (టాప్) విజేతలుగా నిలిచారు. వీరంతా వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ వెహికిల్‌లో మజావాతో పాటు 8 రోజుల పాటు అంతరిక్షంలో విహరిస్తారు. 3 రోజులు చంద్రుని చుట్టూ తిరుగుతారు. 22 ఏళ్ల జోషి ఈ బృందంలో అత్యంత పిన్న వయస్కుడు.
Bhupendra Patel: గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్
Nuclear Power Plants: కొత్తగా 20 అణు విద్యుత్ కేంద్రాలు
అదనంగా 15వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో 2031 ఏడాదికల్లా దేశంలో కొత్తగా 20 అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయం చెప్పారు. కొత్త వాటిల్లో మొదటి దానిని వచ్చే ఏడాది గుజరాత్‌లోని కాక్రపార్‌లో 700 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతారు. 2024 ఏడాదిలో కల్పకంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ప్రోటోటైప్ ఫాస్ట్‌బ్రీడ్ రియాక్టర్‌ను, 2025లో చెరో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లను కుడంకుళంలో నిర్మిస్తారు. రాజస్తాన్‌లోని రావత్‌భటాలో చెరో 700 మెగావాట్ల సామర్థ్యంతో రెండు, 2027లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో మరో రెండు అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. హరియాణాలోని గోరఖ్‌పూర్‌లో 2029 ఏడాదిలో 700 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు సిద్ధంచేస్తారు. 700 సామర్థ్యంతో మరో పదింటిని వేర్వేరు రాష్ట్రాల్లో అంటే హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో నిర్మిస్తారు.
Supreme Court: సుప్రీంకోర్టులో మరోసారి మహిళా ధర్మాసనం
Servers Hacked: ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ చైనా ముఠాల పనే!
దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) సర్వర్లపై సైబర్ దాడికి పాల్పడింది చైనా, హాంకాంగ్ ముఠాలేనని అనుమానిస్తున్నట్లు అధికార వర్గాలు డిసెంబర్ 14న తెలిపాయి. ఎయిమ్స్ సర్వర్లు నవంబర్ 23న హ్యాకింగ్‌కు గురికావడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. అధికారుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్, స్ట్రాటజిక్ ఆపరేషన్స్(ఐఎఫ్‌ఎస్‌ఓ) విభాగం నవంబర్ 25న ‘సైబర్ టెర్రరిజం’ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో 40 ఫిజికల్, 100 వర్చువల్ సర్వర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని సర్వర్లలో వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. వీటిలోని డేటాను సురక్షితంగా పునరుద్ధరించారు. చైనా, హాంకాంగ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచే సర్వర్లను హ్యాకింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. చైనా సైబర్ నేరగాళ్ల సమాచారం ఇంటర్‌పోల్ ద్వారా సేకరించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Nuclear Fusion Energy: అనంత శక్తిని ఒడిసిపట్టే.. దారి దొరికింది!
CBI: సీబీఐకి ‘నో’ చెప్పిన 9 రాష్ట్రాలు
ముందస్తు అనుమతిలేకుండా తమ రాష్ట్రాల్లో కేసులను దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది రాష్ట్రాలు నిరోధించాయని కేంద్రం డిసెంబర్ 14న వెల్లడించింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, పంజాబ్ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్రసింగ్ సభలో పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంతో బేదాభిప్రాయాలు, ఇతరత్రా ప్రత్యేక కారణాలను చూపుతూ కొన్ని రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతికి నిరాకరించాయి.
ATP Rankings: వరల్డ్ యంగెస్ట్ ఏటీపీ ప్లేయర్‌గా కార్లోస్ అల్కరాజ్
Same Sex Marriage: అమెరికాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం
అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ఉభయ సభల్లో ఇప్పటికే ఆమోదం పొందిన స్వలింగ వివాహాల(గే, లెస్బియన్ మ్యారేజెస్) బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో బిల్లు ఇక చట్టంగా మారింది. ఈ చట్టం సమాజంలో పలు రూపాల్లో ఉన్న ద్వేషాలకు ఒక ఎదురుదెబ్బ అని బైడెన్ అభివర్ణించారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు ఇది చాలా ప్రాధాన్యం అంశమని అన్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేసిన వారికి ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కృతజ్ఞతలు తెలిపారు.
ICC ODI Rankings: డబుల్ సెంచరీతో 117 స్థానాలు ఎగబాకిన ఇషాన్ కిషన్..!
వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచిన యువ సంచలనం ఇషాన్ కిషన్ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో ఏకంగా 117 స్థానాలు ఎగబాకిన కిషన్ 37వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌పైనే సెంచరీ చేసిన కోహ్లి రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. శ్రేయస్ అయ్యర్ 15వ ర్యాంక్‌కు చేరుకోగా, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ 22వ స్థానంలో నిలిచాడు.
ఐసీసీ టాప్-10 వన్డే ర్యాంక్స్‌లో ఉన్నది వీరే..
1.బాబర్ ఆజం (పాకిస్తాన్)-890 రేటింగ్
2.ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్)- 779 రేటింగ్
3.రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా)-766 రేటింగ్
4.క్వింటన్ డికాక్ (దక్షిణాప్రికా)-759 రేటింగ్
5.డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)-747 రేటింగ్
6.స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)- 719 రేటింగ్
7.జానీ బెయిర్‌స్టో(ఇంగ్లండ్)- 710 రేటింగ్
8.విరాట్ కోహ్లి(భారత్)-707 రేటింగ్
9.రోహిత్ శర్మ(భారత్)-705 రేటింగ్
10.కేన్ విలియమ్సన్-700 రేటింగ్
Indian Olympic Association: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష
Sarath Chandra Reddy: ఏసీఏ అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి
మాజీ ఐఏఎస్ రమాకాంత్ రెడ్డి ఎన్నికల అధికారిగా నవంబర్ 18న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఎన్నికలను నిర్వహించారు. ఇందులో ఆరు కీలక పదవుల కోసం ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వీరందరూ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అధ్యక్షుడిగా పి.శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యాక్షుడిగా పి.రోహిత్ రెడ్డి, కార్యదర్శిగా గోపీనాథ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎ.రాకేశ్, కోశాధికారిగా ఎ.వెంకటాచలం, కౌన్సిలర్‌గా కేవీ పురుషోత్తమ రావు ఎన్నికయ్యారు.
➤ నంబర్‌వన్ బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్