Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 8th కరెంట్ అఫైర్స్
Lancet Regional Health: 47 శాతం యాంటీబయోటిక్స్‌కు అనుమతుల్లేవ్
సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతులు లేని యాంటీబయోటిక్స్‌ను సైతం వైద్యులు యాంటీబయోటిక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47 శాతానికి పైగా యాంటీబయోటిక్స్‌కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్‌ఈస్టు ఆసియా’ జర్నల్‌లో ప్రచురించారు.
Also read: Tallest Buildings in World : ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు ఉన్న నగరం ఏమిటో మీకు తెలుసా..?
2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్‌ను 7.6 శాతం మంది, సెఫిక్సైమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను 6.5 శాతం మంది ఉపయోగించినట్లు అధ్యయనంలో తేలింది. ఇదంతా ప్రైవేట్ రంగంలో సాగిందే. ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయోటిక్స్‌ను ఇందులో చేర్చలేదు. అనుమతుల్లేని యాంటీబయోటిక్స్ ఫార్ములేషన్స్‌లో తొలి మూడు స్థానాల్లో సెఫాలోస్పారిన్స్, మాక్రోలైడ్స్, పెన్సిల్సిన్స్ ఉన్నాయి.
Also read: Quiz of The Day (September 08, 2022): భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు?
PM Modi: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలి: మోదీ
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడానికి తాము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రష్యాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సిద్ధంగా ఉన్నామని ఇంధన రంగంలో పరస్పర సహకారానికి అవకాశాలున్నాయని చెప్పారు. రష్యాలోని వ్లాడివోస్తోక్‌లో సెప్టెంబర్ 7 న నిర్వహించిన ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆన్‌లైన్ ద్వారా పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించారు.
also read: Quiz of The Day (September 07, 2022): భారత రాజ్యాంగ తొలి ముసాయిదా ఎప్పుడు తయారైంది?
ఈ సదస్సుకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కూడా హాజరయ్యారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పట్నుంచి చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం జరగాలనే భారత్ గట్టిగా చెబుతోందని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనడానికి తాము మద్దతునిస్తామని చెప్పారు. ప్రపంచమంతా ఒక్కటే కుటుంబంగా మారిపోవడంతో ఎక్కడ ఏం జరిగినా యావత్ ప్రపంచంపై దాని ప్రభావం పడుతోందని మోదీ అన్నారు. దీనికి ఉక్రెయిన్ యుద్ధం, కరోనాయే ఉదాహరణని పేర్కొన్నారు.
also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 7th కరెంట్ అఫైర్స్
PM SHRI Scheme: రూ.27,360 కోట్లతో ‘పీఎం–శ్రీ’
ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం–శ్రీ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 7 న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం–శ్రీ యోజన, పీఎం గతిశక్తికి సంబంధించిన రైల్వే ల్యాండ్ పాలసీ సవరణకు ఆమోదం తెలిపారు. పలు ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళలో రూ.1,957 కోట్లతో కొచ్చీ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో పరస్పరం సహకరించుకోవడానికి వీలుగా భారత్–మాల్దీవుల మధ్య ఇటీవల కుదిరిన అవగాహనా ఒప్పందానికి(ఎంఓయూ) ఆమోదం తెలియజేసింది. విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ఒక దేశంలోని కోర్సులు, విద్యార్హతలను మరో దేశం గుర్తించేలా యూకే–భారత్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించింది. పీఎం–శ్రీ కింద ఐదేళ్లలో రూ.27,360 కోట్లతో దేశవ్యాప్తంగా 14,597 పాఠశాలలను పీఎం–శ్రీ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
also read: Quiz of The Day (September 06, 2022): వివాహం ద్వారా ఏర్పడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు?
35 ఏళ్లకు రైల్వే భూముల లీజు
రైల్వే కొత్త ల్యాండ్ పాలసీ ప్రతిపాదనలో కార్గో, పబ్లిక్ యుటిలిటీ, రైల్వేల ప్రత్యేక వినియోగాల్లో సవరణలు చేశారు. రైల్వే భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే విధానం రాబోయే 90 రోజుల్లో అమలవుతుందని కేంద్ర సమాచార మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ‘‘ఐదేళ్లలో 300 కార్గో టెరి్మనళ్లను అభివృద్ధి చేస్తాం. తద్వారా 1.25 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. కార్గో టెరి్మనళ్లతో సరుకు రవాణాలో రైల్వే వాటా కూడా పెరుగుతుంది’’ అని తెలిపారు. దన్నారు.
also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 6th కరెంట్ అఫైర్స్
ఆధునిక విద్యకు పెద్దపీట
పీఎం–శ్రీ స్కూళ్లలో ఆధునిక విద్యావిధానం అమలు చేస్తారు. స్మార్ట్ తరగతి గదులు, క్రీడలు, సదుపాయాలపై పథకం దృష్టి సారిస్తుంది. వీటిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. దీనికింద రాష్ట్రాలు, స్కూళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంతో 18.7 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని అంచనా.
also read: Weekly Current Affairs (Sports) Bitbank: ఉమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 1వ ఎడిషన్ ఏ సంవత్సరం నాటికి ప్రారంభమవుతుంది?
Tabs for AP Students: 4.72 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు: ఏపీ సీఎం వైఎస్ జగన్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,72,472 మంది విద్యార్థులకు రూ.606.18 కోట్లతో ట్యాబ్‌లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విద్యార్థులకు పాఠాలు బోధించే 50,194 మంది ఉపాధ్యాయులకు సైతం రూ.64.46 కోట్లతో ట్యాబ్‌ల పంపిణీకి పచ్చ జెండా ఊపింది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 3rd కరెంట్ అఫైర్స్
ఇందుకు సుమారు రూ.670.64 కోట్లు ఖర్చవుతుందని అంచనా. నవంబర్‌లో వీటిని విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. మార్కెట్‌లో రూ.16,446 విలువున్న ట్యాబ్‌ను రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.12,843కే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీంతోపాటు రూ.24 వేల విలువైన బైజూస్ కంటెంట్‌ను ఈ ట్యాబ్‌లలో లోడ్ చేసి ఇవ్వనుంది. మొత్తంగా ఒక్కో విద్యార్థికి రూ.36 వేల లబ్ధి కల్పించనుంది. సెప్టెంబర్ 7 న సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు.
Also read: International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?
- ఈ నెల 22వ తేదీన వైఎస్సార్ చేయూత పథకం మూడో విడతలో భాగంగా రాష్ట్రంలోని సుమారు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4,700 కోట్లు మొత్తాన్ని అందజేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ విశాఖ పరిధిలో 96,250 ఇళ్లు, అనకాపల్లిలో 3,750 ఇళ్ల నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతుల మంజూరు
- చేసింది.
- ప్రతి ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు ప్రస్తుతం ఉన్న 3 శాతం రిజర్వేషన్‌ను 4 శాతానికి పెంచడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- అమరావతిలో ఫేజ్ –1లో మౌలిక సదుపాయాల కల్పన పనులకు రూ.1,600 కోట్ల రుణానికి సంబంధించి ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్డీఏ యాక్టు –2104, ఏపీఎంఆర్ అండ్ యూ డీఏ యాక్ట్ – 2016లో సవర ణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also read: సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
APలోని నాడు – నేడు స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’ స్కూళ్లు
విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా తాజాగా కేంద్ర ప్రభుత్వానికీ స్ఫూర్తిదాయకమైంది. నాడు – నేడు తరహాలో అన్ని సదుపాయాలతో ‘పీఎం శ్రీ’ పేరిట కొత్తగా స్కూళ్లను ప్రారంభించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 6 న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లను ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు ప్రాతిపదికన ఐదేళ్లపాటు కొనసాగనున్నాయి.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 6th కరెంట్ అఫైర్స్
TS SERPకు జాతీయ స్థాయిలో గుర్తింపు
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆత్మనిర్భర్ ప్రాజెక్టులో భాగంగా ‘10కే ఎఫ్‌పీవో’(ఎఫ్‌పీవో–ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్) పథకంలో 35 రైతు ఉత్పత్తి దారుల సమాఖ్యలను తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నమోదు చేయించింది. ఈ సమాఖ్యలను కంపెనీల చట్టం ప్రకారం చేర్పించారు. ఇందులో 23,469 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉంటూ తమ వ్యవసాయ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
Also read: Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
తెలంగాణ సెర్ప్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలతో దేశంలోనే అగ్రభాగాన నిలిచినందున కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రం అవార్డును అందుకుంది. సెప్టెంబర్ 7 న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్–ఎన్‌ఆర్‌ఎల్‌ఎం అదనపు కార్యదర్శి, రాష్ట్ర సెర్ప్ సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియాను అభినందిస్తూ ఆయన తరపున ఆ శాఖ ముఖ్య ఆపరేషనల్ అధికారి (సీవోవో) రజితకు మెమొంటోను అందజేశారు.
BWF Singles Women Rankings: జూనియర్ ప్రపంచ నంబర్‌వన్‌గా అనుపమ
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అండర్–19 మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కొత్త నంబర్‌వన్‌గా భారత్‌కు చెందిన అనుపమ ఉపాధ్యాయ అవతరించింది. హరియాణాలోని పంచ్‌కులాకు చెందిన 17 ఏళ్ల అనుపమ ఈ ఏడాది ఉగాండా, పోలాండ్ ఇంటర్నేషనల్ టోర్నీలలో విజేతగా నిలిచింది. టాప్ ర్యాంక్‌లో ఉన్న భారత్‌కే చెందిన తస్నిమ్ మీర్‌ను రెండో స్థానానికి నెట్టి అనుపమ అగ్రస్థానానికి చేరింది.
Also read: Asian Junior and Cadet TT Championship:భారత జోడీకి స్వర్ణం
భారత్‌కే చెందిన అన్వేష గౌడ ఆరో ర్యాంక్‌లో, ఉన్నతి హుడా తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. బెంగళూరులోని ప్రకాశ్ పడుకోన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న అనుపమ జూనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన ఆరో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. గతంలో ఆదిత్య జోషి (2014), సిరిల్ వర్మ (2016), లక్ష్య సేన్ (2017), తస్నిమ్ (2022), శంకర్ సుబ్రమణియన్ (2022) ఈ ఘనత సాధించారు.
Also read: Foxfire: చీకటి పడితే.. జంగిల్ జిగేల్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP