Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 14th కరెంట్ అఫైర్స్
ICC: ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా జై షా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) లో ఎంతో ప్రాధాన్యత ఉన్న, బలమైన ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతానికి జై షా ఎఫ్ అండ్ సీఏలో సభ్యుడిగా మాత్రమే ఉంటారు. మార్చి 2023 నుంచి రాస్ మెకల్లమ్ స్థానంలో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్‌క్లే మరో రెండేళ్లపాటు చైర్మన్‌గా కొనసాగుతారు.
Inspiring Story of Bhaskar Halami : కడు పేదరికం నుంచి ‘అగ్ర’ శాస్త్రవేత్త దాకా... గడ్చిరోలి గిరిజన యువకుని స్ఫూర్తిదాయక గాథ
నాగ్‌పూర్: కటిక పేదరికంలోనూ అకుంఠిత దీక్షతో చదువుపై దృష్టిపెట్టి శాస్త్రవేత్తగా ఎదిగాడు మహారాష్ట్రకు చెందిన ఓ గిరిజన వ్యక్తి. కష్టపడే తత్వంతో ఎలాంటి సమస్యలనైనా దీటుగా ఎదుర్కోవచ్చని చాటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన అతని పేరు భాస్కర్ హలామీ (44). ఆయన కుటుంబం కుర్ఖేదా తహసీల్ పరిధిలోని ఛిర్చాది గ్రామంలో ఉండేది. అక్కడి నుంచి అమెరికాలోని మేరీలాండ్‌లో ప్రఖ్యాత బయోఫార్మా సంస్థ సిర్నావోమిక్స్‌లో సీనియర్ సైంటిస్ట్ (రీసెర్చ్, డెవలప్‌మెంట్) స్థాయికి ఎదిగారు బాస్కర్. ఆ క్రమంలో ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ‘‘మాది నిరుపేద కుటుంబం. ఒక్కపూట భోజనం కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు తలచుకుంటే ఆ కష్టాలన్నీ ఎలా గట్టెక్కామా అని ఆశ్చర్యం వేస్తుంది. చేయటానికి పని ఉండేది కాదు. వర్షాకాలంలో మరీ దారుణం. తింటానికే ఉండేది కాదు. అస్సలు అరగని మహువా పూలను తెచ్చుకుని వండుకుని వాటినే తినేవాళ్లం. కొద్దిగా దొరికే ముడి బియ్యంతో గంజి కాచుకుని తాగేవాళ్లం. మా కుగ్రామంలో 90 శాతం కుటుంబాలది ఇదే దీనావస్థ.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: UK మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి ఎవరు?
మా తల్లిదండ్రులు ఇతరుల ఇళ్లలో పనిచేసేవారు. నాన్నకు ఊరికి 100 కి.మీ. దూరంలో స్కూల్లో వంటమనిషిగా పని దొరికాక అక్కడికి వెళ్లిపోయాం. యవత్మాల్‌లోని విద్యానికేతన్ ప్రభుత్వ పాఠశాలలో పది దాకా చదివా. అమ్మానాన్నలకు చదువు విలువ బాగా తెలుసు. వాళ్లు పస్తులుండి మాకు అన్నం పెట్టారు. ఉన్నదంతా మా చదువుకే ఖర్చు పెట్టేవారు.
Also read: Quiz of The Day (November 12, 2022) : నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు?
గడ్చిరోలీలో సైన్స్‌లో డిగ్రీ చేశాక నాగ్‌పూర్‌లో కెమిస్త్రీలో పీజీ చేశా. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలోనూ పాసయ్యా. కానీ నాకు పరిశోధనపై ఆసక్తి. అందుకే అమెరికా వెళ్లి మిషిగన్ వర్సిటీలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలో పీహెచ్‌డీ చేశా. ఇప్పటికీ ఈ రంగంలో నియామక కంపెనీలు నా సలహాల కోసం కుప్పల కొద్దీ మెయిల్స్ పంపుతుంటాయి. మా సొంతూళ్లో అమ్మా,నాన్నలకు ఇల్లు కట్టిచ్చా’’ అని భాస్కర్ చెప్పుకొచ్చారు. భాస్కర్ స్ఫూర్తిదాయక గాథ అందరికీ తెలిసేలా రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ‘టీ విత్ ట్రైబల్ సెలబ్రిటీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది!
Asian Boxing Championship: రజతంతో శివ థాపా రికార్డు
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 63.5 కేజీల విభాగంలో భారత బాక్సర్ శివ థాపా రజత పతకం సాధించాడు. రుస్లాన్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన ఫైనల్లో థాపా గాయం తో బౌట్ మధ్యలోనే వైదొలిగాడు. తాజా పతకంతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధికంగా ఆరు పతకాలు గెలిచిన బాక్సర్‌గా థాపా చరిత్ర సృష్టించాడు.
Also read: Max Verstappen: వెర్‌స్టాపెన్ సరికొత్త రికార్డు
T20 World Cup: ఇంగ్లండ్ ఖాతాలో రూ. 12 కోట్ల 88 లక్షలు
టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. 2010లో తొలిసారి టైటిల్ సాధించిన ఆ జట్టు పుష్కర కాలం తర్వాత మళ్లీ ట్రోఫీని అందుకుంది. నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు 16 లక్షల డాలర్లు (రూ. 12 కోట్ల 88 లక్షలు)... రన్నరప్ పాకిస్తాన్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 6 కోట్ల 44 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సెమీఫైనల్లో ఓడిన న్యూజిలాండ్, భారత జట్లకు 4 లక్షల డాలర్ల (రూ. 3 కోట్ల 22 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది.
T20 World Cup: వన్డే, టి20 వరల్డ్‌కప్‌లు సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డు
మెల్‌బోర్న్: టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. 2010లో తొలిసారి టైటిల్ సాధించిన ఆ జట్టు పుష్కర కాలం తర్వాత మళ్లీ ట్రోఫీని అందుకుంది. నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. షాన్ మసూద్ (28 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కెపె్టన్ బాబర్ ఆజమ్ (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (3/12) పాక్‌ను పడగొట్టగా... ఆదిల్ రషీద్, జోర్డాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. బెన్ స్టోక్స్ (49 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. 6 మ్యాచ్‌లలో 11.38 సగటు, 6.52 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్యామ్ కరన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలిచాడు.
Also read: నవంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
Tianzhou-5: చైనా కార్గో వ్యోమనౌక ప్రయోగం విజయవంతం
బీజింగ్: చైనా తాను సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి అవసరమయ్యే సామాగ్రిని పంపడం కోసం ప్రయోగించిన కార్గో వ్యోమనౌక టియాన్‌జూ–5 విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. హైనన్ దీవుల్లోని వెన్‌చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోహనౌక నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించిందని జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అంతరిక్ష కేంద్రంలోని డాకింగ్, ఫాస్ట్ ఆటోమేటెడ్ రెండెజవస్ నిర్వహించనుంది. 2022 చివరి నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చైనా ముందడుగు వేస్తోంది.
US military space drone: 908 రోజులకు భూమ్మీదికి...
అంతరిక్షంలో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రయోగాలు చేసి 908 రోజుల తర్వాత అమెరికాలో కెన్నడీ స్పేస్‌సెంటర్‌లో దిగిన అమెరికా ఎక్స్–37బీ సైనిక డ్రోన్. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన స్పేస్ ప్లేన్‌గా కొత్త రికార్డ్ సృష్టించింది. సౌర విద్యుత్‌తో పనిచేసే ఈ డ్రోన్ చిన్నపాటి అంతరిక్ష నౌకలా ఉంటుంది. 2010 నుంచి చాలాసార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చింది. 3,774 రోజులు గడిపింది.
Also read: Chinese Academy of Sciences: ‘పునరుత్పత్తి’ అధ్యయనానికి...అంతరిక్షంలోకి కోతులు
మొత్తం 130 కోట్ల మైళ్ల దూరం పయనించింది!
Asian conference: కిమ్‌కు సమష్టిగా చెక్... అమెరికా, జపాన్, కొరియా నిర్ణయం
నాంఫెన్ (కంబోడియా): వరసగా క్షిపణి పరీక్షలతో కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాను కట్టడి చేయడానికి కలసికట్టుగా పని చేయాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా నిర్ణయించాయి. కంబోడియాలో జరుగుతున్న తూర్పు ఆసియా సదస్సులో జపాన్ ప్రధాని కిషిడా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విడిగా సమావేశమై ఈ మేరకు చర్చించారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్నివిధాలా అండగా ఉండాలని తీర్మానించారు. ఫసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవడంపైనా మూడు దేశాలు చర్చించాయి.
Middle Class: మధ్యతరగతి జన విస్ఫోటం
మధ్య తరగతి జన విస్ఫోటనం. కొంతకాలంగా ప్రపంచమంతటా శరవేగంగా జరుగుతున్న పరిణామమిది! మార్కెట్ల విస్తరణ, ఆదాయ వనరుల పెరుగుదల తదితర కారణాలతో ఏ దేశంలో చూసినా మధ్య తరగతి జనం ఏటా విపరీతంగా పెరుగుతున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రపంచ జనాభాలో 40 శాతం పైగా వాటా మధ్యతరగతిదే. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు నడవడానికి వీరి ఆదాయ వ్యయాలే ఇంధనంగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు!
ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలు కూడా వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో మిడిల్ క్లాస్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది!
ఏటా 14 కోట్ల మంది
ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి జనాభా ఏటా ఏకంగా 14 కోట్ల చొప్పున పెరిగిపోతోందని, ప్రస్తుతం 320 కోట్లుగా ఉందని ప్రపంచ బ్యాకు తాజా నివేదిక వెల్లడించింది. 2030 నాటికి వీరి సంఖ్య 520 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే ప్రపంచ జనాభాలో ఏకంగా 65 శాతానికి చేరనుందన్నమాట! మొత్తం ప్రపంచ ఆదాయంలో మూడో వంతు ఈ మధ్యతరగతి మహాజనుల నుంచే సమకూరుతోందట!
సింహభాగం ఆసియాదే...
ఈ శతాబ్దారంభంలో అమెరికా తదితర సంపన్న యూరప్ దేశాల్లో అధిక సంఖ్యాకులు మధ్యతరగతి వారే ఉండేవారు. క్రమంగా అక్కడ వారి వృద్ధి తగ్గుతూ ఆదియా దేశాల్లో శరవేగగంగా పెరుగుతోంది. వరల్డ్ డేటా లాబ్ అంచనా ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో కొత్తగా రానున్న 100 కోట్ల మంది మధ్యతరగతి జనంలో ఏకంగా 90 శాతం ఆసియాకు చెందినవారే ఉండనున్నారు! భారత్, చైనాతోపాటు ఇండొనేసియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌వంటి ఆసియా దేశాలు మిడిల్ క్లాస్ జనంతో మరింతగా కళకళలాడతాయట. ఆ దేశాల్లో శరవేగంగా సాగుతున్న పట్టణీకరణే అక్కడ మధ్యతరగతి ప్రాబ ల్యానికి తార్కాణం. వీరు చైనాలో 2010 నాటికి జనాభాలో 49 శాతముండగా ఇప్పటికే 56 శాతానికి పెరిగారు. 2035 నాటికి చైనా జనాభాలో ఏకంగా 100 కోట్ల మంది పట్టణవాసులే ఉంటారని అంచనా. భారత్‌లోనూ 2035 నాటికి 67.5 కోట్ల మంది (45 శాతం) పట్టణాల్లో నివసిస్తారట. ఆసియాలో ఈ సంఖ్య 300 కోట్లుగా ఉండనుంది.
Also read: Quiz of The Day (November 14, 2022) : ఇటీవల కులతత్వం బాగా పెరగడానికి కారణం?
దేశ, కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని తేడాలున్నా మొత్తమ్మీద ఒక వ్యక్తి తన అన్ని అవసరాలకు కలిపి రోజుకు దాదాపు రూ.1,000, ఆ పైన వెచి్చంచగలిగితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అతన్ని మధ్యతరగతిగా లెక్కిస్తారు. రూ.5 లక్షల నుంచి 30 లక్షల వార్షికాదాయం ఉన్నవారిని మధ్యతరగతిగా పరిగణిస్తారు.
మన దగ్గర కూడా... మధ్యతరగతి మందహాసమే
భారత్‌లో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు మిడిల్ క్లాస్ జీవులే. 2047 నాటికి వీరి సంఖ్య రెట్టింపై ప్రతి ముగ్గురిలో ఇద్దరు వాళ్లే ఉంటారని పీపుల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియాస్ కన్సూ్యమర్ ఎకానమీ (ప్రైజ్) అంచనా. 2005లో దేశ జనాభాలో కేవలం 14 శాతమున్న మధ్యతరగతి ఇప్పుడు ఏకంగా 31 శాతానికి పెరిగింది. 2035 కల్లా 43.5 శాతానికి వృద్ధి చెందనుంది!
యూఎస్‌లో పాపం మిడిల్‌క్లాస్...
ఒకప్పుడు మధ్యతరగతి ఆదాయ వర్గాల దేశంగా నిలిచిన అమెరికాలో వారి సంఖ్య బాగా తగ్గుతోంది. అక్కడ 35 వేల నుంచి 1.06 లక్షల డాలర్ల వార్షికాదాయముంటే మధ్యతరగతిగా పరిగణిస్తారు. 1971లో దేశ జనాభాలో 61 శాతం మిడిల్ క్లాసే కాగా గతేడాదికి 50 శాతానికి తగ్గిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఇక రష్యా, ఉక్రెయిన్లలో యుద్ధం దెబ్బకు ఒక్క ఈ ఏడాదే ఏకంగా కోటి మంది దాకా మధ్య తరగతి నుంచి దిగువ తరగతికి దిగజారినట్టు ప్యూ నివేదిక వెల్లడించింది.
డి.శ్రీనివాసరెడ్డి
CJI Justice Chandrachud: న్యాయవ్యవస్థలో పురుషాధిక్యత
న్యూఢిల్లీ: భారతీయ న్యాయవ్యవస్థలో తొలినుంచీ పురుషాధిక్యత వేళ్లూనుకొని ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో న్యాయ వృత్తి ఫ్యూడల్, పితృస్వామ్య తరహాతో, మహిళలను సముచిత వాటా కలి్పంచని స్వభావంతో కూడుకున్నదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 12న ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. మహిళలు, సమాజంలోని అణగారిన వర్గాల వారు న్యాయపాలికలోకి మరింత పెద్ద సంఖ్యలో ప్రవేశించాలని అభిప్రాయపడ్డారు. అందుకు వీలుగా మొత్తం న్యాయ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిభాధారితంగా మార్చాల్సిన అవసరం చాలా ఉందంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థకు మానవ వనరులను అందించేందుకు మనకు ఒక నిర్ధారిత వ్యవస్థ ఉంది. దాని నిర్మాణం ఇప్పటికీ ఫ్యూడల్, పితృస్వామ్య పోకడలతోనే నిండి ఉందన్నది వాస్తవం. పురుషాధిక్యత మన న్యాయవ్యవస్థ స్వరూపంలోనే గూడుకట్టుకుపోయింది.
Also read: Supreme Court: మతం మారిన దళితులకు ఎస్సీ హోదాపై అధ్యయనం
సీనియర్ లాయర్లున్న ఏ చాంబర్లోకి వెళ్లినా అక్కడ మొత్తం పురుషులే కనిపిస్తారు. మార్పు అక్కడి నుంచే రావాలి. మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు ఆ చాంబర్లలో చోటు దక్కాలి. అప్పుడు గానీ న్యాయపాలికలో వారి సంఖ్య పెరగదు! మహిళా న్యాయవాదులు, న్యాయమూర్తుల ద్వారానే భవిష్యత్తులో మెరుగైన న్యాయవ్యవస్థను నిర్మించుకోగలం’’ అన్నారు. ‘‘నేడు న్యాయవ్యవస్థ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిలో మొట్టమొదటిది, అతి ముఖ్యమైనది సుప్రీంకోర్టుపై ప్రజలు పెట్టుకున్న ఆశలు. ఎందుకంటే ప్రతి సామాజిక, న్యాయపరమైన అంశమూ, రాజకీయ అంశమూ సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోకి వచ్చేవే’’ అని చెప్పారు.
Also read: Weekly Current Affairs (International) Bitbank: USA కరెన్సీలో కనిపించిన మొదటి ఆసియా అమెరికన్ ఎవరు?
న్యాయమూర్తులకు ఆ నేర్పుండాలి
చట్టం అణచివేతకు సాధనంగా కాక న్యాయమందించే సాధనంగా ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత పాలకులదే తప్ప న్యాయమూర్తులది కాదని స్పష్టం చేశారు. ‘‘మాపై ప్రజలకు ఎన్నో ఆశలు, అంచనాలున్నాయి. కానీ కోర్టుల పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ‘‘చట్టాలు, న్యాయం కొన్నిసార్లు ఒకే సరళరేఖపై వెళ్లకపోవచ్చు. కానీ చట్టాలున్నది అంతిమంగా న్యాయ వితరణకే. వాటిని అణచివేతకు దురి్వనియోగం చేయొద్దు’ అని సీజేఐ అన్నారు. ‘‘దీర్ఘకాలంలో న్యాయవ్యవస్థను నిలబెట్టేది దయా భావన, సహానుభూతితో ప్రజల వేదనను పోగొట్టగలిగిన సామర్థ్యం మాత్రమే. ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క’’ అన్నారు
అమెరికాతో పోలికేల...?
మన సుప్రీంకోర్టును అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల అత్యున్నత న్యాయస్థానాలతో పోల్చడం సరికాదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికా సుప్రీంకోర్టు ఏడాదంతా కలిపి మహా అయితే 180 పై చిలుకు కేసులు పరిష్కరిస్తుంది. బ్రిటన్‌లోనైతే 85 కేసులు దాటవు! కానీ మన సుప్రీంకోర్టులో ప్రతి న్యాయమూర్తీ సోమ, శుక్రవారాల్లో 75 నుంచి 80 కేసుల దాకా ఆలకిస్తారు. మంగళ, బుధ, గురువారాల్లో 30 నుంచి 40 దాకా కేసులు చూస్తారు. మన సుప్రీంకోర్టు విస్తృతి అంత సువిశాలమైనది! మేం పరిష్కరించే చాలా ముఖ్యమైన కేసుల్లో కొన్ని వార్తాపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో కని్పంచకపోవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా పెన్షన్, భరణం వంటి చిన్నాచితకా కేసులనూ విచారించాల్సిందేనా అంటే, అవునన్నదే నా సమాధానం. ఎందుకంటే ప్రజలకు నిజమైన భరోసా కలి్పంచగలిగినప్పుడే న్యాయ వ్యవస్థ
పరిఢవిల్లుతుంది’’ అన్నారు.
Also read: EWS కోటా చెల్లుతుంది... చరిత్రాత్మక తీర్పు వెలువరించిన Supreme Court..
..అందుకే ప్రత్యక్ష ప్రసారాలు
రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాల్లో ఒక్కోసారి పారదర్శకత లేమి పెద్ద ప్రమాదంగా మారుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి అడ్డుకట్ట వేసేందుకే సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారానికి తెర తీసినట్టు చెప్పారు. తద్వారా న్యాయపాలికలో ఏం జరుగుతోందనే పౌరులు తెలుసుకునే అవకాశం దక్కడమే గాక న్యాయవ్యవస్థ మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ‘‘కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలు మేం చేపట్టిన ఓ నూతన ప్రయోగం. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో టెక్నాలజీ ఎంత పాత్ర పోషించగలదో దీని ద్వారా అర్థమైంది. న్యాయం కోసం సామాన్యుడు తొలుత ఆశ్రయించే జిల్లా కోర్టుల విచారణలనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలి’’ అన్నారు.
‘సోషల్’ సవాలుకు తగ్గట్టు అప్‌డేట్ కావాలి
‘‘కోర్టు గదిలో న్యాయమూర్తులు మాట్లాడే ప్రతి చిన్న మాటనూ రియల్ టైంలో రిపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా పెను సవాలుగా విసురుతోంది. న్యాయమూర్తుల పనితీరు నిత్యం మదింపుకు గురవుతోంది’’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘మనమిప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. కనుక న్యాయమూర్తులుగా మనల్ని మనం నిత్యం కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఈ కొత్త తరపు సవాళ్లను ఎదుర్కోవడంలో మన పాత్రపై పునరాలోచించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి’’ అని పిలుపునిచ్చారు.
Also read: Supreme Court: స్థానిక సహకార సంఘాలకు 97వ రాజ్యాంగ సవరణ వర్తించదు
మేము మానసికంగా పక్కా యూత్!
న్యాయమూర్తులు నల్లకోటుతో పాత, రాచరిక కాలపు వస్త్రధారణలో కని్పంచి బోరు కొట్టిస్తుంటారని సీజేఐ అన్నారు. ‘‘మా లుక్స్ జనాలకు బాగా విసుగు పుట్టిస్తాయన్నది నిజమే కావచ్చు. కానీ నిజానికి మానసికంగా మాత్రం మేమంతా నవ యవ్వనంతో ఉరకలేస్తుంటాం’’ అంటూ చమత్కరించారు!
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP