Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 23rd కరెంట్ అఫైర్స్
Indian Navy: భారతదేశ స్వదేశీ విమాన వాహక నౌక IAC `విక్రాంత్` సెప్టెంబరు 2న నౌకాదళంలోకి ప్రవేశించనుంది
మొట్టమొదటిసారిగా దేశీయంగా నిర్మించిన విమానవాహక నౌక(ఐఏసీ)ని సెప్టెంబర్ 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కొచి్చన్ షిప్‌యార్డు లిమిటెడ్(సీఎస్‌ఎల్)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రధాని మోదీ నావికాదళంలోకి విక్రాంత్‌ను అధికారికంగా ప్రవేశపెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రథమ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ రిటైర్డు సిబ్బంది, నౌకా నిర్మాణ, రక్షణ శాఖల అధికారులు మొత్తం 2,000 మంది వరకు పాల్గొంటారని చెప్పారు. రూ.20వేల కోట్లతో నిర్మించిన ఈ నౌకను జూలై 28న సీఎస్‌ఎల్ నేవీకి అప్పగించారు.
Also read: Common Wealth Fencing లో భవానికి స్వర్ణం
Chinese Ship: Sri Lankaను వీడిన చైనా నిఘా నౌక
శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం ఆగష్టు 22న అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు, శాటిలైట్ ట్రాకింగ్ సామర్థ్యం కలిగిన యువాన్ వాంగ్ 5 రాకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ నౌక హంబన్‌టోటకు ఆగష్టు 11వ తేదీనే రావాల్సి ఉంది. భారత్ భద్రతాపరమైన ఆందోళనల నడుమ శ్రీలంక అధికారులు అనుమతులను వెంటనే ఇవ్వలేదు. చైనా నిర్వహణలో ఉన్న హంబన్‌టోటకు ఆగష్టు 16వ తేదీన చేరుకుని ఇంధనం నింపుకునే కారణంతో ఆగష్టు 22 వరకు అక్కడే లంగరేసింది. యువాన్ వాంగ్ 5 ఆగష్టు 22న సాయంత్రం 4 గంటలకు చైనాలోని జియాంగ్ యిన్ పోర్టు దిశగా తిరిగి బయలుదేరి వెళ్లిపోయిందని హార్బర్ అధికారులు వెల్లడించారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం పోర్టులో ఉన్న సమయంలో నౌకలోని సిబ్బందిని మార్చలేదని వివరించారు. తమ ప్రాదేశిక జలాల్లో ఉన్న సమయంలో ఈ నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థ స్విఛాన్ చేసి ఉంటుందని, ఎటువంటి పరిశోధనలు జరపరాదనే షరతులతోనే అనుమతులు ఇచ్చినట్లు శ్రీలంక ముందుగానే ప్రకటించింది.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: UAE ప్రభుత్వంచే "గోల్డెన్ వీసా" పొందిన నటులు ఎవరు?
MIRI: అరుదైన కార్ట్‌వీల్ గెలాక్సీ
భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల పై చిలుకు దూరంలో ఉన్న కార్ట్‌వీల్ గెలాక్సీని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరా కంటిలో బంధించింది. దాని కేంద్రకం వద్ద ఉన్న భారీ కృష్ణబిలం కూడా వెబ్ కెమెరాకు చిక్కింది. ఈ గెలాక్సీని నిత్యం నక్షత్ర ధూళి భారీ పరిమాణంలో ఆవరించి ఉంటుందట. దాంతో హబుల్ వంటి కాకలు తీరిన టెలిస్కోప్‌లు ఎంతగా ప్రయత్నించినా ఇప్పటిదాకా దీన్ని ఫొటోలు తీయలేకపోయాయి. అందుకే ఈ గెలాక్సీ కంటపడటాన్ని చాలా అరుదైన విషయంగా నాసా సైంటిస్టులు అభివరి్ణస్తున్నారు. కోట్లాది ఏళ్లలో కార్ట్‌వీల్ గెలాక్సీ ఎలాంటి మార్పుచేర్పులకు గురవుతూ వచ్చింది. తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ తీసిన ఇన్‌ఫ్రా రెడ్ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. దాని కేంద్ర స్థానం వద్ద ఏర్పడ్డ కృష్ణబిలం గురించి కూడా విలువైన సమాచారం తెలిసే వీలుందట. అంతేగాక నక్షత్రాల పుట్టుకకు సంబంధించి ఇప్పటిదాకా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి రావచ్చన్నది సైంటిస్టుల మాట.
Also read: ISRO : సూర్యుడిపై ఇస్రో కన్ను.. ‘ఆదిత్య ఎల్1’ ప్రయోగం కోసం..
అచ్చం బండి చక్రంలా...
వయసు మీదపడుతున్న హబుల్ టెలిస్కోప్‌కు వారసునిగా జేమ్స్ వెబ్ ఇటీవలే అంతరిక్ష ప్రవేశం చేసారు. కాలంలో వెనక్కు చూడగల ఇన్‌ఫ్రా రెడ్ సామర్థ్యం దీని సొంతం. దాని సాయంతో మహావిస్ఫోటనం (బిగ్‌బ్యాంగ్) అనంతరం విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లకు సంబంధించిన ఫొటోను ఇటీవలే జేమ్స్ వెబ్ మనకు అందించారు. అదే మాదిరిగా కార్ట్‌వీల్ గెలాక్సీకి సంబంధించి కూడా దాని ఇప్పటి, సుదూర, సమీప గతాలకు సంబంధించిన ఫొటోలనూ జేమ్స్ వెబ్ స్పష్టంగా అందించగలిగింది. ఈ ఫొటోల్లో కార్ట్‌వీల్ గెలాక్సీ పేరుకు తగ్గట్టుగా అచ్చం బండి చక్రం మాదిరిగానే కన్పిస్తోంది. స్కల్ప్టర్ నక్షత్ర మండలంలోని ఈ గెలాక్సీతో పాటు మరెన్నో ఇతర పాలపుంతలు కూడా నేపథ్యంలో కనిపిస్తుండటం విశేషం. ఒక అతి పెద్ద, మరో బుల్లి గెలాక్సీ ఊహాతీతమైన వేగంతో ఢీకొనడం వల్ల కార్ట్‌వీల్ గెలాక్సీ పురుడు పోసుకుందని సైంటిస్టులు సిద్ధాంతీకరించారు. కానీ దీని ఉనికి చాలాకాలం పాటు మిస్టరీగానే ఉండిపోయింది. అంతరిక్ష ధూళి తదితరాల గుండా సులువుగా పయనించగల పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పట్టుకోగలదు. దాని సాయంతోనే ఎట్టకేలకు అది కార్ట్‌వీల్ ఉనికిని నిర్ధారించి కెమెరాలో బంధించగలిగింది. ఫొటోలో కన్పిస్తున్న నీలి రంగు చుక్కలన్నీ నక్షత్రాలు. కోట్లాది ఏళ్ల కాలక్రమంలో చోటుచేసుకున్న భారీ విస్ఫోటాలు తదితరాల వల్ల కార్ట్‌వీల్ గెలాక్సీలో చోటుచేసుకుంటూ వచ్చిన కీలక మార్పులను ఈ ఫొటోల సాయంతో విశ్లేషించవచ్చు. ఈ గెలాక్సీ చుట్టూ రెండు వెలుతురు మండలాలున్నాయి. కేంద్ర స్థానంలో సంభవించిన మహా విస్ఫోటం ఫలితంగా చెరువులో అలల్లా ఇవి నానాటికీ విస్తరిస్తూ పోతున్నాయట. అందుకే అంతరిక్ష శాస్త్రవేత్తలు దీన్ని రింగ్ గెలాక్సీ అని కూడా పిలుస్తుంటారు. ఇలాంటి ఆకృతులుండే పాలపుంతలు అరుదు. దీనిలోని అంతరిక్ష ధూళికి సంబంధించి లోతైన విషయాలను జేమ్స్ వెబ్ తాలూకు మిడ్ ఇన్‌ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్ (ఎంఐఆర్‌ఐ) సాయంతో విశ్లేషించే పనిలో పడింది నాసా.
Also read: Quiz of The Day (August 22, 2022): గంగానది ప్రక్షాళనకు నిరాహార దీక్ష చేసి ఆ సందర్భంలోనే మరణించిన వారు ఎవరు?
Vande Bharat Trains: అధునాతన సాంకేతికతతో వందేభారత్ రైళ్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వందేభారత్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రూపొందించిన వందేభారత్ రైళ్లకు ఇటీవల భద్రతా తనిఖీలను నిర్వహించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. దక్షిణమధ్య రైల్వేలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. మొదట హైదరాబాద్ నుంచి ముంబై, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం మార్గాల్లో వందేభారత్ రైళ్లను నడిపే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం దశలవారీగా సికింద్రాబాద్–షిరిడీ, సికింద్రాబాద్–బెంగళూరు మార్గాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తుండగా వందేభారత్ రైళ్లు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ–వారణాసి మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు 145 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. కాగా, కొత్తగా రానున్న రైళ్ల వేగాన్ని మరో 15 కిలోమీటర్లు అదనంగా పెంచారు.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ మెదడు దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
వందేభారత్ ప్రత్యేకతలివే..
- గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
- ఈ రైళ్లలో ఎమర్జెన్సీ లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 లైట్లు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా ఇబ్బంది లేకుండా ఈ లైట్లు ఉపయోగపడతాయి.
- కోచ్‌లకు బయటవైపు నుంచి 4 కెమెరాలు ఉంటాయి. వెనుక వైపు నుంచి మరొకటి ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 అత్యవసర ద్వారాలు ఉంటాయి. కోచ్‌లు పూర్తిగా ఏసీ సదుపాయం కలిగి ఉంటాయి. అత్యుత్తమ కోచ్ కంట్రోల్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
- ప్రతి కోచ్‌లో 32 ఇంచ్‌ల స్క్రీన్‌తో ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఉంటుంది. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటుచేసిన అగ్నిమాపక పరికరాలు కొద్దిపాటి పొగను కూడా వెంటనే పసిగట్టి ప్రయాణికులను అప్రమత్తం చేస్తాయి. వరదలను సైతం తట్టుకొనేవిధంగా వీటిని రూపొందించారు.
- ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢీకొనకుండా అరికట్టే కవచ్ వ్యవస్థతో ఈ రైళ్లను అనుసంధానం చేశారు. ఈ రైళ్లలో అంధుల కోసం ప్రత్యేక సీట్లు ఉంటాయి.
Also read: 75th Year of Independence Day of India: జెండా ఊంచా రహే హమారా!
Andhra Pradesh: వృద్ధి రేటులో అగ్రస్థానంలో ఏపీ
రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముగిసిన ఆర్ధిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ 2021–22లో స్థిర ధరల ప్రకారం 11.43 శాతం వృద్ధి రేటు సాధించినట్లు తెలిపింది. తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకన్నా ఏపీ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కోవిడ్–19 సంక్షోభం, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, దేశంలో 2020–21 సంవత్సరంలో వృద్ధి రేటు తిరోగమనంలో ఉన్న విషయం తెలిసిందే. కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడి, గత ఏడాదిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2021–22లో ఏపీ ఏకంగా 11.43 శాతం రెండంకెల వృద్ధి సాధించింది.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ICC క్రికెట్ కమిటీకి ఏ భారత మాజీ క్రికెటర్‌ని నియమించారు?
ఇదే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వృద్ధి రేటు కేవలం 8.7 శాతమే. ఏపీ తరువాత అత్యధిక వృద్ధి రాజస్థాన్ 11.04 శాతం సాధించింది. ఆ తరువాత బీహార్ 10.98 శాతం, తెలంగాణ 10.88 శాతం వృద్ధి సాధించాయి.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: వివా ఎంగేజ్ యాప్‌ను ప్రారంభించిన కంపెనీ ఏది?
NASA:మన సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహం..
మన సౌరవ్యవస్థలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి ఆనుపానులను పట్టిస్తున్న అత్యంత స్పష్టమైన ఫొటో ఇది. దీన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవల తీసింది. బృహస్పతి తాలూకు వలయాలు, ధ్రువ కాంతులు ఇంత స్పష్టంగా కెమెరాకు చిక్కడం ఇదే తొలిసారి. అంతేగాక దాని తాలూకు బుల్లి ఉపగ్రహాలు, పాలపుంతలు కూడా నేపథ్యంలో కనువిందు చేస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో వస్తాయని అస్సలు అనుకోలేదని నాసా సైంటిస్టులు సంబరపడిపోతున్నారు. ఫొటోలోని వివరాలన్నీ స్పష్టంగా కని్పంచేందుకు దాన్ని డిజిటల్‌గా మెరుగు పరచడంతో పాటు కృత్రిమంగా రంగులద్దారు.
Also read: Most Distant Star ఎరెండల్
FTX Crypto Cup: రన్నరప్‌గా భారత యువ గ్రాండ్‌మాస్టర్ R.Praggnanandhaa
ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)ను కంగు తినిపించినప్పటికీ ప్రజ్ఞానంద ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు 4–2తో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ICC క్రికెట్ కమిటీకి ఏ భారత మాజీ క్రికెటర్‌ని నియమించారు?
5G services: 4జీ చార్జీలకే 5జీ సేవలు!
స్పెక్ట్రం అందుకున్న కంపెనీలు ఒకవైపు.. 5జీ హ్యాండ్‌సెట్స్‌తో 5 కోట్ల మంది కస్టమర్లు మరోవైపు. టెలికం కంపెనీల నుంచి అందుతున్న సమాచారం మేరకు 4జీ రేటుకే 5జీ సేవలను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also read: 5G Services : ఎయిర్ టెల్, జియో పోటా పోటీ
ఆరు నెలల తర్వాతే..
ముందుగా 4జీ టారిఫ్‌లోనే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా అందించే అవకాశం ఉందని దిగ్గజ టెలికం కంపెనీ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘కొత్త టెక్నాలజీపట్ల కస్టమర్ అనుభూతి చెందాలి. 5జీ ప్రయోజనాలు అందుకోవాలి. అంత వరకు రేట్ల సవరణ ఉండకపోవచ్చు. ఆరు నెలల తర్వాతే క్రమంగా కొత్త చార్జీలు అమలులోకి వచ్చే చాన్స్ ఉంది. నెట్‌వర్క్ స్లైసింగ్ విధానంలో ఒక్కో వినియోగదారుడు కోరుకున్న వేగాన్ని 5జీలో అందించే వీలుంది. నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ కారణంగా అటు 4జీ సేవల నాణ్యతా పెరుగుతుంది’ అని వివరించారు. 2022 మే 31 నాటికి దేశవ్యాప్తంగా 79.47 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదార్లు ఉన్నారు. వీరిలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 76.55 కోట్లు. సగటున ఒక్కో కస్టమర్ నుంచి టెలికం కంపెనీకి సమకూరుతున్న ఆదాయం రూ.200లోపే ఉంటోంది. దీనిని రూ.300–350కి చేర్చాలన్నది కంపెనీల లక్ష్యం. 2021 నవంబర్–డిసెంబర్‌లో చార్జీలు 20–25 శాతం పెరిగాయి.
Also read: 5G Services : ఎయిర్ టెల్, జియో పోటా పోటీ
కంపెనీలకు స్పెక్ట్రం భారం..
టెలికం కంపెనీలు 5జీ స్పెక్ట్రం కోసం భారీగానే ఖర్చు చేశాయి. రిలయన్స్ జియో ఏకంగా రూ.88,078 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఒక్క 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 10 మెగాహెట్జ్ స్పెక్ట్రం కోసం జియో ఏకంగా రూ.40,000 కోట్లు ఖర్చు చేసిందంటే ఆశ్చర్యం వేయకమానదు. 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో కవరేజ్ మెరుగ్గా ఉంటుందని జియో అంటోంది. 5జీ సేవల్లో భాగంగా మూడు ప్రైవేట్ టెలికం సంస్థలు నెట్‌వర్క్ అప్‌గ్రేడ్, విస్తరణకు అయిదేళ్లలో రూ.1.43–1.59 లక్షల కోట్లు వెచి్చంచే అవకాశం ఉందని ఓ కన్సలి్టంగ్ కంపెనీ వెల్లడించింది. భారీగా ఖర్చులు ఉన్నందున ప్యాక్‌ల చార్జీలు పెంచక తప్పదు. అది కూడా ఆచితూచి వ్యవహరించాలన్నది కంపెనీల భావన.
Also read: Government e - Marketplace లోకి సహకార సంఘాలు
రెండేళ్లలో 15 కోట్లు..
ప్రస్తుతం దేశంలో 5 కోట్ల మంది వద్ద 5జీ హ్యాండ్‌సెట్స్ ఉన్నాయి. రెండేళ్లలో ఈ సంఖ్యను 15 కోట్లకు చేర్చాలన్నది టెలికం కంపెనీల లక్ష్యం. ఇందుకు అనుగుణంగా మొబైల్స్ తయారీ సంస్థలతో కలిసి బండిల్ ఆఫర్లను టెలికం సంస్థలు ప్రవేశపెట్టనున్నాయి. జియో రాకతో ఒక్కసారిగా దేశంలో 4జీ విప్లవం వచ్చింది.
Also read: GST Council Meet : రాష్ట్రానికో జీ20 టీమ్
Flipkart గ్రోసరీ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ప్రారంభం
ఈ – కామర్స్ మార్కెట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి గ్రోసరీ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఏర్పాటు చేసిన ఈ నూతన ఫెసిలిటీని ఆగష్టు 22న ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రారంభంతో ఫ్లిప్‌కార్ట్ సరఫరా చైన్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించింది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి కలగడంతో పాటు వేలాది మంది స్థానిక విక్రేతలు, ఎంఎస్‌ఎంఈలు, చిన్న రైతులకు మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. ఈ ఫెసిలిటీతో రాబోయే ప్రతిస్టాత్మక ఫ్లిప్‌కార్ట్ కార్యక్రమం బిగ్ బిలియన్ డేస్ 2022లో రోజుకు 4 వేల గ్రోసరీ ఆర్డర్లును నిర్వహించగలదు.
Also read: Digital Payments : భారతీయ యూజర్లు 34.6 కోట్లు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP