Government e - Marketplace లోకి సహకార సంఘాలు
జెమ్ (Government e - Marketplace (GEM)) పోర్టల్‌లో సంస్థల నమోదు ప్రక్రియను మంత్రి వర్చువల్‌గా ఆగస్టు 9న ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అమూల్, ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్, సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంకు తదితర సంస్థలు కొనుగోలుదారులుగా జెమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయని చెబుతూ.. విక్రేతలుగానూ నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. కోఆపరేటివ్ సొసైటీలు సైతం జెమ్ ద్వారా తమకు కావాల్సిన వస్తు, సేవలను కొనుగోలు చేసుకునేందుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది జూన్‌లో అనుమతించింది. అంతకుముందు ఈ అవకాశం లేదు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
తొలిదశలో రూ.100 కోట్ల టర్నోవర్/డిపాజిట్లు ఉన్న సొసైటీలను అనుమతించారు. దీంతో 589 సంస్థలకు అర్హత ఉందని గుర్తించగా, 300కు పైన ఇప్పటివరకు నమోదు చేసుకున్నాయి. మంత్రి ప్రారంభంతో.. మొదటి రోజే సుమారు రూ.25 కోట్ల విలువైన ఆర్డర్లు నమోదైనట్టు అంచనా.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?
దేశవ్యాప్తంగా 8.5 లక్షల సహకార సంఘాలు ఉంటే, వీటి పరిధిలో 29 కోట్ల మంది భాగస్వాములుగా ఉన్నారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP