Daily Current Affairs in Telugu: ఏప్రిల్ 8, 2023 కరెంట్ అఫైర్స్
National Panchayat Awards: తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు
జాతీయస్థాయి పురస్కారాల్లో తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్‌కు సంబంధించి 8 పురస్కారాలతోపాటు నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్‌కు సంబంధించి 5 పురస్కారాలు సాధించి రాష్ట్రం సత్తా చాటింది. దీన్‌దయాళ్ పురస్కారాల్లో 9 కేటగిరీల్లోని 27 అవార్డులకుగాను 8 అవార్డులు సాధించి రాష్ట్రాలవారీగా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో నాలుగు పంచాయతీలు తొలి ర్యాంకు సాధించగా మరో రెండు పంచాయతీలు రెండో ర్యాంకు, ఇంకో రెండు పంచాయతీలు మూడో స్థానంలో నిలిచాయి.
అలాగే నానాజీ పురస్కారాల్లో 7 కేటగిరీలకుగాను ఐదు (వాటిలో ఒకటి ప్రథమ స్థానం) అవార్డులు లభించాయి. తెలంగాణ వివిధ కేటగిరీల్లో పురస్కారాలకు ఎంపికైన విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ బిజయకుమార్ బెహరా ఓ లేఖ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి తెలియజేశారు. ఈ నెల 17న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగే ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్సెంటివైజేషన్ ఆఫ్ పంచాయత్స్ కమ్ అవార్డ్ సెర్మనీ’లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
Secunderabad To Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్–తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..
దక్షిణమధ్య రైల్వేకు తక్కువ సమయంలోనే రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌గా అందుబాటులోకి వస్తున్న సికింద్రాబాద్–తిరుపతి సర్వీసును ప్రధాని మోదీ ఏప్రిల్ 8న ఉదయం 11:45 గంటలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీసు ఏప్రిల్ 9న మధ్యాహ్నం 3:15 గంటలకు తిరుపతి నుంచి మొదలు కానుంది. సికింద్రాబాద్–తిరుపతి ఏసీ చైర్‌కార్ ధరను రూ.1,680గా ఖరారు చేయగా ఎగ్జిక్యూటివ్ కోచ్‌లోని ఏసీ చైర్‌కార్ ధరను రూ.3,080 (కేటరింగ్ చార్జీలు కలుపుకొని)గా నిర్ణయించారు. అలాగే తిరుపతి–సికింద్రాబాద్ వందేభారత్ రైల్లో ఏసీ చైర్‌కార్ ధర రూ.1,625గా ఉండగా ఎగ్జిక్యూటివ్ కోచ్‌లోని ఏసీ చైర్‌కార్ ధర రూ.3,030గా ఉంది. తిరుపతికి వెళ్లే ఇతర ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే ఈ రైల్లో టికెట్ ధరలు అధికంగా నిర్ణయించడంతో ప్రస్తుతానికి 8 కోచ్‌లనే ఏర్పాటు చేశారు. డిమాండ్ ఎలా ఉంటుందో స్పష్టత వచ్చే వరకు తక్కువ కోచ్‌లతోనే నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Assembly Elections: దేశంలో తొలిసారి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం.. ఎవరెవరికంటే?
E-Schools: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఈ–పాఠశాల’..
ఇప్పటికే బైజూస్ ద్వారా స్మార్ట్ ఫోనుల్లో, ట్యాబుల్లో ఈ–కంటెంట్ అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి ఈ–పాఠశాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ను అందించనుంది. ఇందుకోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకంగా ఈ–పాఠశాల యాప్‌ను రూపొందిస్తోంది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, కింది తరగతుల్లో స్మార్ట్ టీవీల ద్వారా ప్రభుత్వం డిజిటల్ విద్యాబోధన అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తరగతులకు అవసరమైన ఈ–కంటెంట్‌ను పూర్తి స్థాయిలో రూపొందించడానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా 4వ తరగతి నుంచి ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది.
Family Doctor: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రారంభం.. ఫ్యామిలీ డాక్టర్ విధానం లక్ష్యమిదే..
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా..
లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్.. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ–కంటెంట్‌ను రూపొందించే పనిలో ఎస్‌సీఈఆర్‌టీ నిమగ్నమైంది. ప్రస్తుతం 4వ తరగతి నుంచి నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులకు బైజూస్ సంస్థ ద్వారా కంటెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఎస్‌సీఈఆర్‌టీ అదే తరహాలో ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులకు మాత్రమే కాకుండా లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో కూడా రూపొందిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
IT industry: ఐటీలో నియామకాలకు 6 నెలలు బ్రేక్..
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆరు నెలల పాటు హైరింగ్‌కు కాస్త విరామం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలను చూస్తే ప్రతి త్రైమాసికంలోనూ నికర నియామకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయని, రాబోయే రోజుల్లోనూ కొన్నాళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతక్రితం ఏడాది జోరుగా రిక్రూట్ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం డిమాండ్ మాత్రమే కీలకాంశంగా మారిందని పేర్కొన్నాయి. మూడో త్రైమాసికంలోనే నియామకాలు తక్కువ స్థాయిలో ఉండగా.. నాలుగో త్రైమాసికంలోనూ దాదాపు అదే రకమైన ట్రెండ్ నెలకొందని టీమ్‌లీజ్ డిజిటల్ వర్గాలు వివరించాయి. చాలామటుకు కంపెనీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయని పేర్కొన్నాయి. ఎక్స్‌ఫెనో జాబ్ రిపోర్ట్ ప్రకారం మార్చి త్రైమాసికంలో ఉద్యోగావకాశాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56 శాతం క్షీణించాయి. మరికొద్ది రోజుల్లో కంపెనీలు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడం మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
IT: లక్షలకు లక్షల ఉద్యోగాలు తొలగింత... ఐటీ అంటేనే భయపడుతున్న ఉద్యోగులు
Shah Rukh Khan: టైమ్ 100 అగ్రస్థానంలో బాలీవుడ్ బాద్‌షా
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(57)కు అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజీన్ 2023 సంవత్సరానికి నిర్వహించిన ప్రభావశీల వ్యక్తుల జాబితా 100లో అత్యధిక ఓట్లతో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ, ప్రిన్స్ హ్యారీ–మేఘన్ దంపతులు, ఆస్కార్ విజేత మిచెల్ యియోహ్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌లకు మించి ఆయనకు ఓట్లు పడ్డాయని టైమ్ మ్యాగజీన్ తెలిపింది. ఈ ఏడాది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో అర్హులుగా ఎవరుండాలని అను కుంటున్నారన్న ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్పందించారని పేర్కొంది. మొత్తం 12 లక్షల ఓట్లలో ‘పఠాన్’స్టార్‌కు 4%పైగా ఓట్లు పోలయ్యాయని వెల్లడించింది. ఈ నెల 13న తమ ఎడిటర్స్ టాప్ 100 జాబితాపై అభిప్రాయాలను వెల్లడించాక అంతిమ ఫలితాన్ని ప్రకటిస్తామని తెలిపింది. టాప్ 100 రెండో స్థానంలో కఠిన ఇస్లామిక్ పాలన నుంచి స్వేచ్ఛ కావాలని ఉద్యమిస్తున్న ఇరాన్ మహిళలకు 3 శాతం ఓట్లు పోలయ్యాయి. టైమ్ 2022 జాబితాలోనూ హీరోస్ ఆఫ్ ది ఇయర్‌ను ఇరాన్ మహిళలే గెలుచుకోవడం గమనార్హం.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
ఆ తర్వాత బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు 1.9% ఓట్లతో వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. గత ఏడాది ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనాకు చారిత్రక విజయం సాధించి పెట్టిన లియోనల్ మెస్సీ 1.8% ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ప్రముఖుల్లో ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ నటి విజేత యియోహ్, టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్, జుకర్‌బర్గ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా ఉన్నారని టైమ్ మేగజీన్ తెలిపింది.
Christina Koch: చంద్రుడిపైకి వెళ్లనున్న తొలి మహిళ క్రిస్టినా కోచ్.. ఎవరీమె..?