National Panchayat Awards: తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు
దీన్‌దయాళ్ పురస్కారాల్లో 9 కేటగిరీల్లోని 27 అవార్డులకుగాను 8 అవార్డులు సాధించి రాష్ట్రాలవారీగా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో నాలుగు పంచాయతీలు తొలి ర్యాంకు సాధించగా మరో రెండు పంచాయతీలు రెండో ర్యాంకు, ఇంకో రెండు పంచాయతీలు మూడో స్థానంలో నిలిచాయి.
అలాగే నానాజీ పురస్కారాల్లో 7 కేటగిరీలకుగాను ఐదు (వాటిలో ఒకటి ప్రథమ స్థానం) అవార్డులు లభించాయి. తెలంగాణ వివిధ కేటగిరీల్లో పురస్కారాలకు ఎంపికైన విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ బిజయకుమార్ బెహరా ఓ లేఖ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి తెలియజేశారు. ఈ నెల 17న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగే ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్సెంటివైజేషన్ ఆఫ్ పంచాయత్స్ కమ్ అవార్డ్ సెర్మనీ’లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
మార్కుల ఆధారంగా ర్యాంకులు..
ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు ప్రోత్సాహకంగా అవార్డులు అందిస్తోంది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా, ఆన్‌లైన్‌లో పంచాయతీల ద్వారా నామినేషన్‌లను తీసుకొని 9 అంశాల్లో (థీమ్‌లలో) ఉత్తమ గ్రామ పంచాయతీలకు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉత్తమ అవార్డులు ప్రకటిస్తోంది. అయితే ఈ ఏడాది నుంచి అవార్డులను 9 అంశాల్లో ఏ పంచాయతీలు ప్రగతిని సాధించాయో వాటికి మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా అవార్డులు ఇస్తోంది. ఇందులో ప్రతి అంశానికి వంద మార్కులకు సూచికలను ప్రకటించింది. ఈ తొమ్మిది అంశాల్లో ప్రతి పంచాయతీ సాధించిన మార్కుల ఆధారంగా దేశంలో ఉత్తమ పంచాయతీలను ప్రకటిస్తోంది.
నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023
☛ ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీ: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి (సెకండ్ ర్యాంకు)
☛ ఉత్తమ జిల్లా పంచాయతీలు: ములుగు జిల్లా (సెకండ్ ర్యాంకు)
☛ గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె. (థర్డ్ ర్యాంకు).
☛ కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా (సెకండ్ ర్యాంకు)
☛ గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ–నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్–సర్టిఫికెట్): సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి (ఫస్ట్ ర్యాంకు)
New Secretariat: ఏప్రిల్ 30న నూతన సచివాలయం ప్రారంభం..
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023
☛ఆరోగ్యవంతమైన పంచాయతీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్ (ఫస్ట్ ర్యాంకు)
☛ తాగునీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల (ఫస్ట్ ర్యాంకు)
☛ సామాజిక భద్రతగల పంచాయతీ: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్‌పల్లి (ఫస్ట్ ర్యాంకు)
☛ స్నేహపూర్వక మహిళా పంచాయతీ: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు (ఫస్ట్ ర్యాంకు)
☛ పేదరికరహిత, జీవనోపాధి పెంచిన పంచాయతీ: గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం (సెకండ్ ర్యాంకు)
☛ సుపరిపాలనగల పంచాయతీ: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చీమల్‌దారి (సెకండ్ ర్యాంకు)
☛ క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ: పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్‌పూర్ (థర్డ్ ర్యాంకు)
☛ స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలుగల పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్‌రావుపేట మండలం గంభీర్‌రావుపేట (థర్డ్ ర్యాంకు)