Daily Current Affairs in Telugu: ఏప్రిల్ 7, 2023 కరెంట్ అఫైర్స్
RBI: ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం.. ఎక్కడి రేట్లు అక్కడే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు – రెపోను యథాతథంగా 6.5 శాతం వద్దే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రేటు పెంపు నిలుపుదల చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, గతేడాది మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వరుసగా ఆరవసారి పెంపుతో అప్పటి నుంచి 2.5% రెపో రేటు పెరిగినట్లయ్యింది.
వృద్ధి 6.5 శాతానికి పెంపు
2023–24లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదవుతుందని ఆర్‌బీఐ తాజాగా అంచనావేసింది. ఫిబ్రవరిలో వేసిన 6.4 శాతం రేటు అంచనాల తాజా పెంపు సానుకూల పరిణామం. క్యూ1లో 7.8%, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 6.1 శాతం, క్యూ4లో 5.9 శాతం వృద్ధి నమోదు అంచనా. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
FIFA Rankings: ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా అర్జెంటీనా
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా జట్టు ఆరేళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఇటీవల పనామా, కురాసావ్ జట్లతో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా గెలుపొందడంతో మెస్సీ బృందం రెండో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది. గత ఏడాది ఖతర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత జగజ్జేతగా నిలిచింది. మొరాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బ్రెజిల్ ఓడిపోవడంతో ఆ జట్టు నంబర్‌వన్ ర్యాంక్ నుంచి రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌కు చేరుకుంది. మూడో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ రెండో స్థానానికి ఎగబాకింది. బెల్జియం నాలుగో ర్యాంక్‌లో, ఇంగ్లండ్ ఐదో ర్యాంక్‌లో ఉన్నాయి.
ATP Rankings: ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
భారత్‌కు 101వ ర్యాంక్..
గురువారం విడుదల చేసిన ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఐదు స్థానాలు పురోగతి సాధించి 101వ ర్యాంక్‌కు చేరుకుంది. స్వదేశంలో జరిగిన మూడు దేశాల టోర్నీలో కిర్గిజ్ రిపబ్లిక్, మయాన్మార్ జట్లపై గెలిచి విజేతగా నిలవడంతో ర్యాంకింగ్స్‌లో భారత్ ఎగబాకింది. 1994లో భారత్ అత్యుత్తమంగా 94వ ర్యాంక్‌లో నిలిచింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
Orleans Masters: ప్రపంచ 12వ ర్యాంకర్‌పై ప్రియాన్షు విజయం
ఓర్లియాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువతార ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రియాన్షు ప్రపంచ 12వ ర్యాంకర్, టాప్ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)పై గెలుపొందాడు. గతవారం స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన నిషిమోటోతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 58వ ర్యాంకర్ ప్రియాన్షు 21–8, 21–16తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
థామస్ కప్ టైటిల్ సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రియాన్షు ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో 10–0తో ఆధిక్యంలోకి వెళ్లడం విశేషం. రెండో గేమ్‌లో ప్రియాన్షుకు పోటీ ఎదురైనా కీలకదశలో పాయింట్లు గెలిచి 42 నిమిషాల్లో విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చి యు జెన్ (చైనీస్ తైపీ)తో ప్రియాన్షు తలపడతాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
UN Statistical Commission: ఐరాస స్టాటిస్టికల్ కమిషన్‌కు భారత్ ఎన్నిక
ఐక్యరాజ్యసమితి అత్యున్నత గణాంకాల విభాగం యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్‌కు రెండు దశాబ్దాల తర్వాత భారత్ ఎన్నికైంది. రహస్య బ్యాలెట్ ఓటింగ్‌లో జరిగిన హోరాహోరీ పోరులో నెగ్గింది. యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ భారత్ యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్ మెంబర్‌గా, నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్‌గా, ప్రోగ్రామ్ కో ఆర్డినేటింగ్ బోర్డ్ ఆఫ్ జాయింట్ యూఎన్ ప్రోగ్రామ్ ఆన్ ఎయిడ్స్‌గా ఎన్నికైంది.
World's Youngest Author: గిన్నిస్ రికార్డు.. నాలుగేళ్లకే పుస్తకాన్ని రాసి ప్రచురించిన బాలుడు
World Health Day: మనం తినే ఆహారమే ఔషధం.. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ఏప్రిల్ 7న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఏర్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపనకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా 1950 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తున్న వివిధ అనారోగ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతీ ఏటా ఏప్రిల్ 7న ఆరోగ్య దినోత్సవంగా జరుపుతున్నారు. అప్పటి నుంచి డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాలు, సిబ్బంది నుంచి వచ్చిన సమర్పణల ఆధారంగా, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కోసం ఒక కొత్త అంశం (థీమ్) ఎంచుకోవడం జరుగుతోంది. ప్రజలందరూ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి, ప్రశాంతమైన, సంపన్నమైన, స్థిరమైన వాతావరణంలో సంతోషకరమైన జీవితాలను గడపాలని ‘అందరికీ ఆరోగ్యం(Health For All)’ 2023 సంవత్సరం థీమ్‌గా తీసుకున్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది ఆహారమే అన్న విషయం మనందరికీ తెలిసిందే. మనం తినే ఆహారమే ఔషధం.. ఎందుకంటే అందులోనే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. రోజూ సరైన, సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఎటువంటి రోగాలు దరిచేరవు. చికిత్స కంటే నివారణ మేలు అని గ్రహించి, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి.
National Vaccination Day 2023: ఆరోగ్యానికి వరం టీకా ఔషధం..
Christina Koch: చంద్రుడిపైకి వెళ్లనున్న తొలి మహిళ క్రిస్టినా కోచ్.. ఎవరీమె..?
చంద్రుడి మీద మనిషి కాలుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. 1969లో అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తొలిసారి చంద్రుడి మీద అడుగు పెట్టాడు. ఇది మానవ చరిత్రలో శాస్త్ర, సాంకేతిక రంగాలు సాధించిన అపూర్వ ఘటనగా లిఖించుకుంది. ఈ చంద్రుణ్ణి అందుకోవడానికి అమెరికా నాసా ద్వారా 1968 నుంచి 72 మధ్య ‘అపోలో’ ద్వారా 24 మంది వ్యోమగాములను పంపితే 12 మంది చంద్రుడిపై దిగగలిగారు. అయితే వారంతా పురుషులు. ఇప్పటివరకూ ఒక్క స్త్రీ కూడా చంద్రుడిని తాకలేదు. కాని త్వరలో తాకబోతోంది. ‘అర్టిమిస్–2’ పేరుతో నాసా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న చంద్రుని ప్రదక్షిణకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో క్రిస్టినా కోచ్ అనే మహిళ ఉంది. ఆ విధంగా చంద్రుడి వరకూ వెళ్లగలిగిన తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్టించనుంది. చంద్రుడికి వీలైనంత దగ్గరగా వెళ్లి దాని చుట్టూ తిరిగి వచ్చే ఈ యాత్ర విజయవంతమైతే 2025లో జరిగే చంద్రయానంలో ఒక స్త్రీని పంపాలని నాసా నిర్ణయం. ఆ అసలు యాత్రకు కావలసిన ధైర్యం క్రిస్టినా ఇవ్వనుంది.
Amit Kshatriya: నాసా ‘మూన్ టు మార్స్’ చీఫ్‌గా భారత సంతతి వ్యక్తి!
ఆర్టిమిస్–2 అంటే?
ఆర్టిమిస్–2 ప్రయోగంలో వ్యోమగాములు చంద్రుడి మీద కాలు పెట్టరు. చంద్రుడికి దగ్గరగా ఉన్న కక్ష్యలోనూ తిరుగాడరు. చంద్రుడికి కొంత దూరం నుంచి ప్రయాణిస్తారు. దీన్నే ఫ్లై బై అని పిలుస్తారు. చంద్రునిపై రోబోలు, మనుషులతో పరిశోధనలు చేపట్టేందుకు నాసా చేపట్టిన కార్యక్రమమే ఆర్టిమిస్. గత ఏడాది ఆర్టిమిస్–1 పేరుతో వ్యోమగాములు లేకుండా ఒరాయెన్ అనే స్పేస్క్యాప్సూల్ను చంద్రుని చుట్టూ తిప్పారు. వచ్చే ఏడాది ఆర్టిమిస్–2 పేరుతో ఒరాయెన్ స్పేస్ క్యాప్సూల్లో నలుగురు వ్యోమగాములు ప్రయాణిస్తారు. ఈ నలుగురిలోనే క్రిస్టినా ఉంది. దాదాపు 10 రోజుల కాలంలో వీరంతా చంద్రుణ్ణి చుట్టి నేరుగా భూమిపైకి వస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి