Skip to main content

Daily Current Affairs in Telugu: ఏప్రిల్‌ 21, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu April 21st 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
April 21st 2023 Current Affairs

SpaceX Starship: ప్రపంచంలోనే భారీ రాకెట్ ‘స్టార్‌ షిప్‌’ ప్రయోగం విఫలం
ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీ రూపొందించిన అతిపెద్ద రాకెట్‌ నింగిలోకి ఎగిసిన కాసేపటికే పేలిపోయింది. చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత యాత్రల కోసం స్పేస్‌ఎక్స్‌ సంస్థ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే అతి భారీ రాకెట్‌ ‘స్టార్‌షిప్’. ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి పరీక్షలో పేలిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న బొకచికా ల్యాంచ్‌ప్యాడ్‌ నుంచి ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే ప్రధాన బూస్టర్‌లో లోపంతో 40 కిలోమీటర్ల ఎత్తున పేలిపోయింది. 
☛ ‘స్టార్‌షిప్‌’ ప్రధాన రాకెట్, బూస్టర్లు కలిపి ఎత్తు 120 మీటర్లు (సుమారు 40 అంతస్తుల భవనం ఎత్తు).  
☛ ఇంధనంతో కలిపి రాకెట్‌ మొత్తం బరువు 5 వేల టన్నులు.. అంతరిక్షంలోకి ఏకంగా 100 టన్నుల బరువైన పేలోడ్‌ను తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. 
☛ స్టార్‌షిప్‌ ప్రయోగాల కోసం చేస్తున్న ఖర్చు సుమారు రూ.80 వేల కోట్లు.  

Christina Koch: చంద్రుడిపైకి వెళ్లనున్న తొలి మహిళ క్రిస్టినా కోచ్.. 

CWC Report: తగ్గుతున్న నీటి నిల్వలు 
ఎండలు మండిపోతున్న వేళ.. ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్‌ పంటలకు పెరిగిన వినియోగం, లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో 146 ప్రధాన జలాశయాలున్నాయి. వీటిల్లో నీటి నిల్వలు గత ఏడాది కన్నా 5శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ రిజర్వాయర్ల వాస్తవ నిల్వ సామర్ధ్యం 178 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (బీసీఎం) కాగా ప్రస్తుతం 70 బీసీఎంల నిల్వలు ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 74 బీసీఎంలతో పోలిస్తే 5 శాతం తక్కువని సీడబ్ల్యూసీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో మొత్తం 53 బీసీఎంల నిల్వ సామర్థ్యం కలిగిన 40 రిజర్వాయర్లుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం ప్రత్యక్ష నిల్వ కేవలం 16.737 బీసీఎంలని వివరించింది. 

India Population: భారతదేశ జనాభా 142.86 కోట్లు.. యువ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే..
రిజర్వాయర్ల మొత్తం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో ఇది 32 శాతం కాగా, గత ఏడాది కన్నా 7% తక్కువని తెలిపింది. ఇక ఏపీ, తెలంగాణలలోని 11 ప్రధాన రిజర్వాయర్లలో 20 బీసీఎంల నీటి నిల్వలకు గాను కేవలం 5.5 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 8 బీసీఎంలతో పోలిస్తే 11శాతం తక్కువని వెల్లడించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో 11.12 బీసీఎంల నిల్వలకు గానూ కేవలం 1.65 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాదితో పోలిస్తే 9% తక్కువని తెలిపింది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (12-18 మార్చి 2023)

Global Buddhist Summit 2023: ఢిల్లీలో గ్లోబల్‌ బుద్ధిస్ట్‌ సమ్మిట్‌ సెషన్ ప్రారంభం 
గ్లోబల్‌ బుద్ధిస్ట్‌ సమ్మిట్‌ సెషన్‌ను ఏప్రిల్ 20న‌ ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గౌతమ బుద్ధుని బోధనలను ఆచరించి సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని అభిలషించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు బుద్ధుడి బోధనలు చక్కని పరిష్కారాలు చూపగలవన్నారు. ‘యుద్ధాలు, ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మత అతివాదం, వాతావరణ మార్పులు.. ఇలా ఎన్నో అంతర్జాతీయ సమస్యలు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటికి గౌతముని సద్గుణ బోధనలు పరిష్కార మార్గాలు చూపుతాయి’ అని అన్నారు. పర్యావరణ మార్పు సమస్యకు సంపన్న దేశాలే కారణమంటూ విమర్శించారు. బుద్ధుడు చూపిన మార్గం భవిష్యత్, సుస్థిర పథం. గతంలోనే ఆయన చూపిన మార్గంలో వెళ్లిఉంటే ఇప్పుడీ ప్రపంచానికి ప్రకృతి విపత్తులు దాపురించేవే కాదు. సంకుచిత భావన నుంచి విస్తృత సమ్మిళిత ప్రపంచ భావన దిశగా మళ్లడం అత్యావశ్యకం. సదస్సుకు 30 దేశాల నుంచి బౌద్ధ సన్యాసులు తదితరులు వచ్చారు.

Quantum Mission: రూ.6,003 కోట్లతో కేంద్రం క్వాంటమ్‌ మిషన్‌.. 

Apple Retail Store: భారత్‌లో రెండో యాపిల్ స్టోర్‌ ప్రారంభం
అమెరికన్‌ టెక్‌ దిగ్గజం యాపిల్ ఢిల్లీలో తమ రిటైల్‌ స్టోర్‌ను ఏప్రిల్ 20న ప్రారంభించింది. భారత్‌లో యాపిల్‌కి ఇది రెండోది కాగా, ఢిల్లీలో మొదటిది. కాగా  తొలి స్టోర్‌ను ఏప్రిల్ 18న ముంబైలో ప్రారంభించారు. ఢిల్లీలోని సెలెక్ట్‌ సిటీవాక్‌ మాల్‌లో ’యాపిల్‌ సాకేత్‌’ స్టోర్‌ను కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ ప్రారంభించారు. ముంబై స్టోర్‌తో పోలిస్తే ఇది దాదాపు సగం ఉంటుంది. స్టోర్‌ విక్రయాల్లో నిర్దిష్ట భాగాన్ని లేదా నెలకు రూ.40 లక్షలు (ఏది ఎక్కువైతే అది) అద్దె కింద కంపెనీ చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాకేత్‌ స్టోర్‌లో 18 రాష్ట్రాల నుంచి 70 మంది పైగా సుశిక్షితులైన సిబ్బంది ఉంటారు. వీరు 15 భాషల్లో సేవలు అందిస్తారు. భారత్‌లో తొలిసారిగా తమ స్టోర్స్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా దేశీయంగా పర్యటిస్తున్న టిమ్‌ కుక్‌ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కూడా కలిశారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (05-11 మార్చి 2023)


National Civil Services Day: నేడు జాతీయ పౌర సేవల దినోత్సవం..  

దేశంలో పరిపాలనా యంత్రాంగం సజావుగా పనిచేసేలా చూడడానికి వివిధ విభాగాల్లో విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న సివిల్ సర్వెంట్ల సేవలకు గుర్తుగా మ‌న దేశంలో ప్ర‌తి ఏడాది ఏప్రిల్ 21న జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని(National Civil Services Day) నిర్వహిస్తున్నారు. మొదటి నేష‌న‌ల్ సివిల్ స‌ర్వీస్ డేను 2006లో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రైమ్ మినిస్టర్స్ ఎక్సలెన్స్ అవార్డును సివిల్ సర్వెంట్లకు అందజేస్తారు. దేశంలోని వివిధ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్‌మెంట్లలో ప‌ని చేస్తున్న అధికారుల పనిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1947లో స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆధికారుల‌ ప్రొబేషనర్లను ఉద్దేశించి ఇదే రోజు ప్రసంగించడం విశేషం. ఆ క్రమంలో తన స్ఫూర్తిదాయక ప్రసంగంలో వల్లభాయ్ పటేల్ దేశంలోని పౌర సేవకులను “భారతదేశపు ఉక్కు చట్రం”గా అభివర్ణించారు. 

World Liver Day 2023: నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
కాగా సివిల్ సర్వెంట్లు ప్రభుత్వ పరిపాలనకు వెన్నెముకగా ఉంటారు. ప్రభుత్వ విధానాల అమలును చేయడం, కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడం సహా ప్రజలకు ప్రయోజనాలు అందేలా చూడటం కూడా వీరి బాధ్యత. భారతదేశంలో సివిల్ సర్వీసెస్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ A, గ్రూప్ B అనే విభాగాలుగా ఉంటాయి. ఇదే రోజు వివిధ కార్యాలయాలు తమ తమ డిపార్ట్‌మెంట్‌ల కోసం రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తాయి. ఇండియన్ సివిల్ సర్వీస్ యొక్క పితామహుడిగా లార్డ్ కార్న్‌వాలిస్‌ను పిలుస్తారు. అలాగే జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని  పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌర సేవకులను ఉద్దేశించి ప్రసంగించిన అనంత‌రం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుల కింద వ్యక్తిగత బహుమతి లక్ష, సంస్థ బహుమతి ఐదు లక్షలు ఉంటుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (12-18 మార్చి 2023)

Richest Cities: ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నగరాలు ఇవే.. భారత్‌కు దక్కని చోటు!
ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన నగరాల జాబితాను హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలోని టాప్ 10లో భారతదేశానికి చెందిన ఒక్క నగరం కూడా లేదు. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరంగా న్యూయార్క్ నిలిచింది. ఈ నగరంలో 3.4 లక్షల మంది మిలియనీర్లు, 724 సెంటీ మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికాకు ఆర్థిక రాజధానిగా పేరుపొందిన న్యూయార్క్‌లో ప్రపంచంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు ఎన్‌వైఎస్‌ఇ, నాస్‌డాగ్ ఉన్నాయి. 100 మిలియన్‌ అమెరికా డాలర్ల (రూ.822 కోట్లు) కంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులను సెంటీ మిలియనీర్లుగా, ఒక బిలియన్‌ డాలర్ల (రూ.8,225 కోట్లు) కంటే ఎక్కువ సంపద ఉంటే బిలియనీర్లుగా పరిగణిస్తారు.
టాప్ 10 సంపన్న నగరాలివే..
సంపన్న నగరాల జాబితాలో మొదటి స్థానం న్యూయార్క్(అమెరికా)కు చోటు దక్కింది. రెండవ స్థానంలో టోక్యో(జపాన్), తృతీయ స్థానంలో ది బే ఏరియా(అమెరికా), నాల్గ‌వ స్థానంలో లండన్(బ్రిటన్) ఉన్నాయి. త‌రువాత వ‌రుస‌గా సింగపూర్, లాస్ ఏంజెలెస్(అమెరికా), హాంకాంగ్(చైనా అధీనంలోని ప్రత్యేక పాలనా ప్రాంతం), బీజింగ్(చైనా), షాంఘై(చైనా), సిడ్నీ(ఆస్ట్రేలియా) ఉన్నాయి. పూర్తి స‌మాచారానికి ఇక్క‌డ క్లిక్ చేయండి

India Population: భారతదేశ జనాభా 142.86 కోట్లు.. యువ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే..

Published date : 21 Apr 2023 06:40PM

Photo Stories