Skip to main content

Education Testing Services: విద్యార్థులు ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని పెంచ‌డానికి ఈటీఎస్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ఒప్పందం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇంగ్లిష్‌ భాషలో నైపుణ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీఎస్‌)తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది.

☛ Daily Current Affairs in short : 21 జూన్‌ 2023 కరెంట్‌ అఫైర్స్‌ ఇవే

ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌ ఉత్తర్వులిచ్చారు.ఈ ఒప్పందం ప్రకారం ఈటీఎస్‌ విద్యార్థులకు టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాస్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌ (టోఫెల్‌) పరీక్షలు నిర్వహించడంతో పాటు సర్టిఫికెట్‌ ఇవ్వనుంది. 

2021–22 నుంచి 6–10 తరగతుల విద్యార్థులందరికీ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ అందిస్తోంది. 3–5వ తరగతి వరకు ఆంగ్లం మెరుగుదల కోసం  నిఘంటువులు ఇస్తోంది. అంతేకాకుండా 3వ తరగతి నుంచే ఆంగ్లం కోసం సబ్జెక్ట్‌ టీచర్లను ఏర్పాటు చేసింది.  

☛  Daily Current Affairs Short: 22 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్ ఇవే.. 

Published date : 22 Jun 2023 06:12PM

Photo Stories