Daily Current Affairs in Telugu: 31 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సారథ్యంలో ప్రాజెక్ట్ 17–ఏ ఫ్రిగేట్స్‌లో భాగంగా 7వ యుద్ధనౌక మహేంద్రగిరిని సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నారు.
2. చైనా ‘ది 2023 ఎడిషన్ ఆఫ్ చైనా స్టాండర్డ్ మ్యాప్’ పేరుతో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ తమ భూభాగంలోనివిగా పేర్కొంది.
3. 'ఎక్స్'గా పేరు మార్చుకున్న ట్విటర్‌లో త్వరలో ఆడియో అండ్ వీడియో కాల్స్ సదుపాయం లభిస్తుందని కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు.
Daily Current Affairs in Telugu: 28 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
4. ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తాజాగా షేర్‌డాట్‌మార్కెట్ పేరిట స్టాక్ బ్రోకింగ్ విభాగంలోకి ప్రవేశించింది.
5. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నట దిగ్గజం, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నందమూరి తారకరామారావు పేరిట రూ.100 స్మారణ నాణేం విడుదల అయ్యింది.
6. సూర్యుడిపై పరిశోధనల కోసం సెప్టెంబర్ 2వ తేదీన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) శ్రీహరికోట నుంచి ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో స్పష్టం చేసింది.
7. మహిళల హాకీ ఆసియా కప్ ఫైవ్స్ (ఐదుగురు ఆడే) టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది.
Daily Current Affairs in Telugu: 26 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్