Skip to main content

Daily Current Affairs in Telugu: 28 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
28 August Daily Current Affairs in Telugu, National News ,Global Events ,Local Insights
28 August Daily Current Affairs in Telugu

1.  ఏప్రిల్‌ నుంచి జూలై వరకు మూల ధన వ్యయంపై కాగ్‌ విడుదల చేసిన గణాంకాల ద్వారా  ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ తరువాత తెలంగాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

2.  సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని సెప్టెంబర్‌ 2న ప్ర‌యోగించ‌నున్న‌ట్లు ఇస్రో తెలిపింది.

Daily Current Affairs in Telugu: 26 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

3. చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌–3 ల్యాండర్‌ దిగిన ప్రాంతం ఇకపై ‘శివశక్తి’ పేరుతో ఖ్యాతికెక్కనుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇస్రో సాధించిన ఈ అద్భుత విజయానికి గుర్తుగా ల్యాండింగ్‌ జరిగిన రోజు(ఆగస్ట్‌ 23వ తేదీ)ను ఇకపై జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 2019లో చంద్రయాన్‌–2 చంద్రునిపై కూలిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్‌గా పిలుచుకుందాం అని తెలిపారు.

4.  ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ కాంస్యం గెలిచాడు.

5. కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి మురహరరావు ఉమాగాంధీ,మేకల భాస్కరరావు,శెట్టెం ఆంజనేయులు ఉన్నారు.

Daily Current Affairs in Telugu: 25 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

6. ప్రముఖ దేశీ వరి వంగడాల పరిరక్షకుడు, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ దేబల్‌ దేవ్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ “ఐఫోమ్‌ ఆసియా ఆర్గానిక్‌ మెడల్‌ ఆఫ్‌
ఆనర్‌’లభించింది.

7. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

8. చంద్రయాన్‌–3 విక్రమ్‌ ల్యాండర్‌లో అమర్చిన చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మో ఫిజికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ అనే పేలోడ్‌ చంద్రుడి ఉపరితలంపై 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు ఉన్న‌ట్లు ఇస్రోకు తెలిపింది.

Daily Current Affairs in Telugu: 24 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 29 Aug 2023 11:24AM

Photo Stories