Daily Current Affairs in Telugu: 24 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
![24 August Daily Current Affairs in Telugu](/sites/default/files/images/2023/08/24/daily-current-affairs-aug-24-1692884799.jpg)
1. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో అమన్‌ప్రీత్ సింగ్ 577 పాయింట్లతో పసిడి పతకం సొంతం చేసుకోగా మహిళల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ టీమ్ విభాగంలో టియానా, యశిత, కృతిక శర్మలతో కూడిన భారత జట్టు 1601 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకుంది.
2. డిజిటల్ చెల్లింపులలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత స్థానాల్లో ఉన్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది.
Daily Current Affairs in Telugu: 23 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
3. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో భూమి పూజ నిర్వహించారు.
4. ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి చొరవ తీసుకున్న భారతదేశానికి చెందిన ఐదుగురు యువకులు ఈహా దీక్షిత్, మాన్య హర్ష, నిర్వాన్ సోమనీ, మన్నత్ కౌర్, కర్ణవ్ రస్తోగి 2023 ఇంటర్నేషనల్ యంగ్ ఎకో-హీరో అవార్డును అందుకోవడానికి ఎంపికయ్యారు.
5. ప్రఖ్యాత భారత్–అమెరికన్ గణిత శాస్త్రవేత్త, గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు(102) అమెరికాలో కన్నుమూశారు.
Daily Current Affairs in Telugu: 22 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్