Skip to main content

Daily Current Affairs in Telugu: 26 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
Competitive exam aspirants' resource,26 August Daily Current Affairs in Telugu ,Exam preparation assistance,
26 August Daily Current Affairs in Telugu

1. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం చినమేడపల్లిలో రూ.830 కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంకు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

2. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు జైవిక్‌ ఇండియా అవార్డు  లభించింది.

3. ఇండియన్‌ స్మార్ట్‌ సిటీస్‌ అవార్డ్స్‌– 2022 పారిశుద్ధ్యంలో కాకినాడ స్మార్ట్‌సిటీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.

Daily Current Affairs in Telugu: 25 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

4. విశాఖపట్నంలోని ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, మానసిక ఆరోగ్య ఆస్పత్రులకు నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్(ఎన్‌ఏబీహెచ్‌) గుర్తింపు దక్కింది. 

5. ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 50 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో తియానా, సాక్షి సూర్యవంశీ, కిరణ్‌దీప్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు 1573 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకుంది. పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో రవీందర్‌ సింగ్‌, కమల్‌జీత్‌, విక్రమ్‌ భారత జట్టు కంచు నెగ్గింది.

6. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ హైలాండ్స్‌ అండ్‌ ఐస్‌లాండ్స్‌ ఎంబీఏ, ఎమ్మెస్సీ అప్లయిడ్‌ డేటా ప్రాసెస్‌ కోర్సుల్లో సంయుక్త సహకారంతో ముందుకెళ్ల‌డానికి అవగాహన ఒప్పందం చేసుకుంది.

7. గ్రీసుకు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ హానర్‌’తో  గ్రీసు అధ్యక్షురాలు కటెరీనా ప్రధాని నరేంద్ర మోదీను సత్కరించారు. 

Daily Current Affairs in Telugu: 24 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 28 Aug 2023 11:05AM

Photo Stories