Skip to main content

lunar orbiter Danuri: చంద్రుని ఉప‌రిత‌ల ఫొటోలు పంపిన ద‌.కొరియా వాహ‌న‌నౌక‌

చంద్రుని ఉప‌రిత‌లంపై ప‌రిశోధ‌న‌ల కోసం ద‌క్షిణ కొరియా ప్ర‌యోగించిన మానవ రహిత అంత‌రిక్ష వాహ‌న‌నౌక‌ దానూరి సెలీనోగ్రాఫిక్ డేటాను సేకరించే మిషన్ లో భాగంగా చంద్రుడి సుదూర భాగానికి సంబంధించిన ఫోటోలను భూమికి పంపింది. భూ ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తులో చంద్రుని చుట్టూ తిరుగుతున్న దానూరి.. మార్చి 22, మార్చి 24వ తేదీల్లో చిత్రీక‌రించిన ఫొటోల‌ను కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాజాగా విడుద‌ల చేసింది.

ఫొటోల ద్వారా చంద్రుని ఉప‌రితలాన్ని మ‌రింత లోతుగా ప‌రిశీలిస్తున్నామ‌ని ద‌.కొరియా తెలిపింది. ఉప‌గ్ర‌హం తీసిన ఫొటోలు, రియల్ టైమ్ లొకేషన్, ఇందుకు సంబంధించిన డేటాను ఆర్బిటర్ వెబ్సైట్లో చూడవచ్చని ఆ దేశ‌ సైన్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

చ‌ద‌వండి: 1 నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు సెల‌వులు... ఎండ‌ల‌ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యం​​​​​​​
145 రోజుల ప్రయాణం తర్వాత కక్ష్యలోకి... 

భూమికి ఫొటోలు, వీడియోలను పంపడం ద్వారా ప్రయోగాత్మక 'స్పేస్ ఇంటర్నెట్' టెక్నాలజీని ద‌.కొరియా పరీక్షించనుంది. దేశ అంతరిక్ష కార్యక్రమంలో ద‌నూరి సాధించిన విజయాలు చారిత్రాత్మక ఘట్టమని ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ కొనియాడారు. 2032 నాటికి చంద్రుడిపై, 2045 నాటికి అంగారక గ్రహంపై వ్యోమనౌకలను పంప‌డంతో సహా మ‌రిన్ని అంతరిక్ష కార్య‌క్ర‌మాల కోసం దక్షిణ కొరియా ప్రణాళికలను రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. భూమి నుంచి 145 రోజుల ప్రయాణం తర్వాత డిసెంబర్ 27న సెలీనోసెంట్రిక్ కక్ష్యలోకి దానూరి ప్ర‌వేశించింది. ఫిబ్రవరి 4న అది తన కార్యకలాపాలను ప్రారంభించింది. మార్చి 22న ఫ‌స్ట్ ఫొటోను చిత్రీక‌రించింది.

Published date : 12 Apr 2023 05:36PM

Photo Stories