Skip to main content

PM Modi's Europe Visit: ప్రస్తుతం జర్మనీ చాన్సలర్‌గా ఎవరు ఉన్నారు?

PM Modi foreign visit

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 ఏడాది తొలిసారి విదేశీ పర్యటనకు యూరప్‌ వెళుతున్నారు. మే 2వ నుంచి మూడు రోజులపాటు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటిస్తారు. యూరప్‌ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఈ పర్యటన తోడ్పడుతుందని మోదీ పేర్కొన్నారు.

GK Science & Technology Quiz: బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణించిన అతి పొడవైన కార్గో నౌక?

ప్రధాని పర్యటన విశేషాలు ఇలా..
మే 2న ప్రధాని మోదీ జర్మనీకి చేరుకుని చాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌తో సమావేశమవుతారు. 3, 4 తేదీల్లో డెన్మార్క్‌ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్‌తో చర్చలు జరుపుతారు. తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్‌ వెళ్లి అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్‌ మాక్రాన్‌తో ముచ్చటిస్తారు. పర్యటనలో మోదీ మొత్తం 25 సమావేశాల్లో పాల్గొంటారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ఇంధన భద్రత, రక్షణ, వాణిజ్య రంగం వంటి అంశాలపై మోదీ విస్తృతంగా చర్చించనున్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
విద్యను జ్ఞాన సముపార్జనకు, సమాజ జాగృతికి మూలబిందువుగా భావించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇందుకోసం చిన్నారులకు విద్యాబోధన మాతృభాషలోనే ప్రారంభం కావాలన్నారు. మే1న ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.100 నాణేన్ని, స్టాంపును విడుదల చేశారు. ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగులో వర్సిటీ శత జయంత్యుత్సవాల బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు.
India-Britain: ప్రధాని మోదీతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ ఎక్కడ సమావేశమయ్యారు?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మే 2వ నుంచి మూడు రోజులపాటు యూరప్‌ దేశాల్లో పర్యటన
ఎప్పుడు : మే 1 
ఎవరు    : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌
ఎందుకు : ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ఇంధన భద్రత, రక్షణ, వాణిజ్య రంగం వంటి అంశాలపై చర్చించేందుకు..

Published date : 02 May 2022 02:24PM

Photo Stories