Five Central Asian Countries: మధ్య ఆసియా దేశాలతో ఉమ్మడి సదస్సును నిర్వహించిన దేశం?
India-Central Asia Summit: మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్‌లతో భారత్ తొలి ఉమ్మడి సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ ఐదు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు 30 ఏళ్లైన సందర్భంగా జనవరి 27న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉమ్మడి సదస్సును ప్రారంభించారు. సదస్సుకు నేతృత్వం వహిస్తూ మోదీ కీలక ప్రసంగం చేశారు. మధ్యఆసియా దేశాలు, భారత్ మధ్య సహకారం ప్రాంతీయ భద్రతకు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్‌లో పరిణామాల దృష్ట్యా ఈ ప్రాంతానికి భారత్‌కు మధ్య బంధం మరింత బలపడాలని కోరారు.
సదస్సులో కజకిస్తాన్ అధ్యక్షుడు కాసెమ్ జోమార్ట్ టొకయేవ్, ఉజ్బెకిస్తాన్ అధిపతి షావక్త్ మిర్జియోయేవ్, తజకిస్తాన్ నేత ఇమోమాలి రహమన్, తుర్క్‌మెనిస్తాన్ అధ్యక్షుడు గుర్బంగ్లీ బెర్డిముహమెదోవ్, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సడేర్ జపరోవ్ పాల్గొన్నారు. సదస్సు ఏర్పాటుపై ఐదుగురు అధ్యక్షులు ప్రధానిని ప్రశంసించారు. 2015లో మోదీ ఈ దేశాల్లో పర్యటించారు. మోదీ సూచించిన ‘వన్ ఎర్త్–వన్ హెల్త్’ విధానాన్ని నేతలు స్వాగతించారు. సదస్సు అనంతరం నేతలు ‘ఢిల్లీ డిక్లరేషన్’ పేరిట నిర్ణయాలను వెలువరించారు.
ఢిల్లీ డిక్లరేషన్–ముఖ్యాంశాలు..
- ఉగ్రవాద రహిత ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు సమగ్ర విధానంతో దాన్ని ఎదుర్కోవాలి.
- ప్రపంచ ఆరోగ్య సవాళ్లు, మహమ్మారులకు సంబంధించి పారదర్శకమైన, వివక్షకు తావులేని, సమర్థవంతమైన అంతర్జాతీయ ప్రతిస్పందన అవసరం. తద్వారా ఔషధాలు, సంక్లిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు అందరికీ దరిచేరుతాయి.
- అఫ్గాన్ విషయంలో సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలి.
- విదేశాంగ, వాణిజ్య, సాంస్కృతిక శాఖల మధ్య చర్చలు, సంప్రదింపులను యథావిధిగా కొనసాగిస్తూనే... రెండేళ్లకోసారి దేశాధినేతలతో సదస్సు నిర్వహించాలి.
చదవండి: డీసీఐ, ఎన్‌ఎండీసీల ఒప్పందం ప్రధాన ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్‌లతో తొలి ఉమ్మడి సదస్సును నిర్వహించిన దేశం?
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : భారత్
ఎక్కడ : వర్చువల్ విధానం ద్వారా..
ఎందుకు : ఈ ఐదు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు 30 ఏళ్లైన సందర్భంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్