European Union: ప్రధాని మోదీతో భేటీ అయిన ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడి పేరు?
జీ–20 సదస్సులో పాల్గొనడానికి యూరప్ పర్యటనకు వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 29న ఇటలీ రాజధాని రోమ్‌లో యూరోపియన్ యూనియన్(ఈయూ) అత్యున్నత అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లు, ఈయూ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం, అఫ్గానిస్తాన్, ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఆరోగ్యం, వాణిజ్యం, సంస్కృతి, పర్యాటకం తదితర రంగాల్లో భారత్, ఈయూ మధ్య బంధాన్ని మరింత సుదృఢం చేసుకోవాలని నిర్ణయించారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీతోనూ సమావేశమైన మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు రోమ్‌లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి.. నివాళులర్పించారు.
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిషెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్‌తో ప్రధాని మోదీ లోతైన చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది.
చదవండి: ఏ దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత సీఈసీ పరిశీలకునిగా వ్యవహరించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూరోపియన్ యూనియన్(ఈయూ) అత్యున్నత అధికారులతో సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : రోమ్, ఇటలీ
ఎందుకు : జీ–20 సదస్సులో పాల్గొనడానికి మోదీ యూరప్ పర్యటనకు వచ్చిన సందర్భంగా...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్