Defence Deal: బ్రహ్మోస్ మిస్సైళ్లను కొనుగోలు చేయనున్న దేశం?
భారత తయారీ బ్రహ్మోస్ మిస్సైళ్లను ఫిలిప్పీన్స్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇరు ప్రభుత్వాల మధ్య త్వరలో ఒక ఒప్పందం కుదరనుంది. ఫిలిప్పీన్స్ నేవీకి బ్రహ్మోస్‌ను అందించే ఈ ఒప్పందంపై సంవత్సరాలుగా చర్చలు సాగుతున్నాయి. తాజా ఒప్పందంతో భారత్– ఫిలిప్పీన్స్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కానుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 413 కోట్లని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఆ దేశ బడ్జెట్‌శాఖ ఇటీవల రెండు ఎస్‌ఏఆర్‌ఓ(స్పెషల్ అలాట్‌మెంట్ రిలీజ్ ఆర్డర్స్)ను విడుదల చేసింది.
ఫిలిప్పీన్స్‌కు అందజేయబోయే క్షిపణుల రేంజ్ సుమారు 290 కిలోమీటర్లు. ఇది ధ్వని వేగానికి దాదాపు 3 రెట్లు అధిక వేగంతో పయనిస్తుంది. దీన్ని సబ్‌మెరైన్లు, నౌకలనుంచి ప్రయోగించవచ్చు. ఇటీవల కాలంలో సైనిక విభాగాల ఆధునీకరణకు ఫిలిప్పీన్స్ పలు చర్యలు తీసుకుంటోంది. ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్‌లో భాగంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేసిన విషయం విదితమే.
చదవండి: ఏ దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత తయారీ బ్రహ్మోస్ మిస్సైళ్లను కొనుగోలు చేయనున్న దేశం?
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : ఫిలిప్పీన్స్
ఎందుకు : ఫిలిప్పీన్స్ సైనిక విభాగాల ఆధునీకరణలో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్