చైనాను అధిగమించి అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా భారత్!
Sakshi Education
చైనాను అధిగమించి శ్రీలంకకు అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా భారత్ అవతరించింది.
- చైనాను అధిగమించి శ్రీలంకకు అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా భారత్ అవతరించింది. 2022 నాలుగు నెలల్లో భారతదేశం మొత్తం 968 మిలియన్ US డాలర్ల రుణాలను ద్వీప దేశానికి అందించింది. 2017-2021 వరకు గత ఐదేళ్లలో, శ్రీలంకకు చైనా అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా ఉంది.
- ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) గత ఐదేళ్లలో అతిపెద్ద బహుపాక్షిక రుణదాతగా ఉంది, 2021లో 610 మిలియన్ డాలర్ల నిధులను పంపిణీ చేసింది.
- భారతదేశం ఆహారం, ఆర్థికంగా దాదాపు 4 బిలియన్ డాలర్లను అందించిందని UNకు భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరాకాంబోజ్ తెలిపారు. శ్రీలంకకు సహాయం, సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు ఆగస్టు 22న భారత్ 21,000 టన్నుల ఎరువులను అందజేసింది.
Published date : 19 Sep 2022 06:38PM