Veer Guardian: ఇండియా జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు
Sakshi Education
భారత్, జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు జనవరి 12 నుంచి 26 వరకు జపాన్‌లోని హైకురి ఎయిర్‌బేస్‌లో జరగనున్నాయి.
‘వీర్ గార్డియన్-2023’ పేరుతో రెండు దేశాల వైమానిక సేనలు ఈ సంయుక్త విన్యాసాలు చేయనున్నాయి. ఈ విన్యాసాలు ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మెరుగయ్యేందుకు దోహదం చేస్తాయని భారత రక్షణ శాఖ పేర్కొంది. భారతదేశం నుంచి నాలుగు ఎస్‌యూ-30ఎంకేఐ, రెండు సీ-17, ఒక ఐఎల్-78 యుద్ధవిమానాలు, జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి నాలుగు ఎఫ్-2, నాలుగు ఎఫ్-15 యుద్ధవిమానాలు పాల్గొననున్నాయి. కాగా 2022 ఫిబ్రవరి-మార్చిలో భారత్, జపాన్ తొలిసారిగా ‘ధర్మ గార్డియన్-2022’ పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి.
America-South Korea: దక్షిణ కొరియా–అమెరికా సంయుక్త విన్యాసాలు
Published date : 08 Jan 2023 11:48AM