America-South Korea: దక్షిణ కొరియా–అమెరికా సంయుక్త విన్యాసాలు
Sakshi Education
దక్షిణ కొరియా సముద్రజలాల్లో జేజూ ద్వీపం వద్ద డిసెంబర్ 20 నుంచి వారం రోజుల పాటు దక్షిణ కొరియా–అమెరికా సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి.
అమెరికా బీ–52 అణు బాంబర్ విమానాలు, ఎఫ్–22లకు కొరియా ఎఫ్–35, ఎఫ్–15 యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. దక్షిణ కొరియాలో విన్యాసాల కోసం అమెరికా ఎఫ్–22 విమానాలను రప్పించడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. తమ సైనిక సామర్థ్యాన్ని దక్షిణ కొరియా, అమెరికా తక్కువ అంచనా వేయొద్దని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరించిన వేళ ఈ రెండు దేశాలు వైమానిక విన్యాసాలకు సిద్ధమయ్యాయి.
Weekly Current Affairs (National) క్విజ్ (18-24 నవంబర్ 2022)
Published date : 21 Dec 2022 12:32PM