Nuclear Installations: ‘అణు’ సమాచారం పంచుకున్న దక్షిణాసియా దేశాలు?
భారత్, పాకిస్తాన్‌లు తమ దేశాల్లో అణువిద్యుత్ కేంద్రాలు, అణు ఇంధనశుద్ధికి సంబంధించిన ఇతర సదుపాయాల సమాచారాన్ని వరుసగా 31వ సంవత్సరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి అణు సదుపాయాలపై మరొకరు దాడి చేయకుండా నివారించే లక్ష్యంతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం జనవరి 1న రెండు దేశాలు దౌత్యమార్గాల ద్వారా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో ఈ సమాచార మార్పిడి చోటుచేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
1991లో ఒప్పందం..
జనవరి ఒకటిన తమ అణు కేంద్రాలు, ఇతర సదుపాయాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటూ రెండు దేశాలు 1991లో ఒప్పందం చేసుకున్నాయి. సీమాంతర ఉగ్రవాదం, కశ్మీర్ అంశంపై రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనూ ఈ ఒప్పందం అమలు య«థావిథిగా కొనసాగింది.
అఫ్గాన్‌కు 5 లక్షల డోసుల కోవిడ్ టీకా..
తాలిబన్ల పాలనలోని అఫ్గానిస్తాన్‌కు భారత్ రెండో విడత మానవతా సాయం అందించింది. జనవరి 1న 5 లక్షల డోసుల కరోనా టీకా కోవాగ్జిన్‌ను కాబూల్‌కు పంపించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. త్వరలో మరో 5 లక్షల డోసుల టీకాను పంపిస్తామని పేర్కొంది.
చదవండి: బ్రహ్మోస్ మిస్సైళ్లను కొనుగోలు చేయనున్న దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అణు కేంద్రాలు, ఇతర సదుపాయాల సమాచారం పంచుకున్న దక్షిణాసియా దేశాలు?
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : భారత్, పాకిస్తాన్
ఎక్కడ : న్యూఢిల్లీ, ఇస్లామాబాద్
ఎందుకు : ఒకరి అణు సదుపాయాలపై మరొకరు దాడి చేయకుండా నివారించే లక్ష్యంతో 1991లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్