Skip to main content

Thapi Dharmarao award 2022: ప్రముఖ కార్టూనిస్టు సరసికి బహూకరణ

- కార్టూన్ల సంకలనం పుస్తకావిష్కరణ
కార్టూన్ల సంకలనం
కార్టూన్ల సంకలనం

తెనాలి:  పట్టణానికి చెందిన తెలుగు జాతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని తాపీ ధర్మారావు వేదిక నిర్వహణలో ఏటా బహూకరిస్తున్న తాపీ ధర్మారావు పురస్కార ప్రదానోత్సవం నవంబర్ 5వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నారు. వివిధ సామాజిక సమస్యలపై వేలాది కార్టూన్లతో ప్రజల్లో చైతన్యం కలిగించిన చిత్రకారుడు సరస్వతుల రామనరసింహం (సరసి)కి 2022 సంవత్సరానికి తాపీ పురస్కారం అందజేస్తారు.  ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషసాయి ముఖ్యఅతిథిగా హాజరై తాపీ ధర్మారావు పురస్కారాన్ని సరసికి బహూకరిస్తారు. ఇదే వేదికపై సరసి రూపొందించిన ‘అమ్మ నుడిని అటకెక్కిస్తారా’ కార్టూన్ల పుస్తకాన్నీ ఆయన ఆవిష్కరిస్తారు. రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, హైకోర్టు న్యాయవాది, కార్టూనిస్టు అన్నం శ్రీధర్, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, తమ్మా శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు.  

Also read: AP: విద్యలో అగ్రగామి.. తొలిసారి ‘లెవెల్‌–2’సాధించిన ఆంధ్రప్రదేశ్‌

కవి పండితుడు, విమర్శకుడు, పత్రికా సంపాదకుడు, సినీరచయిత అయిన తాపీ ధర్మారావు తెలుగు భాషకు చేసిన సేవలకు గుర్తింపుగా వెన్నిసెట్టి రంగారావు, సామల లక్ష్మణబాబు నిర్వహణలోని వేదిక ఆధ్వర్యంలో ఏటా ఒక్కో నగరంలో తాపీ ధర్మారావు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. 2009 నుంచి తాపీ ధర్మారావు పురస్కారాన్ని స్వీకరించిన వారిలో డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్, డాక్టర్‌ కె.శ్రీనివాస్, టంకశాల అశోక్, జి.శ్రీరామమూర్తి ఎ.కృష్ణారావు, ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు, సతీష్‌చందర్, డాక్టర్‌ ఏటుకూరి ప్రసాద్‌ (జీవన సాఫల్య పురస్కారం), యల్లపు ముకుంద రామారావు, డీపీ అనూరాధ ఉన్నారు.  
2022 సంవత్సరానికి పురస్కారం స్వీకరించనున్న సరసి, వేలాది కార్టూన్ల రచనలతో వార్తాపత్రికల చదువరులకు చిరపరిచితుడు. వీరిది పశ్చిమగోదావరి జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో సహాయ కార్యదర్శిగా పనిచేశారు. ప్రవృత్తిగా సరసి కలం పేరుతో కార్టూన్లు, కథలు, రేడియో నాటికలు రాస్తున్నారు. సంగీతం, చిత్రలేఖనంలోనూ ప్రవేశముంది. తాజా పుస్తకంతో కలిపి ఆయన కార్టూన్లు 10 సంకలనాలుగా వెలువడ్డాయి. ఒక వారపత్రికలో 15 ఏళ్లపాటు నిర్వహించిన కార్టూన్ల శీర్షిక ‘మనమీదేనర్రోయ్‌’ విశేష పాఠకాదరణ పొందింది. తన కార్టూన్లకు రెండు జాతీయ అవార్డులు, నాలుగు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఇక రాష్ట్రస్థాయి అవార్డులకు కొదవలేదు. 

Also read: YSR Awards 2022 : విజయవాడలో ఘనంగా పురస్కారాల ప్రదానోత్సవం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

కార్టూన్ల సంకలనం   

Published date : 04 Nov 2022 10:30AM

Photo Stories