Sahitya Puraskar: తనికెళ్లకు లోక్‌నాయక్ పురస్కార ప్రదానం
లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను మద్దిల పాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మిజో రం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్‌బాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ జయప్రకాశ్ నారాయణ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా తనికెళ్ల భరణికి సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల నగదు బహుమతి అందజేసి ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు సేవలందించిన నాటి ప్రత్యేక అధికారి గోటేటి రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, డ్రైవర్ లక్ష్మణ్‌లను కూడా సత్కరించారు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: కెన్యా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP