Tamil Film: భారత్ తరపున ఆస్కార్ పోటీలో నిలిచిన చిత్రం?
2022 ఏడాది ఆస్కార్ అవార్డుల(94వ ఆస్కార్ అవార్డులు)కు సంబంధించి విదేశీ విభాగంలో... భారత్ తరఫున పోటీలో నిలవడానికి తమిళ చిత్రం ‘కూళాంగల్’ ఎంపికైంది. ఈ మేరకు అక్టోబర్ 23న అధికారిక ప్రకటన వెలువడింది. పీఎస్ వినోద్ రాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార ‘రౌడీ పిక్చర్స్’ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కూళాంగల్ అంటే.. గులకరాయి అని అర్థం. తాగుబోతు తండ్రిని మార్చి ఇంట్లోంచి వెళ్లిపోయిన తన తల్లిని తీసుకు రావడానికి ఓ అబ్బాయి చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథ. 2022 మార్చి 27న 94వ ఆస్కార్ అవార్డ్ వేడుక జరగనుంది.
టైగర్ అవార్డు...
‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్‌డామ్’ (ఐఎఫ్‌ఎఫ్‌ఆర్)లో ‘కూళాంగల్’ ప్రతిష్టాత్మక టైగర్ అవార్డు దక్కించుకుంది. 50 ఏళ్ల ఐఎఫ్‌ఎఫ్‌ఆర్ చరిత్రలో 2017లో మన దేశానికి తొలి అవార్డును తెచ్చిన మలయాళ ‘దుర్గా’ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న మరో సినిమా ‘కూళాంగల్’ కావడం విశేషం.
చదవండి: 67th National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు - 2019
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్