Dadasaheb Phalke Award: 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేత?
ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం 2021, అక్టోబర్ 25న న్యూఢిల్లీలో జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రదానం చేశారు. వెంకయ్య చేతుల మీదుగా 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రజనీ అందుకున్నారు. 2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని 67వ చలన చిత్ర పురస్కారాలకు ఎంపిక చేశారు. వాస్తవానికి, 2020 ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఆలస్యమైంది.
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం...
భారత చలన చిత్ర రంగంలో అత్యున్నత అవార్డుగా ’దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును పరిగణిస్తారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరున ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన శత జయంతి సంవత్సరం 1969 నుంచి భారత ప్రభుత్వం ఏటా ఫాల్కే అవార్డులను సినీ రంగ ఉన్నతికి జీవిత కాల కృషి చేసిన ప్రముఖులకు అందిస్తోంది. బహుమతిగా రూ.10 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం, శాలువతో సత్కరిస్తారు.
చదవండి: 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : సూపర్ స్టార్ రజనీకాంత్‌కు 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : భారతీయ సినిమా ఉన్నతికి విశేష కృషి చేసినందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్