Skip to main content

సెప్టెంబర్ 2020 అవార్డ్స్

సీఎస్‌ఐఆర్ టెక్నాలజీ అవార్డు-2020 విజేత?
Current Affairs
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి ప్రతిష్టాత్మక శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్) టెక్నాలజీ అవార్డు దక్కింది. కరోనా చికిత్సకు వాడుతున్న ఫావిపిరవిర్ మందును చౌకగా తయారు చేసేందుకు అవసరమైన పద్ధతులను అభివృద్ధి చేసినందుకుగాను ఈ అవార్డు వరించింది. ఆరోగ్య రంగంలో చేసిన పరిశోధనలకు డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ నేతృత్వంలోని ఐఐసీటీకి 2020 సంవత్సరానికి ఈ అవార్డును అందజేస్తున్నట్లు సీఎస్‌ఐఆర్ సెప్టెంబర్ 26న ఒక ప్రకటనలో తెలిపింది. సీఎస్‌ఐఆర్ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి హర్షవర్ధన్ ఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు.
చంద్రశేఖర్‌కు గ్రాంట్...
ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తొలి సీఎస్‌ఐఆర్-ఆవ్రా చైర్ ప్రొఫెసర్ గ్రాంట్‌కు ఎంపికయ్యారు. ఏటా రూ.10 లక్షల చొప్పున మూడేళ్లపాటు మొత్తం రూ.30 లక్షల నగదు ఈ గ్రాంట్‌లో భాగంగా లభిస్తుంది. క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఎస్‌ఐఆర్ టెక్నాలజీ అవార్డు-2020 విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : కరోనా చికిత్సకు వాడుతున్న ఫావిపిరవిర్ మందును చౌకగా తయారు చేసేందుకు అవసరమైన పద్ధతులను అభివృద్ధి చేసినందుకుగాను

ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ
గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సెప్టెంబర్ 28న ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, బిస్మిల్లాఖాన్, భీంసేన్ జోషి, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి లాంటి గొప్ప గాయకులు, సంగీత విద్యాంసులకు భారత రత్నను ఇచ్చి సత్కరించినట్లుగానే అసాధారణ ప్రతిభాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించి గౌరవించాలని లేఖలో కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారత రత్న’ను ప్రకటించాలని కోరుతూ..

యూఎన్‌డీపీ హ్యుమానిటేరియన్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ నటుడు?
ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌కు ప్రతిష్టాత్మక ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు లభించింది. కరోనా సంక్షోభ కాలంలో దేశ ప్రజలకు చేస్తోన్న సామాజిక సేవకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. సెప్టెంబర్ 28న ఆన్‌లైన్ ద్వారా సోనూసూద్‌కి ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటుడిగా సోనూసూద్ నిలిచాడు. ఐక్యరాజ్య సమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) ఈ అవార్డును అందజేస్తోంది. యూఎన్‌డీపీ పేదరిక నిర్మూలన కోసం 170కి పైగా దేశాల్లో పనిచేస్తోంది.
నిఖార్సయిన హీరోగా...
ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలతో సుపరిచితమైన సోనూసూద్ అనేక మంది వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేర్చి ప్రజల మనస్సుల్లో నిఖార్సయిన హీరోగా నిలిచిపోయారు. వలస కార్మికులు, విద్యార్థులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోన్న వారిని రక్షించడంలో ఆపద్బాంధవుడయ్యారు. అనేక మంది విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు స్మార్ట్‌ఫోన్‌లు కొనివ్వడం, సిగ్నల్ లేని ప్రాంతాల్లో మొబైల్ టవర్స్‌ని ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను సోనూ చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ నటుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : సోనూసూద్
ఎందుకు : కరోనా సంక్షోభ కాలంలో దేశ ప్రజలకు చేస్తోన్న సామాజిక సేవకుగాను

స్వచ్ఛ భారత్‌లో వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
స్వచ్ఛభారత్‌లో తెలంగాణ రాష్ట్రం వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచి ‘స్వచ్ఛభారత్ జాతీయ అవార్డు’ను కైవసం చేసుకుంది. అలాగే జిల్లాల కేటగిరీలో కరీంనగర్ జిల్లా జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచి పురస్కారానికి ఎంపికైంది. అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ దివస్ సందర్భంగా వర్చువల్ పద్ధతిలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అవార్డులను అందజేయనున్నారు.
మూడు కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు...
స్వచ్ఛ సుందర్ సముదాయిక్ సౌచాలయ (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్), సముదాయిక్ సౌచాలయ అభియాన్ (ఎస్‌ఎస్‌ఎ), చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు గందగీ ముక్త్ భారత్ (డీడీడబ్ల్యూఎస్) అనే మూడు కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ మూడు కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణను స్వఛ్చభారత్ అవార్డుకు ఎంపిక చేశారు.
నాలుగు కేటగిరీల్లో అవార్డులు...
ప్రతి ఏటా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామ పంచాయతీలవారీగా అవార్డులు అందజేస్తోంది. రక్షిత తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో పనితీరును మదింపు చేసి ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛ భారత్‌లో వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : తెలంగాణ
ఎక్కడ : దేశంలోనే

ఇస్రో చైర్మన్ శివన్‌కు సైమన్ రామో పురస్కారం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కె.శివన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) ఛాన్సలర్ బీఎన్ సురేష్‌లకు సైమన్ రామో పురస్కారం(సైమన్ రామో మెడల్) లభించింది. సిస్టమ్స్ ఇంజినీరింగ్ రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా వీరికి ఈ అవార్డు దక్కింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 29న జరిగిన కార్యక్రమంలో శివన్‌కు డీఆర్‌డీవో మాజీ చైర్మన్ వి.కే.ఆత్రే ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇస్రో విశ్రాంత సీనియర్ సైంటిస్టు ఆర్.ఎం.వాసగం చేతులమీదుగా సురేష్ పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికన్ ఇంజనీర్, వ్యాపారవేత్త, రచయిత సైమన్ ‘సి‘ రామో పేరు మీదుగా సైమన్ రామో పురస్కారాన్ని అందజేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సైమన్ రామో పురస్కారం విజేతలు
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : ఇస్రో చెర్మన్ డాక్టర్ కె.శివన్, ఐఐఎస్‌టీ ఛాన్సలర్ బీఎన్ సురేష్
ఎందుకు : సిస్టమ్స్ ఇంజినీరింగ్ రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా

వెన్నిస్ ఫిల్మ్ ఫెస్ట్‌లో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును గెలుచుకున్న మరాఠీ చిత్రం?
Current Affairs
ఇటలీలోని వెన్నిస్‌లో సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జరిగిన 77వ వెన్నిస్ ఫెస్టివల్‌లో చైతన్య తమ్హానే దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం ‘ది డిసిపుల్’కు రెండు అవార్డులు లభించాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఎఫ్‌పీఆర్‌ఈఎస్‌సీఐ క్రిటిక్స్ విభాగంలో ఈ రెండు అవార్డులను గెలుచుకుంది. ఆదర్శ్ గోపాలకృష్ణన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘మతిళుకల్’ (1989) తర్వాత ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారం అందుకున్న చిత్రంగా ది డిసిపుల్ నిలిచింది. ఓ యువ సంగీత కళాకారుడు చేసే సంగీత ప్రయాణం కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు చైతన్య గతంలో తీసిన ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సాధించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 77వ వెన్నిస్ ఫెస్టివల్‌లో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును గెలుచుకున్న మరాఠీ చిత్రం
ఎప్పుడు : సెప్టెంబర్ 2-12
ఎవరు : ది డిసిపుల్
ఎక్కడ : వెన్నిస్, ఇటలీ

ఇందిరా గాంధీ శాంతి బహుమతిని అందుకున్న ప్రసిద్ధ వ్యాఖ్యాత?
Current Affairs
బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ వ్యాఖ్యాత డేవిడ్ అటెన్‌బరోకు ఇందిరా గాంధీ శాంతి బహుమతి-2019 లభించింది. ఈ పురస్కారాన్ని సెప్టెంబర్ 7న ఆన్‌లైన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అటెన్‌బరోకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. అర్ధశతాబ్దానికి పైగా డేవిడ్ ప్రకృతి సంపద పరిరక్షణకు అమూల్య మైన సేవలనందించారు. పలు చిత్రాలు, పుస్తకాల ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేశారు. ప్రముఖ నటుడు రిచెర్డ్ అటెన్‌బరోకు సర్ డేవిడ్ అటెన్‌బరో సోదరుడవుతారు. ఇందిర శాంతి బహుమతి విజేతకు రూ.25లక్షలను అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇందిరా గాంధీ శాంతి బహుమతి-2019 విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ వ్యాఖ్యాత డేవిడ్ అటెన్‌బరో

కాళోజీ సాహిత్య పురస్కారం-2020 విజేత ఎవరు?
ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళికి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం-2020 లభించింది. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సెప్టెంబర్ 9న జరిగిన కార్యక్రమంలో చంద్రమౌళికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. చంద్రమౌళికి పురస్కారం కింద రూ.లక్షా 1,116 నగదు అందించడంతోపాటు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస గౌడ్ పాల్గొన్నారు.
స్మితా గోవింద్‌కు శిక్షక్ పురస్కార్...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అందించే శిక్షక్ పురస్కార్ 2019-20 అవార్డు తెలంగాణ నుంచి స్మితా గోవింద్‌కు దక్కింది. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. తెలంగాణ నుంచి బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ప్రధానాచార్యులుగా పని చేస్తున్న స్మితా గోవింద్‌కు 2020 ఏడాది పురస్కారం దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన వర్చువల్ పోగ్రాంలో కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియాల్ నుంచి స్మిత అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళోజీ సాహిత్య పురస్కారం-2020 విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళి

నోబెల్ శాంతి బహుమతి ఏ దేశాధ్యక్షుడు నామినేట్ అయ్యారు?
2021 నోబెల్ శాంతి పురస్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ అయ్యారు. ఇజ్రాయెల్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ఒప్పందం కుదిరేలా కృషి చేసినందుకుగాను ట్రంప్‌ను ఈ అత్యున్నత పురస్కారానికి నామినేట్ చేసినట్లు నార్వే పార్లమెంట్ సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ జెడ్డె తెలిపారు. ఇజ్రాయెల్, యూఏఈల మధ్య ఒప్పందం మధ్యప్రాచ్యంలో ఒక గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. టైబ్రింగ్ జెడ్డె ట్రంప్‌ని నామినేట్ చేయడం ఇది మొదటిసారి కాదు. 2018లో ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతల నివారణకు ట్రంప్ కృషి చేశారంటూ ఆయనని నామినేట్ చేశారు. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతంలో అసాధారణ కృషికిగాను నోబెల్ శాంతి బహుమానం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు : ఇజ్రాయెల్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ఒప్పందం కుదిరేలా కృషి చేసినందుకుగాను

జాతీయ క్రీడా పురస్కారాల-2020
2020 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆగస్టు 21న ప్రకటించింది. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29(ద్యాన్‌చంద్ 115వ జయంతి)న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. సాధారణంగా ప్రతి సంవత్సరం దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న అవార్డులను అందజేస్తారు.
వర్చువల్‌గా అవార్డుల స్వీకరణ...
కరోనా వైరస్ విజృంభణ కారణంగా 2020 ఏడాది క్రీడా పురస్కారాలను రాష్ట్రపతి కోవింద్ వర్చువల్ (ఆన్‌లైన్) పద్ధతిలో ప్రదానం చేశారు. దీనికి దేశంలోని 11 భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలు వేదికలుగా నిలిచాయి. రాష్ట్రపతి భవన్‌తో అనుసంధానమైన సాయ్ కేంద్రాలు అత్యంత సురక్షిత వాతావరణంలో వేడుకల్ని నిర్వహించాయి. మొత్తం 74 (5 ఖేల్త్న్ర, 27 అర్జున, 13 ద్రోణాచార్య, 15 ధ్యాన్‌చంద్ ) మంది 2020 ఏడాది జాతీయ అవార్డులను గెలుచుకోగా ఆగస్టు 29న 60 మంది ఈ పురస్కారాలను స్వీకరించారు.
బెంగళూరు నుంచి మనికా...
ఖేల్త్న్రకు ఎంపికై న మహిళా హాకీ ప్లేయర్ రాణి రాంపాల్, పారాలింపియన్ తంగవేలు సాయ్ పుణే కేంద్రం నుంచి... టీటీ ప్లేయర్ మనికా బాత్రా బెంగళూరు నుంచి ఈ అవార్డులను అందుకున్నారు. దుబాయ్‌లో ఉండటంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కరోనా సోకడంతో వినేశ్ ఫొగాట్, ఏపీ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ తమ అవార్డులను అందుకోలేదు. 44 ఏళ్ల క్రీడా అవార్డుల చరిత్రలో కరోనా కారణంగా తొలిసారి ఆన్‌లైన్ ద్వారా అవార్డుల వేడుకలు నిర్వహించారు. ప్రతి యేటా ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో అవార్డుల అందజేత కార్యక్రమం నిర్వహించేవారు.
ఏపీ నుంచి ఇద్దరికి...
2020 ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి జాతీయ క్రీడా పురస్కారాలు లభించాయి. యువ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్‌కు ‘అర్జున’, మాజీ బాక్సర్ నగిశెట్టి ఉషకు ‘ద్యాన్‌చంద్’ జీవితకాల సాఫల్య పురస్కారం లభించాయి.
పెరిగిన ప్రైజ్‌మనీ..
జాతీయ క్రీడా అవార్డుల ప్రైజ్‌మనీ భారీగా పెంచినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. 2020 ఏడాది నుంచే దీనిని అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. నూతన విధానం ప్రకారం ఖేల్త్న్ర పురస్కారానికి రూ. 25 లక్షల ప్రైజ్‌మనీగా చెల్లించనున్నారు. గతంలో ఇది రూ. 7.5 లక్షలుగా ఉంది.
అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డుల ప్రైజ్‌మనీలో కూడా మార్పులు చేశారు. గతేడాది వరకు ఈ అవార్డులకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లిస్తుండగా... 2020 ఏడాది నుంచి అర్జున, ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం గ్రహీతలకు రూ. 15 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ద్రోణాచార్య (రెగ్యులర్), ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలు రూ. 10 లక్షల చొప్పున అందుకోనున్నారు. చివరిసారిగా 2008లో ప్రైజ్‌మనీలో మార్పులు జరిగాయి.
రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న (5):
2020 ఏడాదికిగాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’ ను ఒకేసారి అత్యధికంగా ఐదుగురు ఎంపికయ్యారు. గతంలో 2016లో ఒకేసారి అత్యధికంగా నలుగురికి ‘ఖేల్త్న్ర’ అవార్డును ఇచ్చారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన స్మారకార్థం 1991లో ‘ఖేల్త్న్ర’ అవార్డును ప్రవేశపెట్టారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

రోహిత్ శర్మ

క్రికెట్

2

వినేశ్ ఫొగాట్

మహిళల రెజ్లింగ్

3

రాణి రాంపాల్

మహిళల హాకీ

4

మనికబత్రా

మహిళల టేబుల్ టెన్నిస్

5

మరియప్పన్ తంగవేలు

పారా అథ్లెటిక్స్

అర్జున అవార్డు (27):
2020 ఏడాదికి మొత్తం 27 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

సాత్విక్ సాయిరాజ్

బ్యాడ్మింటన్

2

చిరాగ్ శెట్టి

బ్యాడ్మింటన్

3

ఇషాంత్ శర్మ

క్రికెట్

4

దీప్తి శర్మ

క్రికెట్

5

మనీశ్ కౌశిక్

బాక్సింగ్

6

లవ్లీనా బొర్గోహైన్

బాక్సింగ్

7

మను భాకర్

షూటింగ్

8

సౌరభ్ చౌధరీ

షూటింగ్

9

దివ్య కాక్రన్

రెజ్లింగ్

10

రాహుల్ అవారే

రెజ్లింగ్

11

ఆకాశ్‌దీప్ సింగ్

హాకీ

12

దీపిక

హాకీ

13

దివిజ్ శరణ్

టెన్నిస్

14

అతాను దాస్

ఆర్చరీ

15

ద్యుతీ చంద్

అథ్లెటిక్స్

16

విశేష్ భృగువంశీ

బాస్కెట్‌బాల్

17

అజయ్ అనంత్ సావంత్

ఈక్వేస్టియ్రన్

18

సందేశ్ జింగాన్

ఫుట్‌బాల్

19

అదితి అశోక్

గోల్ఫ్

20

దీపక్ హుడా

కబడ్డీ

21

సారిక కాలే

ఖో-ఖో

22

దత్తు బబన్ భొఖనాల్

రోయింగ్

23

మధురిక పాట్కర్

టేబుల్ టెన్నిస్

24

శివ కేశవన్

వింటర్ స్పోర్ట్స్

25

సుయశ్ నారాయణ్ జాదవ్పారా

స్విమ్మింగ్

26

సందీప్

పారా అథ్లెటిక్స్

27

మనీశ్ నర్వాల్

పారా షూటింగ్

ద్రోణాచార్య అవార్డు (లైఫ్ టైమ్ కేటగిరీ-8):

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

ధర్మేంద్ర తివారీ

ఆర్చరీ

2

పురుషోత్తమ్ రాయ్

అథ్లెటిక్స్

3

శివ్ సింగ్

బాక్సింగ్

4

రమేశ్ పథానియా

హాకీ

5

కృషన్ కుమార్ హుడా

కబడ్డీ

6

విజయ్ బాలచంద్ర మునీశ్వర్

పవర్‌లిఫ్టింగ్

7

నరేశ్ కుమార్

టెన్నిస్

8

ఓంప్రకాశ్ దహియా

రెజ్లింగ్

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ-5):

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

జూడ్ ఫెలిక్స్

సెబాస్టియన్ హాకీ

2

జస్పాల్ రాణా

షూటింగ్

3

కుల్‌దీప్ కుమార్ హండూ

ఉషు

4

యోగేశ్ మాలవియా

మల్లఖంబ్

5

గౌరవ్ ఖన్నా

పారా బ్యాడ్మింటన్

ద్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్) అవార్డు (15):
గతంలో ‘ధ్యాన్ చంద్’ అవార్డును ఒకేసారి అత్యధికంగా ఐదుగురికి ఇచ్చారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

నగిశెట్టి ఉష

బాక్సింగ్

2

లఖా సింగ్

బాక్సింగ్

3

కుల్‌దీప్ సింగ్ భుల్లర్

అథ్లెటిక్స్

4

జిన్సీ ఫిలిప్స్

అథ్లెటిక్స్

5

ప్రదీప్ శ్రీకృష్ణ గాంధే

బ్యాడ్మింటన్

6

తృప్తి ముర్గుండే

బ్యాడ్మింటన్

7

అజిత్ సింగ్

హాకీ

8

మన్ ప్రీత్ సింగ్

కబడ్డీ

9

మంజీత్ సింగ్

రోయింగ్

10

సచిన్ నాగ్

స్విమ్మింగ్

11

నందన్ బాల్

టెన్నిస్

12

నేత్రపాల్ హుడా

రెజ్లింగ్

13

సుఖ్వీందర్ సింగ్ సంధూ

ఫుట్‌బాల్

14

రంజిత్ కుమార్

పారా అథ్లెటిక్స్

15

సత్యప్రకాశ్ తివారీ

పారా బ్యాడ్మింటన్

టెన్సింగ్ నార్కే జాతీయ అడ్వెంచర్ అవార్డులు-2019

సంఖ్య

పేరు

విభాగం

1

అనితా దేవి

ల్యాండ్ అడ్వెంచర్

2

కల్నల్ సర్ఫ్‌రాజ్ సింగ్

ల్యాండ్ అడ్వెంచర్

3

టాకా తముత్

ల్యాండ్ అడ్వెంచర్

4

నరేందర్ సింగ్

ల్యాండ్ అడ్వెంచర్

5

కెవ ల్ హిరెన్ కక్కా

ల్యాండ్ అడ్వెంచర్

6

సేతేంద్ర సింగ్

వాటర్ అడ్వెంచర్

7

గజానంద్ యాదవ

ఎయిర్ అడ్వెంచర్

8

దివంగత మాగన్ బిస్సా

లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయం): పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్).
రాష్టీయ్ర ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్:

  • ఐడెంటిఫికేషన్ అండ్ నుర్ట్యూరింగ్ ఆఫ్ బడ్డింగ్ అండ్ యంగ్ టాలెంట్: 1. లక్ష్య ఇన్‌స్టిట్యూట్ 2. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్
  • ఎన్‌కరేజ్‌మెంట్ టు స్పోర్ట్స్ థ్రూ కార్పొరేట్ సోషియల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ)
  • ఎంప్లాయిమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ మెజర్స్: ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్
  • స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనెజ్‌మెంట్(ఐఐఎస్‌ఎమ్)

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎనర్జీ లీడర్ అవార్డు
ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పర్యావరణ హితమైన చర్యలతో ముందుకెళుతున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ పురస్కారాలు లభించాయి. 2020 కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా, గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ ఆధ్వర్యంలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ జాతీయ అవార్డుల్లో భాగంగా ‘నేషనల్ ఎనర్జీ లీడర్’అవార్డుతో పాటు ‘ఎక్స్‌లెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్’అవార్డును పొందినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో ఎయిర్‌పోర్టు అవార్డులు పొందిందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు, ఎక్స్‌లెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్ అవార్డుల విజేత
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
ఎందుకు : ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పర్యావరణ హితమైన చర్యలతో ముందుకెళుతున్నందున

ఫాస్టెస్ట్ హ్యూమన్ కేలిక్యులేటర్‌గా పేరొందిన వ్యక్తి?
గణితంలో అత్యంత వేగంగా గణన ప్రక్రియ పూర్తిచేసిన మానవ కంప్యూటర్‌గా హైదరాబాద్‌కు చెందిన నీలకంఠ భాను ప్రకాశ్ పేరొందాడు. 2020, ఆగస్టు 15న లండన్‌లో నిర్వహించిన ‘మైండ్ స్పోర్ట్ ఒలింపియాడ్’లో గణితంలో అసాధారణ తెలివితేటలు చూపి గోల్డ్ మెడల్ సాధించి అత్యంత ఫాస్టెస్ట్ హ్యూమన్ కేలిక్యులేటర్‌గా భాను రికార్డులకెక్కాడు. పోటీలో సుమారు 13 దేశాలకు చెందిన 30 మంది మేధావులు పాల్గొన్నారు. మోతీనగర్‌లో నివాసముంటున్న ఏళ్ల భాను ప్రకాశ్ విశ్వవిఖ్యాత హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ....
గణితంలో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారాలను కనిపెడుతున్న భాను ప్రకాశ్ ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమ్యాటిక్స్ (హానర్స్) చదువుతున్నాడు. భాను గతంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాడు. ఇప్పటివరకు 5 వరల్డ్ రికార్డులు, 50 లిమ్కా వరల్డ్ రికార్‌‌ట్సను సాధించి అందరి మన్ననలు పొందాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
గణితంలో అత్యంత వేగంగా గణన ప్రక్రియ పూర్తిచేసిన మానవ కంప్యూటర్
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : నీలకంఠ భాను ప్రకాశ్
Published date : 25 Sep 2020 03:40PM

Photo Stories