Florence Nightingale Award 2021: శిబాని దాస్‌కు.. ప్రతిష్టాత్మక జాతీయ ఫ్లోరె¯న్స్ నైటింగేల్ అవార్డు
Telugu Current Affairs - Awards: ఒడిశా బ్రహ్మపురలోని ఎంకేసీజీ వైద్య కళాశాల ఆసుపత్రి నర్సింగ్ అధికారిణి శిబాని దాస్..ప్రతిష్టాత్మక జాతీయ ఫ్లోరె¯న్స్ నైటింగేల్ అవార్డు–2021కు ఎంపికయ్యారు. త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. జాజ్‌పుర్ జిల్లా కంటాబొణియా గ్రామంలో జన్మించిన శిబాని.. లుచ్ఛాపడలో నివాసముంటున్నారు.25 ఏళ్లుగా రోగుల సేవకు అంకితమైన శిబాని కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో శితలాపల్లి, ఎంకేసీజీలోని కరోనా ప్రత్యేక ఆసుపత్రుల్లో బాధితులకు విశేష సేవలందించి ప్రశంసలందుకున్నారు.
ఆశా వర్కర్లకు డబ్ల్యూహెచ్‌వో పురస్కారం
భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలందిస్తోన్న ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం ప్రకటించింది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం, స్థానిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేసిన ఆరు సంస్థలు, వ్యక్తులకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ పురస్కారాలు ప్రకటించారు.