WHO: ఆశా వర్కర్లకు గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం
Daily Current Affairs in Telugu - Awards: భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలందిస్తోన్న ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలందించడంతో వీరు కీలకంగా ఉన్నారని, కరోనా మహమ్మారి సమయంలో అలుపెరగని విధంగా శ్రమించారని కొనియాడింది.
Daily Current Affairs in Telugu: 2022, మే 21 కరెంట్ అఫైర్స్
Pulitzer Prizes 2022: పులిట్జర్ అవార్డుకు ఎంపికైన భారతీయ ఫోటో జర్నలిస్టు?
ఆరోగ్యవంతమైన సమాజం కోసం, స్థానిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ముందుండి నిబద్ధతతో పనిచేసిన ఆరు సంస్థలు, వ్యక్తులకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ పురస్కారాలు ప్రకటించారు. ఈ సంస్థల్లో భారత ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న 10 లక్షల మంది ఆశా(Accredited Social Health Activist-ASHA)లు కూడా ఉన్నారు.
Lata Mangeshkar: లతా దీన్‌నాథ్ మంగేష్కర్ అవార్డు తొలి గ్రహీత ఎవరు?
డబ్ల్యూహెచ్‌వో..
ఏర్పాటు: ఏప్రిల్ 07, 1948
ప్రధాన కార్యాలయం: జెనీవా, స్విట్జర్‌ల్యాండ్
ప్రస్తుత డెరైక్టర్ జనరల్: టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్
GK Economy Quiz: 2011, 2019 మధ్య కాలంలో దేశంలో అత్యంత పేదరికం ఎంత శాతం తగ్గింది?
GK Science & Technology Quiz: భారతదేశంలో మొట్టమొదటి స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆశా వర్కర్లకు గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం ప్రకటన
ఎప్పుడు : మే 22
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)
ఎందుకు : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలందించడంతో వీరు కీలకంగా ఉన్నారని, కరోనా మహమ్మారి సమయంలో అలుపెరగని విధంగా శ్రమించారని..
Daily Current Affairs in Telugu: 2022, మే 20 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్