Skip to main content

Nelson Mandela International Nobel Peace Prize: భారత్ నుంచి ఎంపికైన వ్వక్తి?

నీలం ఫౌండేషన్ అధినేత, పారిశ్రామిక వేత్త నీలం రవికిరణ్ కు అరుదైన గౌరవం దక్కింది.
Nelson Mandela International Nobel Peace Prize
నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ నోబుల్ పీస్ అవార్డు

ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేసిన సేవలను గుర్తించిన నెల్సన్ మండేలా నోబుల్ పీస్ అకాడమీ రవికిరణ్ను నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ నోబుల్ పీస్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును ఆయనకు డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన కాన్ స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు రాందాస్ అథవాలే, ఫగ్గన్ సింగ్ కులస్తే లు అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ సదస్సుకు ఇండోనేషియా, ఆఫ్గనిస్తాన్, దుబాయ్తో సహా పలు దేశాల నుంచి ప్రముఖులు హాజరవ్వగా, భారత్ నుంచి రవికిరణ్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రవికిరణ్ స్వగ్రామం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం.

Published date : 18 Dec 2021 06:34PM

Photo Stories